ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది


ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మిగిలిన సీట్లన్నీ స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత 31వేల సీట్లు కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సంగతి తెలిసిందే. వీటిలో దాదాపు 26వేల సీట్లు ఇంజినీరింగ్‌వే! మిగిలినవి ఫార్మసీ సీట్లు. రెండు విడతల్లోనూ సీట్లు రాని విద్యార్థులు సుమారు 3500 మంది దాకా ఉన్నారు. ఆప్షన్లను సరిగ్గా పెట్టుకోని కారణంగా వీరందరికీ సీట్లు రాలేదన్నది అధికారుల వివరణ. వీరికీ అవకాశం కల్పించేలా మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ ఆగస్టు లోపు కౌన్సెలింగ్‌ పూర్తికావాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరోమారు కౌన్సెలింగ్‌కు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15 దాకా మిగిలిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని సుప్రీంతీర్పులో ఉంది. కానీ కౌన్సెలింగ్‌ అడ్మిషన్ల ద్వారానా అనే స్పష్టత లేదు. గతంలో వీటన్నింటినీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేశారు. ఒకవేళ అందుకు భిన్నంగా చేస్తే ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం ప్రక్రియే ఇబ్బందుల్లో పడుతుందన్నది ప్రభుత్వ ఆందోళన. అందుకే మూడోవిడత కౌన్సెలింగ్‌ను వదలుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. స్పాట్‌ అడ్మిషన్లకు తెలంగాణ ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటన వెలువరిస్తుంది. ఆతర్వాత ఆయా కళాశాలలు విడివిడిగా పత్రికా ప్రకటనలిచ్చి ఏదో ఒకరోజు ప్రవేశాలు నిర్వహిస్తాయి. ఈప్రక్రియ 15లోపు పూర్తికావాల్సి ఉంటుంది.

కుతుబ్‌షాహీ సమాధుల్లో సొరంగం

kutubshaahi samaadhullo sorangam

16వ శతాబ్దం నాటిదని అంచనాసమ్మర్‌ ప్యాలెస్‌ అవశేషాల గుర్తింపుతవ్వకాల్లో గుర్తించిన అగాఖాన్‌ ట్రస్ట్‌సందర్శించిన అమెరికా రాయబారి మైఖేల్‌ఈనాడు, హైదరాబాద్‌: వందల ఏళ్ల చరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ సమాధుల్లో పురాతన సొరంగం బయటపడింది. గోల్కొండ కోట నుంచి సమాధుల వరకు ఈ సొరంగం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గోల్కొండ కోటను పాలించే కుతుబ్‌షాహీల్లో ఎవరైనా మరణిస్తే సమాధుల వద్దకు తీసుకెళ్లేందుకు దీన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. సొరంగ మార్గంతోపాటు ఒక ఉద్యానం, సహాయకుల కోసం నిర్మించిన వేసవి భవంతి (సమ్మర్‌ ప్యాలెస్‌) తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ తవ్వకాలను తెలంగాణ పురావస్తుశాఖ తోడ్పాటుతో అగాఖాన్‌ ట్రస్ట్‌ సాంస్కృతిక విభాగం గతేడాది సెప్టెంబరులో చేపట్టింది. దీనికి అమెరికా రాయబారుల సంస్కృతి పరిరక్షణ నిధి (ఏఎఫ్‌సీపీ) 1.01 లక్షల డాలర్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌ వచ్చిన అమెరికా రాయబారి మైఖేల్‌ పిల్లెటైర్‌ శుక్రవారం సమాధుల్లో బయటపడిన సొరంగాన్ని సందర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో 800 సాంస్కృతిక పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు నిధులు అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని తవ్వకాలకూ సాయమందిస్తున్నామని చెప్పారు. ఇక్కడ స్థానిక కూలీలతోనే తవ్వకాలు చేపట్టడాన్ని ఆయన ప్రశంసించారు. పురాతన భవనాలు, ఆనవాళ్లను వెలికితీయడంతోపాటు అప్పటి సాంకేతికతను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని మైఖేల్‌ వివరించారు.మండువేసవిలోనూ చల్లదనం..తవ్వకాల్లో సొరంగంతోపాటు వేసవి భవంతి నిర్మాణ అవశేషాలను గుర్తించినట్లు అగాఖాన్‌ ట్రస్ట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రతీష్‌నందా, కె.కె.మహ్మద్‌ వివరించారు. ''15, 16వ శతాబ్దాల్లో గోల్కొండ కోటను పాలించిన కుతుబ్‌షాహీలు 106 ఎకరాల్లో ఒకవైపు సమాధుల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడున్న మ్యూజియం వెనకవైపు సహాయకుల కోసం వేసవిభవంతి (సమ్మర్‌ ప్యాలెస్‌)ని నిర్మించారు. వీటి కింది భాగం నుంచి నీటిపైపులు బయటబడ్డాయి. మండువేసవిలోనూ చల్లగా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజుల్లో సమాధుల పక్కనే ప్రార్థన చేసేందుకు మసీదుల నిర్మాణం చేపట్టారు. తిలవత్‌ ఖురాన్‌ పఠించేవారు. వీరి కోసమే వేసవి భవంతిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాల్లో చైనీస్‌, ఇండోనేషియా, జకార్తా, ఇజ్రాయిల్‌ శైలి నిర్మాణాలు బయటపడ్డాయి. మొదటి కులీకుతుబ్‌ ముల్క్‌ సమాధి ఎదురుగా ఒక ఉద్యానం, గోల్కొండ కోటవైపు ప్రహరీకి ఆనుకుని సొరంగ మార్గాన్ని తవ్వకాల్లో గుర్తించాం. ఈ తవ్వకాల పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయి'' అని వారు వివరించారు.


Followers