Showing posts with label Telangana jobs. Show all posts
Showing posts with label Telangana jobs. Show all posts

తెలంగాణ : కొత్తగా 2200 పోస్టులు?

జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపధ్యంలో మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే రెవెన్యూ శాఖలో 2వేలకు పైగా పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం.. మరో 2200 పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తోంది. పలు శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. జిల్లాల పునర్వ్వస్థీకరణతో కొత్తగా 120 మండలాలు, 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్న విషయం విదితమే. ఇప్పటి లెక్క ప్రకారం ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు 89 పోస్టులు అవసరమవుతాయి. అది కూడా 1977నాటి లెక్కల ప్రకారం చూస్తే అన్ని పోస్టులు కావాలి. కాగా, ఇప్పుడు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో వాటి జనాభా మరింత పెరిగే వీలున్నందున, పాలన సజావుగా సాగాలంటే కొత్త పోస్టుల మంజూరు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల్లో 2200 పోస్టులు భర్తీ చేసే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోంది. కాగా, జిల్లా, డివిజన, మండలాల పునర్‌వ్యవస్థీరణతో ఇటీవలే రెవెన్యూశాఖకు కొత్తగా 2109 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో చాలా పోస్టులను పదోన్నతుల ప్రాతిపదికన, మరికొన్ని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జేసీ అధికారాలపై నేడే నివేదిక
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారుల అధికారాలకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. నివేదిక ఆధారంగా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోల అధికారాలను వర్గీకరిస్తూ జీవోనెం.77ను(ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్‌, జేసీ అధికారాల జీవో) సవరిస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది.

తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు

రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిన 15,222 ఉద్యోగుల భర్తీకి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల విభజన, విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రూప్‌-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌ నుంచి ఎంపీడీవో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్‌-1కు 1000 మార్కులతో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ లో కొత్తగా పేపర్‌ -6ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు సిలబస్‌ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-2 లో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ సహా 12 రకాల పోస్టులుంటాయని పేర్కొంది. ఈ పరీక్షను 675 మార్కులకు నిర్వహిస్తుంది. మరో 17 రకాల పోస్టులతో గ్రూప్‌-3 ని కొత్తగా ఏర్పాటు చేసింది.

సింగరేణిలో కొలువుల జాతర



సింగరేణిలో కొలువుల జాతర

-5,472 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
-ఇంటర్వ్యూల పద్ధతి రద్దు..
-రాతపరీక్షలో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు
-ఇంటర్నల్ పోస్టులు 564
-ఎక్స్‌టర్నల్‌పోస్టులు 2,164
-డిపెండెంట్లు 2,744


singareni

నమస్తే తెలంగాణ, హైదరాబాద్:వందేండ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 5,472 పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రాతపరీక్ష ద్వారా 2,164 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 10వ తేదీన తొలి నోటిఫికేషన్ జారీకానుంది. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, మైనింగ్ విభాగాలకు సంబంధించిన 1,127 పోస్టులు డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలకు సంబంధించినవే కావడం గమనార్హం. మార్చి 3వ తేదీన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మైన్ సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్స్ విభాగాల్లో 771 పోస్టులకు రెండవ నోటిఫికేషన్ వెలువడుతుంది.


తదుపరి మార్చి 31న పారామెడికల్, ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించి 266 పోస్టులకు మూడవ నోటిఫికేషన్ జారీచేస్తారు. సుదీర్ఘ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన సింగరేణి సంస్థను వ్యాపార, వాణిజ్య ప్రక్రియలో ముందుంచేందుకు మరో 17 కొత్త మైనింగ్‌లను చేపట్టే లక్ష్యంతోపాటు సింగరేణి సిరులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షకు అనుగుణంగా సింగరేణి
యాజమాన్యం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది.

list1


ఇప్పటి వరకు ఏటా రెండు శాతం, మూడు శాతం పెరుగుదలకే పరిమితమైన సింగరేణి సంస్థ వచ్చే ఏడాది (2015-16)నుంచి 10శాతం చొప్పున పెరుగుదల(గ్రోత్)ను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తొలుత సంస్థాగతంగా మానవవనరుల(ఉద్యోగాలు) సమీకరణ దిశగా యాజమాన్యం ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రం తొలి ఏడాది సంబరాలనాటికి సింగరేణి కొలువుల జాతర ముగించాలన్న దృఢసంకల్పంతో సీఎండీ ఉండడం విశేషం. సింగరేణిలో డిపెండెంట్లు 2004 సంవత్సరంనుంచి ఉద్యోగాలకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత దశాబ్దకాలంగా వారిగోడును ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు.

దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు లెక్కలు తీసిన యాజమాన్యం.. 2004 మార్చి వరకు 2,744 మంది డిపెండెంట్లు వెయిటింగ్‌లో ఉన్నట్లు నిర్ధారించింది. వీటిల్లో 753 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించగా.. మిగతా 1,991 మంది డిపెండెంట్లకు వచ్చే ఆగస్టునాటికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు సింగరేణిలో పదోన్నతులకు నోచుకోని 564 మంది ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు కల్పించనున్నారు. వివిద హోదా(కేడర్)ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాలను సిద్ధంచేశారు. వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ ప్రక్రియద్వారా భర్తీ చేయతలపెట్టిన 2,164 డైరెక్టు రిక్రూట్‌మెంట్ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వులకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల(ఆర్వోర్)కు లోబడి పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. అవినీతికి, సిఫార్సులకు ఏమాత్రం ఆస్కారంలేకుండా రాతపరీక్షలో ప్రతిభ (మెరిట్) ఆధారంగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కృతనిశ్చయంతో సింగరేణి ఉంది. ఇందుకోసం రాతపరీక్ష తర్వాత ఇంటర్వూల పద్ధతికి స్వస్తి పలికింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న సింగరేణి రిక్రూట్‌మెంట్ విభాగాన్ని ప్రక్షాళన చేసింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అనువుగా నిబద్ధత కలిగిన 50 మంది అధికారులు, సిబ్బందిని అదనంగా ఈ విభాగంలో పనిచేసే అవకాశాన్ని కల్పించింది.

జనవరి మొదటివారంలో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వేగంగా చర్యలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శ్రీకారం చుట్టింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగ నోటిఫికేషన్లపై వెనువెంటనే దృష్టిసారించారు. నిరుద్యోగుల్లోని ఆతృతను దగ్గనుంచి ఎరిగినవారు కావటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనిలోపడ్డారు. భారీ సంఖ్యలో టీచర్ల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేయడానికి వారు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. టీచర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)కి బదులుగా టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, రాత పరీక్షల విధానం, తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా పరీక్షల సిలబస్‌లో మార్పులు, చేర్పులతోనేనోటిఫికేషన్ జారీ చేయాలన్న ఆలోచనతో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు సమాచారం. ఈలోగా ప్రభుత్వం అనుమతిస్తే సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ల భర్తీచేపట్టాలని, లేదంటే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశాలను పరిశీలించాలని కమిషన్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, విభాగాలవారీగా గ్రూప్-2 ఖాళీల వివరాలు సర్వీస్ కమిషన్‌కు ఇంకా అందించాల్సి ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉంటుందని కమిషన్ సభ్యులు తెలిపారు. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తిచేసి మరో రెండు వారాల్లో ఏదో ఒక నోటిఫికేషన్ జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. వరుసగా నోటిఫికేషన్లు: టీచర్, గ్రూప్-2 నోటిఫికేషన్లకు మొదటి ప్రాధాన్యంఇస్తున్నప్పటికీ త్వరలోనే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీచేసే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అధికారుల ద్వారా తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలైన టీఎస్‌ ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో కూడా భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. పోలీస్, జైళ్లు, ఆరోగ్యశాఖల్లోని ఖాళీల భర్తీకి కూడా భారీ సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. వీటన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా మొత్తం 1.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ కసరత్తు చేస్తున్నది

సమాచారం... ఉద్యోగాలు


టెక్నికల్‌ సూపరింటెండెంట్‌లు అస్సాంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ
 కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
- జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌లు-24-
ఇతర ఖాళీలు :
అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-2,
మెడికల్‌ ఆఫీసర్‌-1,
వర్క్‌షాప్‌ సూపరింటెండెంట్‌-1,
అసిస్టెంట్‌ ఇంజనీర్‌-1,
 స్టాఫ్‌ నర్స్‌-1,
జూనియర్‌ అకౌంటెంట్‌-1,
మల్టీఫంక్షనల్‌ అసిస్టెంట్‌-2.

దరఖాస్తు : వెబ్‌ సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు,
చివరి తేదీ : ఆగస్టు 4
వెబ్‌సైట్‌ : www.cit.in

బార్క్‌లో అప్రెంటీస్‌షిప్‌ ముంబయిలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ట్రేడ్‌ అప్రెంటీస్‌షిప్‌ శిక్షణలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

సీట్లు : 18 (మెకానికల్‌-8, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌-2, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌-4, ఎక్స్‌రే టెక్నీషియన్‌-2, ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్‌-2)
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
 చివరి తేదీ : ఆగస్టు 31
వెబ్‌సైట్‌ : www.barc.gov.in


ఎయిమ్స్‌, న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 
 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
ఖాళీలు : అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ -96- విభాగాలు : అనాటమీ, బయోఫిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, సి.టి.వి.ఎస్‌, సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఈ.ఎన్‌.టి, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడిసిన్‌, న్యూరోసర్జరీ, మొదలైనవి.
వయసు : 50 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ : ఆగస్టు 14
వెబ్‌సైట్‌ : డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిమ్స్‌ఎక్జామ్స్‌.ఓఆర్‌జి

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది 
 ఖాళీలు :అసిస్టెంట్‌ ఎపిగ్రాఫిస్ట్‌-3, డైటీషియన్‌-15, బోసన్‌-5, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-8, క్లర్క్‌-1, అసిస్టెంట్‌ మేనేజర్‌ కమ్‌ స్టోర్‌ కీపర్‌-1, ఫొటోగ్రాఫర్‌-1, జూనియర్‌ కార్టోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌-1, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-21, అకౌంటెంట్‌-1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-1, స్టోర్‌ సూపరింటెండెంట్‌-1, సీనియర్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-4, చార్ట్‌మెన్‌-13, క్వారంటైన్‌ ఇన్‌స్పెక్టర్‌-3, డిప్యూటీ రేంజర్‌-3, సీనియర్‌ రేడియో టెక్నీషియన్‌-1.-
ఎంపిక :-కామన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ /ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్‌ / స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా
 దరఖాస్తు : ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
చివరి తేదీ : ఆగస్టు 14
వెబ్‌సైట్‌ : www.sscwr.net


Followers