అనవసర ఖర్చులను తగ్గించేందుకు 9 మార్గాలు

అనవసర ఖర్చులను తగ్గించేందుకు 9 మార్గాలు

రోజువారీ ఉద్యోగంలో జీతం పెరగడం ఒక్కటే ముఖ్యం కాదు. మన ఖర్చులు సక్రమంగా ఉంటే ఆదాయ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఎంతో మంది యువతీ యువకులు చాలా ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ పొదుపు దగ్గరికి వచ్చే సరికి మాత్రం విఫలమవుతున్నారు. విపరీతమైన షాపింగ్ అలవాటుతో అవసరం లేని వాటిని కొంటున్నారు. మీ ఖర్చులను కింది కొన్ని మార్గాల ద్వారా తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు. మొదట కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ ఒకసారి పొదుపు చేయడం మొదలెడితే అది అలవాటుగా మారిన తర్వాత బాగా ఉంటుంది.
Source: telugu.goodreturns.in

ఈ-మెయిల్ ఐడి... ఓ గంట కోసం!







ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి కొన్ని వెబ్ సైట్లు మన పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడి అడుగుతుంటాయి. పేరు, చిరునామా పర్వాలేదు కానీ.. ముక్కూ మొహం తెలియని వెబ్ సైట్లకు మన ఈ-మెయిల్ ఐడి ఇవ్వడం సురక్షితమేనా? ఇలాంటి అనుమానం మీకు కలిగినప్పుడు డిస్పోజబుల్ (యూజ్ అండ్ త్రో) ఈ-మెయిల్ ఐడితో మీ పని ముగించవచ్చు. అరె.. డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడి కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండి మరి!
కొన్ని కోట్ల వెబ్ సైట్లు, లక్షల బ్లాగ్ లతో ఇప్పుడు ఇంటర్నెట్ ఒక మహాసముద్రం అయిపోయింది. ఆన్ లైన్లోకి అడుగుపెట్టడమంటే.. ఈత రాని వ్యక్తి ఓ చిన్న పడవలో సముద్రంలోకి బయలుదేరడమే. వెబ్ బ్రౌజింగ్ సమయంలో కొన్నిసార్లు ఆన్ లైన్ అప్లికేషన్లు భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన పేరు, చిరునామా, ఉపయోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడి సహా బోలెడు వివరాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
పేరు, చిరునామా ఇవ్వడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తవుకానీ, ఎటొచ్చీ ఈ-మెయిల్ ఐడి ఇవ్వాల్సిరావడమే తలనొప్పి. ఒక్కోసారి మీ ఈ-మెయిల్ ఐడి దుర్వినియోగం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఒకవేళ ఈ-మెయిల్ ఐడి లేనివారయితే తప్పనిసరిగా ఏదో ఒక ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ను ఆశ్రయించి అప్పటికప్పుడు ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవలసి వస్తుంది. అయితే నెటిజన్లను ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఇంటర్నెట్ లో కొన్ని డిస్పోజబుల్ ఈ-మెయిల్ సర్వీసులు కూడా లభిస్తాయి. వీటిలో చెప్పుకోదగ్గది గొ రిల్లా మెయిల్ (Guerrilla Mail ). ఒక్క ఇంగ్లీషులోనే కాక డచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోలిష్, స్పానిష్ వంటి భాషల్లో సైతం ఈ తాత్కాలిక ఈ-మెయిల్ సౌకర్యం లభిస్తుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత కేవలం గంట సేపు మాత్రమే ఈ ఈ-మెయిల్ ఐడి ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే మాయమైపోతుంది. అందుకే దీనిని డిస్పోజబుల్ ఈ-మెయిల్ అని, యూజ్ అండ్ త్రో ఈ-మెయిల్ అని పిలుస్తారు. ఆ గంట సేపూ యాహూ, రెడిఫ్, జీమెయిల్ వంటి రెగ్యులర్ ఈ-మెయిల్ సర్వీస్ ల మాదిరిగానే ఈ 'గొరిల్లా మెయిల్ కూడా పనిచేస్తుంది. ఇందులో ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తరువాత మీరు ఎవరికైనా మెయిల్ పంపుకోవచ్చు. ఒకవేళ అవతలి వాళ్ళు కూడా మీకు తిరిగి వాళ్ళ ఈ-మెయిల్ ఐడి నుంచి రిప్లై మెయిల్ ఇస్తే దాన్ని మీరు చదువుకోవచ్చు కూడా. కాకపొతే ఇదంతా సరిగ్గా 60 నిమిషాలు.. అంటే గంటలోనే పూర్తి కావాలి. ఆ తర్వాత మీరు ఎంత వెతికినా మీ ఈ-మెయిల్ ఐడి మీకే కాదు, ఎవరికీ కనబడదు.
బాగుంది కదూ? ఈసారి ఎప్పుడైనా ఆన్ లైన్ లో ఎవరికైనా మీ శాశ్వత ఈ-మెయిల్ ఐడి ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే, అది ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే.. మీరు నిరభ్యంతరంగా ఈ 'గొరిల్లా మెయిల్' సర్వీసును ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా ట్రై చేయవచ్చు..
ఇంటర్నెట్ లో తాత్కాలికంగా ఈ-మెయిల్ సర్వీసులు అందిస్తున్నది ఒక్క 'గొరిల్లా మెయిల్' మాత్రమే కాదు. ఇంకా ఇలాంటి డిస్పోజబుల్ ఈ-మెయిల్ సర్వీసులు చాలా ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినవి.. 10 మినిట్ మెయిల్.కాం, మెయిలినేటర్.కాం, యోప్ మెయిల్.కాం, మింట్ ఈమెయిల్.కాం, మెయిల్ డ్రాప్.సిసి, జేటేబుల్.ఆర్గ్ వంటివి కూడా గొరిల్లా మెయిల్ మాదిరిగానే టెంపరరీగా ఈ-మెయిల్ సర్వీస్ అందిస్తాయి.
వీటిలో 10 మినిట్ మెయిల్.కాం అందించే మెయిల్ సర్వీసు కేవలం పదంటే పది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా గడువును మరో పది నిమిషాలు పెంచుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా గడువును పెంచుకోవచ్చుగానీ, ఆ పది నిమిషాల గడువు తీరక మునుపే గడువును పెంచుకుంటూ ఉండాలి.
ఇక మెయిలినేటర్.కాం విషయానికొస్తే.. ఇది కూడా గొరిల్లా మెయిల్ మాదిరిగానే ఒక గంట సేపు మాత్రమే పనిచేస్తుందికానీ ఇందులో ఒక సౌలభ్యం ఉంది. అదేమిటంటే.. ఒక్కసారి మీరు ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఇక దానిని తర్వాతెప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతిసారీ అదే ఈ-మెయిల్ ఐడిని ఉపయోగించి వెబ్ సైట్ లోకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే సైన్ ఇన్ అయిన ప్రతిసారీ ఓ గంటలోగా మీ మెయిల్ ఐడి ద్వారా మెయిల్ సర్వీస్ పొందవచ్చు. కానీ ఇందులో ఉన్నఒక అసౌకర్యం ఏమిటంటే.. భద్రత లేకపోవడం. అంటే.. మీ ఈ-మెయిల్ ఐడి తెలిసిన ఎవరైనా అదే ఐడిని ఉపయోగించి ఎవరికైనా ఈ-మెయిల్ పంపవచ్చు. ఇది మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
మింట్ మెయిల్.కాం కూడా 10 మినిట్ మెయిల్.కాం మాదిరిగానే 10 నిమిషాలపాటే పనిచేస్తుంది. అయితే 10 నిమిషాల గడువు ఆటోమాటిక్ గా పొడిగింపబడటం ఇందులో ఉన్న ప్రత్యేకత. అంటే.. మీ మెయిల్ ఇన్ బాక్స్ లోనికి ఏదైనా మెయిల్ వచ్చినప్పుడల్లా మీ ఐడి గడువు పొడిగింపబడుతూ ఉంటుందన్నమాట.
ఇక జెటేబుల్.ఆర్గ్ విషయానికొస్తే.. ఇతర అన్ని తాత్కాలిక ఈ-మెయిల్ సర్వీసుల కంటే కూడా అధునాతన, యాంటీ స్పామ్ టెక్నాలజీ కలిగినటువంటి సర్వీస్ ఇది. కొన్ని వెబ్ సైట్లు ఈ టెంపరరీ డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడిలను స్పామ్ కింద పరిగణిస్తాయి. అలాంటి సమయంలో ఈ జెటేబుల్ మెయిల్ ఐడి అక్కరకొస్తుంది. ఇది మొదట మీ ఒరిజినల్ శాశ్వత ఈ-మెయిల్ ఐడిని గుర్తుంచుకుంటుంది. ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న జెటేబుల్ మెయిల్ ఐడికి వచ్చే ఇన్ కమింగ్ మెయిల్స్ అన్నిటినీ మీ ఒరిజినల్ శాశ్వత ఈ-మెయిల్ ఐడికి చేరవేస్తూ ఉంటుంది. మీరు పెట్టుకున్న గడువు తీరిపోగానే మీ జెటేబుల్ మెయిల్ ఐడి ఎవరికీ కనిపించదు.
మొత్తానికి ఈ డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడిల కథా కమామిషు బాగుంది కదూ?!


Tags: mail Tips, Mails Tool, Gmail Tool, New Mail, Create Mail, How To Create New Mail in Telugu,

డైలీహంట్ ‘ఎగ్జామ్ ప్రిపరేషన్స్’ ఒక ప్రత్యేక యాప్ - ఇన్ స్టాల్ చేసుకోండి ఇప్పుడే!


డైలీహంట్ యాప్ ప్రకటనను తరచూ చూస్తున్న, ముఖ్యంగా స్టడీ అండ్ ప్రెప్ విభాగాన్ని తరచూ సందర్శిస్తున్న వారు హటాత్తుగా ఆ విభాగం నుంచి పుస్తకాలు & పరీక్షలు తొలగింపబడడం చూసి ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కానీ ఎలాంటి చింత అవసరం లేదు. డైలీహంట్ ఎగ్జామ్ ప్రెప్ మాదిరిగానే ఇది కూడా ఇప్పుడు ప్రత్యేక యాప్ గా రూపాంతరం చెందింది. మీరెంతో దీక్షతో మీ పరీక్షల గురించి ప్రిపేర్ అవుతున్న ఈ తరుణంలో ఇక మీకెలాంటి ఇబ్బంది కలగదు. కరంట్ అఫైర్స్ అప్ డేట్స్, ఎగ్జామ్ అలర్ట్స్, మ్యాగజైన్లు మరియు పరీక్షలతో సహా ఆకడమిక్స్ మరియు ప్రిపరేషన్స్ కు సంబంధించి అన్నింటిని మీరు పొందగలుగుతారు.
యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు కింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి మరియు 30 రోజుల కాలావధి వరకు 25% ప్రత్యేక తగ్గింపును పొందండి.
ఈ కొత్త 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ లో..
పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్ధులకు ఉపయోగపడే ఎన్నో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ ను ఉపయోగించి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే.. మీరు మీకోసం ఒక వ్యక్తిగత ట్యూటర్ ను నియమించుకున్నట్లే. యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరి, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లో కొత్తగా ఉన్నదేంటి?
ఈ కొత్త యాప్ అందిస్తున్న సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు తమకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను పరిమిత కాలావధి వరకు భారీ తగ్గింపు ధరలకు పొందవచ్చు. ఇంకా అభ్యర్థులు యాప్ పై ప్రస్తుతం అమలులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్ కింద అన్ని రకాల స్టడీ మెటీరియల్ పై 25% తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ ఆవిష్కృతమైన రోజు నుంచి 30 రోజుల వరకు మాత్రమే. ఈ ఆఫర్ ను పొందాలనుకుంటే యాప్ లో MYEXAM అనే కోడ్ ను ఉపయోగించవలసి ఉంటుంది. యాప్ లోని అన్ని రకాల స్టడీ మెటీరియల్ పై మీకు అవసరమైనన్నిసార్లు మీరు ఈ కోడ్ ను ఉపయోగించుకోవచ్చు. మీకిదొక మంచి అవకాశం. ఖరీదైన స్టడీ మెటీరియల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయడం ద్వారా మీకెంతో డబ్బు ఆదా అవుతుంది.
మరి, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ ను ఏ రకంగా భిన్నమైనది?
  • ఇందులోని మొట్టమొదటి ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఈ యాప్ పూర్తిగా పోటీ పరీక్షలు మరియు వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ పైనే ఫోకస్ కలిగి ఉండడం. ఇందులో మీ ఏకాగ్రతను భంగపరిచే, పోటీ పరీక్షలకు సంబంధం లేని ప్రకటనలు లేదా పుస్తకాలు ఏమాత్రం ఉండవు.
  • యాప్ లో అన్ని భాషల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. అంటే.. TNPSC నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు వారికి అవసరమైన, తమిళంలోనే ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ మరియు టెస్ట్ పేపర్స్ ను నేరుగా వారి మొబైల్ ఫోన్లలోకే డౌన్లోడ్ చేసుకోవచ్చన్నమాట.
  • స్టడీ మెటీరియల్ మరియు టెస్ట్ పేపర్స్ అన్నీ మొబైల్ ఫోన్ లోనే ఉండడం, ఆఫ్ లైన్ లోనూ (ఇంటర్నెట్ అవసరం లేకుండానే) వాటిని పొందగలిగే అవకాశం ఉండడం వల్ల అభ్యర్థులు ప్రయాణాల్లో సైతం ఆయా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు.
  • ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లో ప్రముఖ ప్రచురణ కర్తలు ప్రచురించిన 'కరంట్ అఫైర్స్ 2016 ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్', '21 ఇయర్స్ CSAT జనరల్ స్టడీ క్వశ్చన్స్' మరియు 'అర్థమాటిక్ ఫర్ బ్యాంక్ PO ఎగ్జామ్స్'.. వంటి పుస్తకాలు ఉన్నాయి. అంటే.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు అవసరమయ్యే నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఈ యాప్ ద్వారా లభిస్తుందన్నమాట.
  • అంతేకాదు, ఈ యాప్ ద్వారా అభ్యర్థులు రాబోయే పోటీ పరీక్షలు, పరీక్షల షెడ్యూల్ లో మార్పులు, ఆయా పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల ప్రకటనలు, కొత్త పరీక్షల విధి విధానాలు మరియు స్టడీ మెటీరియల్ కు సంబంధించిన రోజువారీ అప్ డేట్స్ కూడా పొందగలుగుతారు.
  • ఇంకా, అభ్యర్థులు తమ ర్యాంక్, స్కోర్ మరియు డైలీ ప్రోగ్రెస్ తెలుసుకోవచ్చు. ఏ సబ్జెక్టులో ఎక్కడ బలంగా ఉన్నారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో కూడా తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ ర్యాంక్ కోసం అభ్యర్థులు జాతీయ స్థాయిలో పరస్పరం పోటీ పడవచ్చు. అంటే.. ప్రాక్టీస్, మాక్ టెస్ట్ ల ద్వారా అభ్యర్థులు ప్రతిసారీ మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ యాప్ లో తగిన అవకాశం ఉంటుంది.
ఇప్పటికే డైలీహంట్ యాప్ యొక్క పాత టెస్ట్ ప్రెప్ వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి కూడా సంతోషకరమైన వార్త ఏమిటంటే.. అలాంటి వారు ప్రస్తుత సరికొత్త 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ కు గనుక అప్ డేట్ అయినట్లయితే, వారి పాత కొనుగోళ్ళు అన్నీ కూడా భద్రంగా ఉంటాయి. పాత టెస్ట్ ప్రెప్ యాప్ అకౌంట్ వివరాలతోనే కొత్త ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లోకి కూడా సైన్ ఇన్ అవొచ్చు మరియు గతంలో వారు కొనుగోలు చేసిన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ను కొత్త యాప్ లో కూడా పొందవచ్చు.
ఒకవేళ మీరు కొనుగోలు చేసిన పుస్తకాలు, పరీక్షలు ఏమీ కనిపించడం లేదని ఆశ్చర్యపోతున్నారా? డోంట్ వర్రీ. మీరు గనుక కొత్త యాప్ కి మైగ్రేట్ అయితే అక్కడ మీరు మీ పాత కొనుగోళ్ళు అన్నీ సురక్షితంగా ఉండడం చూసి మీరే ఆనందపడతారు. జస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే.. మీ పాత ఖాతా వివరాలతో మరోసారి కొత్త యాప్ లోకి సైన్ అప్ అయితే ఇప్పటివరకు మీరు కొనుగోలు చేసినవన్నీ తిరిగి పొందగలుగుతారు.
ఈ 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి




వనితా.. శతకోటి వందనం!


వనితా.. శతకోటి వందనం! 

 


ఎన్నెన్ని ఆశలో.. ఎన్నెన్ని అంచనాలో.. ఆ ఆశలు, అంచనాలు కుప్పకూలిపోతున్న వేళ.. ఎంత నైరాశ్యమో.. ఎన్ని నిట్టూర్పులో! అంచనాలు 'పతకాల' స్థాయి నుంచి 'పతకం' వరకు పడిపోయి.. అసలు రియోలో భారత్‌ ఖాతా అయినా తెరుస్తుందా అని సందేహంగా చూస్తున్న సమయంలో.. పతక కరవు తీర్చేదెవరని ఆశగా చూస్తున్న తరుణంలో.. ఒకరికి ఇద్దరు వచ్చారు.. ధీర వనితలు! ఒకరు దేశం గాఢ నిద్రలో ఉన్న సమయంలో అసాధారణ పోరాట పఠిమను ప్రదర్శిస్తూ భారత్‌ను పతకాల పట్టిక ఎక్కిస్తే.. ఇంకొకరు దేశమంతా కళ్లు విచ్చుకుని చూస్తుండగా ఉర్రూతలూగించే ఆటతో పతకానందాన్ని రెట్టింపు చేశారు. ఒక్క పతకం.. ఒక్క పతకం..
అంటూ పన్నెండు రోజుల పాటు నిట్టూర్చిన భారతావని.. ఒక్క రోజు వ్యవధిలోనే రెండు పతక ప్రదర్శనలతో మురిసిపోయింది. 'పతక' ఆకలితో నకనకలాడుతున్న భారత క్రీడాభిమానులకు ఆమె దాహం తీరిస్తే.. ఈమె విందే చేయించింది.

హరియాణా కుస్తీ నారి సాక్షి మలిక్‌ అసామాన్యమైన 'పట్టు'దల.. హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు అసాధారణ 'రాకెట్‌' వేగం.. రియో ఒలింపిక్స్‌లో భారత్‌ను పతక సంబరంలో ముంచెత్తాయి. సాక్షి అద్భుత పోరాటంతో కాంస్యం గెలిస్తే..

మన తెలుగు తేజం సింధు మరింత గొప్ప ప్రదర్శనతో కనీసం రజతం ఖాయం చేసింది. ఒలింపిక్స్‌లో 'కంచు'ను మించిన ప్రదర్శన చేసిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సింధును స్వర్ణమూ వూరిస్తోంది. ఆమె ప్రదర్శన ఇంకా అయిపోలేదు. శుక్రవారమే పసిడి పోరు.

గురువారం మైదానంలో సింధు కసి.. ఆమె ఆధిపత్యం చూస్తే.. పసిడి అత్యాశేమీ కాదనిపిస్తోంది. మరి మన సింధు మరో అద్భుతం చేస్తుందా..

భారత క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తుందా?


Followers