చరిత్రకు స్క్రీన్ ప్లే ఉండదు ('రుద్రమదేవి' ‌ రివ్యూ)

charitraku skrin ple undadu
సూర్య ప్రకాష్ జోశ్యుల చరిత్రంలో అజరామరంగా నిలచిపోయిన 'రుద్రమదేవి' చిత్రం అనగానే యుద్దాలు, వీరోచిత పోరాటాలు ఉంటాయోమో అని ఆశపడటం సహజం. అయితే గుణశేఖర్..ఓ కుటుంబ డ్రామాలాంటి కథను తెరకెక్కించాలనుకున్నాడు. 'రుద్రమదేవి' జీవితంలో ఉన్న చిన్నప్పుడే పడిన చిన్న మెలిక ( ఆ మెలిక క్రింద కథలో చూడండి) ను ఆధారం చేసుకుని కథనం అల్లు కున్నాడు. అంతేగానీ ..ఓ స్త్రీ పాలకురాలై ..చుట్టూ మొహరించి ఉన్న శత్రువులను నుంచి ఎలా తనను, తన రాజ్యాన్ని కాపాడుకుంది..ఆ క్రమంలో ఏమేం ఎత్తులు వేసింది..ఏ ఇబ్బందులు పడింది అన్నట్లు కథనం రాసుకోలేదు. దాంతో కథలో ఉన్న ఏకైక వీరోచిత పాత్ర గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) ఎప్పుడొస్తుందా..అని ఎదురుచూస్తూ కూచోవటమే ప్రేక్షకుడు వంతు అయ్యింది. ఇది గోన గన్నారెడ్డి వైపు నుంచి రాసుకున్న కథగా ఉంది కానీ 'రుద్రమదేవి' కథలాగ లేదు. అలాగే రానాను హైలెట్ చేస్తూ మొదటి నుంచి పోస్టర్స్, ట్రైలర్స్ కట్ చేసారు. అయితే సినిమాలో రానాకు అసలు ప్రయారిటీనే లేదనేది సుస్పష్టం. రుద్రమదేవి(అనుష్క) పుట్టేటప్పడికి కాకతీయ సామ్రాజ్య పరిస్దితులు బాగోలేవు... ఓ ప్రక్క దాయాదుల నుంచి, మరో ప్రక్క శత్రువుల నుంచి రాజ్యానికి ముప్పు ఉంది. మగపిల్లవాడు పుడితే తమ వారసుడుగా ఏలుతాడు అనుకుంటే పుట్టింది ఆడపిల్ల అని తెలిసి రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు) నిరాశపడతాడు. వారసుడు లేడు అని తెలిస్తే వెంటనే వారంతా దండెత్తే అవకాసం ఉందని ఏం చేయాలో అని ఆలోచనలో పడితే అప్పుడు ఆయన మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) ఓ సలహా ఇస్తాడు. బయిట ప్రపంచానికి తెలియకుండా ఆమెను మగపిల్లాడిలా నమ్మిస్తూ పెంచమంటాడు. ఆ క్రమంలో ఓ కొడుకులాగ రుద్రమదేవిని పెంచుతాడు. ఆమె పెరిగి పెద్దయ్యాక వివాహం సైతం ముక్తాంబ(నిత్యామీనన్ )ని ఇచ్చి చేస్తారు. ఇదే సమయంలో బందిపోటు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రుద్రమదేవితో పోరుకు సై అంటాడు. అప్పుడు ఏం జరిగింది...రుద్రమదేవి...మగపిల్లాడు కాదు...స్త్రీ అనే విషయం ఎలా రివీల్ అయ్యింది. ఆమెను ప్రేమించిన వీరభధ్రుడు (దగ్గుపాటి రానా) ఏం చేసి ఆమెను పొందాడు...రుద్రమదేవి తన ముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొని వీర నారి అయ్యింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తొలి నుంచి పౌరాణికాలు వచ్చినట్లుగా మన తెలుగులో చారిత్రక కథాంశాలతో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. బొబ్బలి యుద్దం, తాండ్ర పాపారాయుడు, అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్, ఇలా తెలుగు జాతి చరిత్రను చెప్పేవి అరుదు. ఎందుకంటే చరిత్రను తెరకెక్కించేటప్పుడు చాలా నిబద్దత అవసరం. ముఖ్యంగా కల్పనకు చోటు తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో సినిమాటెక్ ట్విస్ట్ లు, కమర్షియల్ ఎలిమెంట్స్ కు మార్గం ఉండదని దర్శకులు భావిస్తూంటారు. అయితే చాలా కాలం తర్వాత దర్శకుడు గుణశేఖర్...మనదైన చరిత్రలో నిలిచిపోయిన వీరనారి ..'రుద్రమదేవి' ‌ చరిత్రను తెరకెక్కించాలని అనపించి, కష్ట నష్టాలకు ఓర్చి తెరకెక్కించాడు. అందుకు ఆయన్ను ముందుగా మనస్పూర్తిగా అభినందించాలి. అయితే ఆయన ఈ తెరకెక్కించే ప్రాసెస్ లో సరైన స్క్రీన్ ప్లేను సమకూర్చుకోవటం మర్చిపోయాడు. అయితే చరిత్ర ...మన తెలుగు స్క్రీన్ ప్లే ను అనుసరించటం కష్టమే అయినా...మరింత ఆ విభాగంలో కష్టపడితే బాగుండేది అనిపిస్తుంది. అలాగే ఆ వీరనారి సాహసకృత్యాలను ,వీరోచిత పోరాటాలను కూడా మరింత సమర్దవంతంగా చూపించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కానీ దర్శకుడు కాన్సర్టేషన్ మొత్తం అల్లు అర్జున్ చేసిన ఎపిసోడ్ మీద ఉన్నట్లుంది. గోన గన్నారెడ్డిగా ఆ పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. ప్రకాష్ రాజ్ ఫెరఫార్మెన్స్, కొన్ని విజువల్స్ లేకపోతే నీరసపడ్డ సెకండాఫ్ ని లాక్కెళ్లటం కష్టమయ్యేది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మరింత ప్రతిభావంతంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉంది. మిగతా రివ్యూ స్లైడ్ షోలో... ఫైనల్ గా 'రుద్రమదేవి' అనేదానికన్నా ఈ సినిమాకు గోన గన్నారెడ్డి అనే టైటిల్ పెట్టి అల్లు అర్జున్ ఎపిసోడ్స్ పెంచితే బాగుండును అనిపిస్తుంది. ఓ గొప్ప చిత్రం చూడబోతున్నాం అని ఎక్సపెక్టేషన్స్ తో కాకుండా మన జాతికి సంభందించిన ఓ చారిత్రక చిత్రం చూస్తున్నాం...అని వెళితే అంతగా నిరాశపరచదు. అలాగే.. అల్లు అర్జున్..'గమ్మునుండవో..' అంటూ సాగదీసి చెప్పే డైలాగ్ కోసం కూడా చూడవచ్చు. రేసుగుర్రంలో ద్యాముడా డైలాగులా ఇదీ పాపులర్ అవుతుంది. Source: telugu.filmibeat.com వాస్తవానికి రుద్రమదేవి కథ మనలో చాలా మందికి కొత్తమీ కాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నదే...తమదైన శైలిలో చదువుకునేటప్పుడు, టీచర్లు చెప్తూంటే విన్నప్పుడు విజువలైజ్ చేసుకున్నదే. అలాంటి ఎక్కువ మందికి తెలిసున్న కథని తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేనే మ్యాజిక్ లు చేయాలి, అదే జరగలేదు ఇలాంటి చిత్రంలో విజువల్స్ స్టంన్నింగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా మొన్నే బాహుబలి చూసిన ప్రేక్షకులకు వెలితి తెలియకుండా యాక్షన్ ఎపిసోడ్స్ అద్బుతంగా ఉండాలి. ఇవన్ని గుణశేఖర్ దృష్టిలో పెట్టుకున్నట్లు లేదు. సినిమా చిరంజీవి వాయిస్ ఓవర్ తో రుద్రమదేవి చరిత్రను కొద్దిగా పరిచయం చేస్తూ ..ఇంటెన్స్ గా మొదలవుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ వేడిక్కిస్తాడు. క్లైమాక్స్ కొన్ని లెంగ్తీ ఎమోషన్ సీన్స్ తో ..సీక్వీల్ తీస్తామని చెప్తూ ముగిసేలా ప్లాన్ చేసారు. కేవలం గోన గన్నారెడ్డి పాత్రకు ఓ ట్విస్ట్ పెట్టుకుని అదే సరిపోతుందనికున్నారు. చారిత్రంగా జరిగిన కథకు సమకూర్చిన స్క్రీన్ ప్లే చాలా సినిమాటెక్ గా సాగింది. పాత్రల్లో ఎక్కడా బలం ఉండదు. బాహుబలి (పోలిక కాదు కానీ) ఏమేమి ప్లస్ అయ్యాయో (కీ క్యారక్టర్ల క్యారక్టరైజన్స్, యాక్షన్ ఎపిసోడ్స్) అవే ఇక్కడ మైనస్ అయ్యాయి. గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్ , బాడీ లాంగ్వేజ్, మేనరిజం, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని బాగా కుదిరాయి. అల్లు అర్జున్ పాత్ర నిలబెట్టిందనే చెప్పాలి. అరేయ్ 'గమ్మునుండవో..' అంటూ సాగదీసి చెప్పే డైలాగ్, నేను తెలుగు భాష లెక్క..ఆడా ఉంటా..ఈడా ఉంటా, కోడలికి నీతులు చెప్పి అత్త ఉడాయించిందంట..లాంటి డైలాగులకు సినిమాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగని మొత్తం డైలాగులు అధ్బుతంగా ఉన్నాయని చెప్పలేం. అనుష్క ఇంట్రడక్షన్, అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ రెండూ చాలా బాగా డిజైన్ చేసారు. సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లో అది ఒకటి ఈ సినిమాకు పెద్ద మైనస్ సంగీతం అని చెప్పాలి. పాటలు, రీరికార్డింగ్ రెండూ ఇబ్బంది కలిగిస్తాయి. ఇళయరాజా అభిమానులు ఆశ్చర్యపోయేలా ఉంది అన్ని డిపార్టమెంట్స్ లోకి తోట తరణి గారి కళా దర్శకత్వం, కాస్ట్యూమ్స్ విభాగం సినిమా జానర్ కు తగినట్లు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ లో వావ్ అనిపించే ఒక్క మూవ్ మెంట్ ఉండదు. ఎడిటింగ్ గురించి చెప్పుకోకుండా ఉంటేనే మేలు. బ్యానర్ :గుణ టీమ్ వర్క్స్ నటీనటులు: అనుష్క, దగ్గుపాటి రానా, అల్లు అర్జున్, సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ. కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్. విడుదల తేదీ: అక్టోబర్ 9, 2015


కొన్ని ఫైట్స్, కొంతే కామెడీ ... ('బ్రూస్ లీ' రివ్యూ)

konni faits, konte kaamedi ... ('brus


బ్రూస్ లీ

సూర్య ప్రకాష్ జోశ్యుల మొదటినుంచీ శ్రీను వైట్ల సినిమాలంటే యాక్షన్ కామెడీలకు, కాస్తంత ఫ్యామిలీ ఎమోషన్స్ తిరగమోత పెట్టి వడ్డిస్తాడని తెలిసిందే. దాంతో కామెడీ పండితే అది 'దూకుడు' లేకపోతే 'ఆగాడు' అవుతోంది. అలాగే తను మొదలు పెట్టిన ఫార్మెట్ ని మార్చకుండా హీరోలను మాత్రమే మారుస్తూ వస్తున్నారు. అదే స్కీమ్ లో ఇప్పుడు రామ్ చరణ్ తో విలన్ ఇంట్లో హీరో చేరి అతన్ని ఇబ్బంది పెట్టి, ఆట కట్టించే కథనే కొంచెం అటూ చేసి తీసాడు. బ్రహ్మానందంని ఎప్పటిలాగే సెకండాఫ్ కు తెచ్చాడు. ఇంకొంచెం బలంగా ఉంటుందని The Valet (2006) అనే ఫ్రెంచ్ సినిమాని సైతం తీసుకు వచ్చి కలిపారు. అలీ తో అమీర్ ఖాన్ ..పీకే స్పూఫ్ చేసారు. జయప్రకాష్ రెడ్డి చేత డ్యూయిల్ రోల్ వేయించి కామెడీ చేయించారు. ఇలా ఎన్ని కలిపినా ఎన్ని చేసినా సెకండాఫ్ సోసోగానే సాగి,డ్రాప్ అవుతూ వచ్చింది. అనుకున్న స్ధాయిలో బ్రహ్మీ కామెడీ పేలి ఈ సారి శ్రీను వైట్లను కాపాడలేదు. రామ్ చరణ్ క్యారక్టర్ కు సినిమాలో సరైన సమస్య ఇచ్చే నెగిటివ్ పాత్ర లేకపోవటంతో నీరసపడిపోయింది. అయితే రామ్ చరణ్ మాత్రం నటుడుగా, స్టైల్స్ లోనూ, డైలాగు డెలవరీలోనూ అదరకొట్టారు అని చెప్పటం లో సందేహం లేదు. ముఖ్యంగా డాన్స్ లకు అతను వేసే స్టెప్స్ చాలా బాగున్నాయి. అలాగే సినిమా చివర లో సినిమాని సేవ్ చేయటానికా అన్నట్లు చిరంజీవి ఎంట్రీ...ఆయన చెప్పే...జస్ట్ టైం గ్యాప్ మాత్రమే..టైమింగ్ లో మాత్రం కాదు అనే డైలాగు హైలెట్. అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు. ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 'బ్రూస్ లీ' ఎనౌన్స్ చేయగానే చాలా మందిలో ఒకే ఆలోచన...శ్రీను వైట్ల ఫార్మెట్ లోకి వచ్చి రామ్ చరణ్ చేస్తాడా...లేక రామ్ చరణ్ పంధాలోకి వెళ్లి శ్రీను వైట్ల సినిమా చేస్తాడా అని...అయితే రామ్ చరణ్ మాత్రం దర్శకుడుకే గౌరవం ఇచ్చి...ఆయన ఫార్మెట్ లోకే వెళ్లి సినిమా చేసాడు. ముఖ్యంగా కథకు గానీ, హీరోకు గానీ సరైన లక్ష్యం ఏర్పాటు చేయటంలో విఫలమయ్యారు. దాంతో సినిమాలో ఎక్కడా విలన్ కు, హీరో కు మధ్య కాంప్లిక్ట్ అనేది లేకుండా పోయింది. విలన్ కు అసలు ...ఫలానా వాడు హీరో తనను ఇరికించబోతున్నాడనే విషయం తెలిసే సరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ఆ క్లైమాక్స్ అయినా సవ్యంగా ఉందా అంటే పాత చిరంజీవి సినిమాల్లో లాగ...విలన్ చేసే కిడ్నాపులు(హీరోయిన్ ని, హీరో తండ్రిని) తో నిండిపోతుంది. విలన్ వల్ల తనకు కానీ తన కుటుంబానికి గానీ (ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి) లేదా తనను నమ్ముకున్న జనాలకు కానీ ఇబ్బంది కలిగినట్లు ఎక్కడా చూపరు. అతను విలన్ కాబట్టి హీరో వెళ్లి అతని అసలు రూపం బయిటపెట్టాలి అంతే అన్నట్లు రాసుకున్నారు సీన్స్. ఓ క్రిమినల్ సెకండ్ వైఫ్ ని బయిటపెట్టి ప్రపంచానికి తెలియచేస్తే ఎంత తెలియచెయ్యకపోతే ఎంత..అతని క్రిమినల్ లైప్ ని బయిటపెట్టి అంతమొందించాలనేది పట్టించుకోలేదు. హైలెట్స్, మైనస్ లు స్లైడ్ షోలో... ఫైనల్ గా... రామ్ చరణ్ డాన్స్ లు కోసం, చిరంజీవి ఎంట్రీ సీన్ కోసం తప్పక చూడదగ్గ సినిమా. అంతేకానీ ఎప్పటిలాగే శ్రీను వైట్ల ఇరగతీసే కామెడీ తీసుంటాడు అని వెళ్తే మాత్రం ఆకట్టుకోదు. (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది) Source: telugu.filmibeat.com రామ్ చరణ్ ఇంట్రడక్షన్ పోలీస్ డ్రస్ లో చాలా బాగుంది. పోలీస్ గా ఎంట్రీ ఇచ్చి చేసే ఫైట్, దాని కంటిన్యూషన్ మిస్ అండర్ స్టాండింగ్ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి. సినిమాలో బాగా వర్కవుట్ అయిన వాటిలో సిస్టర్ సెంటిమెంట్ సీన్స్, తండ్రి,కొడుకు ల సీన్స్ . కృతి కర్బంద, రామ్ చరణ్ పోటీ పడి చేసారు. రావు రమేష్ పాత్ర సినిమాలో బాగా పండింది. రామ్ చరణ్ ...క్లైమాక్స్ లో వచ్చిన చిరంజీవితో ఓ డైలాగు అంటారు..చివర్లో వచ్చి సేవ్ చేసారు అని... అదే రీతిలో చిరంజీవి లుక్, ఎంట్రీ ఎనర్జీ తో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే బోట్, ఫైట్ సీక్వెన్స్ బాగా రెస్పాన్స్ వచ్చింది. అలాగే హీరో ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కూడా బాగా డిజైన్ చేసారు. డాన్స్ లు కూడా రామ్ చరణ్ దుమ్మురేపాడనే చెప్పాలి సినిమా మొదట్లో సినిమా హీరోగా బ్రహ్మాజీ మీద చేసిన ఫన్ బాగుంది. గతంలో దుబాయి శ్రీను... ఎమ్ ఎస్ నారాయణ మీద చేసిన పాత్ర గుర్తుకు వస్తుంది. అయితే బ్రహ్మాజీ ఎప్పుడూ ఓ స్వామిజీ దయ అంటూ చెప్తూంటారు. ఆ స్వామీజిని సెకండాఫ్ లో ఏమన్నా ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నారు అంతా...అయితే అది కనపడలేదు. ఇక ఎప్పుడూ బ్రహ్మానందం పాత్రను అదరకొట్టే రీతిలో మలిచే శ్రీను వైట్ల ఈ సారి ఆ పాత్రను పెద్ద మైనస్ చేసారు. అండర్ కవర్ కాప్ గా బ్రహ్మానందం నవ్వులు పండించకపోగా బోర్ కొట్టించాడు. అలీ అయితే ఎందుకు పీకే స్ఫూఫ్ చేసారో ఆయనకే తెలియాలి. జబర్దస్త్ టీమ్ తో చేసిన కామెడీ అయితే శుద్దం వేస్ట్. ఉన్నంతలో సప్తగిరి పంచ్ లు పేలాయి. పోసాని, ఫృద్వీ జస్ట్ ఓకే అనిపించారు. నదియా పాత్రకు డెప్త్ లేదు. చిరంజీవి అయితే ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించారు. రకుల్ ప్రీతి సింగ్ చాలా గ్లామర్ గా కనిపించింది. రామ్ చరణ్ కు మాత్రం ఇది కొత్త పాత్రే. విలన్ గా చేసిన అరుణ్ విజయ్ లుక్ పరంగా చాలా బాగున్నారు. సంపత్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేసారు. ఈ సినిమా లో సాంకేతికంగా ఎక్కువ మార్కులు సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కే పడతాయి. ఫస్టాఫ్ లో ఎడిటర్ స్పీడు కనపడుతుంది. సెకండాఫ్ లో అది ఎందుకనో మందగించింది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసారు నాన్న గారి ఉప్పు తిన్నాను...తప్పు చేయలేను, క్యారక్టర్ లో కంటెంట్ ఉండాలి కానీ టెంట్ వేసుకుని కూర్చుంటాను వంటి కోన వెంకట్ డైలాగులు అద్బుతం కాదుకానీ బాగానే పేలాయి. స్క్రీన్ ప్లే నే నాశిరకంగా కూర్చుకోవటంతో సెకండాఫ్ తేలిపోయింది. సంగీత దర్సకుడు తమన్ తన పాటలుతోనే కాకుండా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొన్ని సీన్స్ లేపి నిలబెట్టాడు. మెగా మీటర్ సాంగ్ కు, కుంగుఫూ కుమారి పాటకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నటీనటులు: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్, రావు రమేష్, సప్తగిరి, బ్రహ్మానందం, కీర్తి కర్బంద, సంపత్ రాజ్, అలీ, నదియా, అరుణ్‌ విజయ్‌ తదితరులు. కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ: 16,అక్టోబర్ 2015


పాక్‌లో బాంబు పేలుడు: 11 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఓ ప్రయివేటు బస్సులో బాంబు పేలి ఇద్దరు చిన్నారులతో సహ 11 మంది దుర్మరణం చెందారు. 22 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ లోని ప్రావెన్స్ లో సోమవారం అర్దరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. బెలూచిస్థాన్ ప్రావెన్స్ పోలీసు ఉన్నతాధికారి అల్మీష్ ఖాన్ కథనం మేరకు వివరాలు ఆ విధంగా ఉన్నాయి. దినసరి కూలీలు వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రతి రోజు అర్దరాత్రి ఓ ప్రయివేటు బస్సు బస్ స్టాండ్ లో ఉంటుంది. ఎప్పటిలాగే సోమవారం అర్దరాత్రి ఆ బస్సు బస్ స్టాండ్ లో ఉంది. దినసరి కూలీలు బస్సులో ఎక్కారు. బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరడానికి చిన్నగా కదులుతున్నది. ఆ సమయంలో బస్ స్టాండ్ లోనే ఒక్క సారిగా బస్సు మీద అమర్చిన శక్తివంతమైన బాంబు పేలిపోయింది. 11 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే శక్తివంతమైన బాంబు అమర్చింది ఎవరనేది ఇంకా తెలియడం లేదని మంగళవారం పోలీసు అధికారి అల్మీష్ ఖాన్ చెప్పారు. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. Source: telugu.oneindia.com



ఇది ప్రెషర్ కుకర్.. బీ అలర్ట్


idi preshar kukar.. bi alart

కిచెన్‌లో ప్రెషర్ కుకర్‌లు పేలి చాలామంది గాయపడడమో, ఒక్కోసారి మరణించడమో నేచురల్. ఇక వంటిల్లు ధ్వంసం కూడా అవుతుంది. ముఖ్యంగా పాత ప్రెషర్ కుకర్లు పేలిపోతుంటాయి. కుకర్‌లోని వేడి నీటి ఆవిరి వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంటుంది. దానిని బయటకు వదిలివేసేందుకు ఈ కుకర్లలో వాల్వ్‌లు వుండేవి కావు. స్టవ్ నుంచి కుకర్‌ను సకాలంలో తీసివేయకపోతే లిడ్ ఒక్కసారిగా ఎగిరిపోయి కుకర్‌లోని వేడి పదార్థాలు బయటపడతాయి. ఇవి దగ్గరలో వున్నవారి శరీరం మీద పడి ఒళ్లు బొబ్బలెక్కుతాయి. అయితే ఇటీవల తయారవుతున్న ప్రెషర్ కుకర్స్‌లో నీటి ఆవిరి ఒత్తిడిని తట్టుకునేందుకు వాల్వ్‌లు అమర్చుతున్నారు. పైగా ఎమర్జన్సీ రెగ్యులేటర్స్ కూడా వుంటున్నాయి. (దీంతో కొంతవరకు ప్రమాదాలు తగ్గుతున్నాయి). అలాగే కుకర్ లోపలి ప్రెషర్ విడుదలయ్యేవరకు లిడ్ లాక్స్ ఓపెన్ కాని రీతిలో వీటిని తయారు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కుకింగ్‌కు ముందు.. కుకర్‌కు అమర్చే రబ్బర్ గాస్కెట్ సరిగ్గా వుందో లేదో చూసుకోవాలి. అది పగుళ్లు వచ్చినా.. లోపభూయిష్టంగా వున్నా వాడరాదని చెబుతున్నారు. ఇక ప్రెషర్ కుకర్‌ను పూర్తిగా ఆహారపదార్థాలతో భర్తీ చేయరాదు. అలాగే నూనెను కూడా ఎక్కువ మోతాదులో వాడడం మంచిది కాదు. ఆయిల్ ఎక్కువగా వున్నపక్షంలో అది రబ్బర్ గాస్కెట్‌ను, ఇతర భాగాలను కరిగించివేసే ప్రమాదం వుంది. స్టవ్ నుంచి కుకర్‌ని తీసేశాక నీటి ఆవిరంతా విడుదలయ్యేలా చూడాలని, చల్లని నీటిని పోయరాదని నిపుణులు సూచిస్తున్నారు. కుకర్‌కు అతి దగ్గరగా వుండడం మంచిది కాదట! ఉష్ణోగ్రత 212 డిగ్రీల బదులు సాధారణ ఉష్ణోగ్రత వుండేలా చూసుకోవాలి. కుకర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మంచిదని అంటున్నారు. దాన్ని ఏదో ఒక చోట గాలి చొరబడని చోట వుంచే బదులు, లిడ్ పై భాగం కిందకు వుండేలా స్టోర్ చేయాలని సూచిస్తున్నారు. నాగపూర్‌లో ఇటీవల ప్రెషర్ కుకర్ హఠాత్తుగా పేలిపోయి దాని విజిల్ ఓ గృహిణి గొంతుభాగంలో చొచ్చుకుపోయింది. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు తీవ్రంగా గాయపడి కిచెన్ అంతా ధ్వంసమైన సంఘటనలు వున్నాయి. అందువల్ల కుకర్ ఉపయోగించే ముందు బీ-అలర్ట్ అంటున్నారు.

v6 news live


ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే


aa sartifiket undaalsinde


ఓ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్ళగోరే అధికారులు తమకు ఎయిడ్స్ గానీ, ఇతర జబ్బులు గానీ లేవని రుజువు చేసే మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. దేశ సంపద- ఆర్థికాభివృద్ది అనే అంశంపై ఆ దేశంలో నెలరోజులపాటు (నవంబర్ 2నుంచి 30వ తేదీ వరకు) శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి అటెండ్ అయ్యే సీనియర్ అధికారులు ఇలాంటి మెడికల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని సిబ్బంది శాఖ తన తాజా సర్క్యులర్‌లో ఆదేశించింది. వాళ్ళు తమ దరఖాస్తులతో బాటు వీటిని కూడా జత చేయాలట.. ఓ పరాయి దేశంలో శిక్షణకు హాజరయ్యేందుకు మానసికంగా, శారీరకంగా తాము అన్ని విధాలా అర్హులమని డాక్టర్ల నుంచి ధ్రువ పత్రాలు తేవాలని, పైగా ఇంగ్లీష్ పై కమాండ్, వాగ్ధాటి, మంచి ఆరోగ్యం ఉండాలని ఆ సర్క్యులర్ లో పీర్కొన్నారు. ఇలాంటి వారికి విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వెసులుబాటు, హెల్త్ ఇన్సూరెన్స్, డైలీ అలవెన్స్ తదితర ప్రయోజనాలన్నీ కల్పిస్తున్నారు.

కేసీఅర్ ని అడ్డుకుంటారా..?


kesiar ni addukuntaara..?


ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ వెళ్ళాలనే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రోడ్డు మార్గాన వెళ్లాలని అనుకున్నా ఆ తరువాత ఈ నిర్ణయం మారిపోయింది. సూర్యాపేట వరకు రోడ్డు మార్గంలో వెళ్లి ఈ నెల 21 వ తేదీ రాత్రి అక్కడే బస చేసి ఆ మరుసటి రోజున అమరావతికి వెళ్లాలని తొలుత భావించారు. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. కేసీ ఆర్ హెలికాప్టర్ లోనే అమరావతి వెళ్ళే కార్యక్రమం ఖరారైంది. రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ను ఏపీలో అడ్డుకోవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చి సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం, ఆయనను కేసీఅర్ సాదరంగా ఆహ్వానించడం వంటి పరిణామాలతో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటున్నాయని భావిస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ను ఏపీలో అడ్డుకునే పరిస్థితి లేదని అంటున్నారు.

భళ్లాల దేవుడి భార్యగా శ్రియ?


bhallaala devudi bhaaryaga shriya?

మూడు పదుల వయసు దాటినా ముదురు భామ శ్రియ.. ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. అందులో భాగంగా తాజాగా అమ్మడు ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిందని సమాచారం. బాహుబలి రెండో భాగంలో ఓ కీలక పాత్ర కోసం శ్రియను ఎంపిక చేశారని వినిపిస్తోంది. బాక్సాఫీసును షేక్ చేసిన బాహుబలికి సీక్వెల్ గా బాహుబలి పార్ట్-2 తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే అవకాశం శ్రియకు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఈ మూవీలో శ్రియ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయం పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి-2 కథని కీలక మలుపు తిప్పే పాత్రలో శ్రియ కనిపించబోతుందని టాక్. అయితే బాహుబలిలో రానా భార్య ఎవరో రివీల్ చేయలేదు జక్కన్న. దాంతో ఆ పాత్రకే శ్రియను సెలెక్ట్ చేశారని వినికిడి. అంతేకాదు ఈ క్యారెక్టర్ లో కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. ఏదేమైనా ఈ న్యూస్ నిజమైతే భల్లాలదేవుడి భార్య నెగెటివ్ పాత్రలో శ్రియకు బంపర్ ఆపర్ దక్కినట్టే. చూద్దాం ఈ విషయం పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో!


telangana bathukamma songs


















Tags: telangana bathukamma songs  telangana bathukamma songs download  telangana bathukamma songs free download mp3  telangana bathukamma festival songs free download  telangana bathukamma songs free download  telangana bathukamma songs online  telangana songs  telangana bathukamma songs lyrics  telangana bathukamma dj songs free download Searches related to telangana bathukamma songs  telangana bathukamma songs download  telangana bathukamma songs free download mp3  telangana bathukamma festival songs free download  telangana bathukamma songs free download  telangana bathukamma songs online  telangana songs  telangana bathukamma songs lyrics  telangana bathukamma dj songs free download Searches related to telangana bathukamma songs  telangana bathukamma songs download  telangana bathukamma songs free download mp3  telangana bathukamma festival songs free download  telangana bathukamma songs free download  telangana bathukamma songs online  telangana songs  telangana bathukamma songs lyrics  telangana bathukamma dj songs free download Searches related to telangana bathukamma songs  telangana bathukamma songs download  telangana bathukamma songs free download mp3  telangana bathukamma festival songs free download  telangana bathukamma songs free download  telangana bathukamma songs online  telangana songs  telangana bathukamma songs lyrics  telangana bathukamma dj songs free download Searches related to telangana bathukamma songs  telangana bathukamma songs download  telangana bathukamma songs free download mp3  telangana bathukamma festival songs free download  telangana bathukamma songs free download  telangana bathukamma songs online  telangana songs  telangana bathukamma songs lyrics  telangana bathukamma dj songs free download

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు

Universities in Telangana తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు

  • ఆచార్య ఎన్. జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
  • జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?......... హైదరాబాద్
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ హైదరాబాద్ (సెంట్రల్ యునివర్సిటీ)
  • ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?............. హైదరాబాద్
  • కాకతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ వరంగల్
  • తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ నిజామాబాద్
  • మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... నల్గొండ
  • శాతవాహన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ కరీంనగర్
  • కుర్రం విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్
  • పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............. మహబూబ్ నగర్

Followers