డెస్క్‌టాప్ పీసీలు మీ జేబులో పట్టేస్తాయ్!


ee aidu desktaap pisilu mi jebulo


రోజులు గడుస్తున్న కొద్ది టెక్నాలజీ మరింత ఆధునీకతను సంతరించుకుంటోంది. కంప్యూటర్ల విషయానికొస్తే డెస్క్‌టాప్ కంప్యూటర్లు కాస్తా పోర్టబుల్ కంప్యూటర్‌లుగా మారిన వైనాన్ని మనం చూసాం. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ల కాస్త స్టిక్ కంప్యూటర్లుగా మారటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జేబులో ఎంచక్కా ఇమిడిపోయే 5 డెస్క్‌టాప్ పీసీలను ఇప్పుడు చూద్దాం.... ఇంకా చదవండి: ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ కంప్యూటీ స్టిక్ కంప్యూటీ స్టిక్ ఇంటెల్ సంస్థ ఈ కంప్యూటీ స్టిక్‌ను తయారు చేసింది. హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ ద్వారా ఏలాంటి డిస్‌ప్లేకైనా ఈ స్టిక్‌ను కనెక్ట్ చేసుకుని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు. విండోస్ 8.1 ఇంకా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంల పై డివైస్ రన్ అవుతుంది. ధర 149 డాలర్లు. విండోస్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే.. 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై, లైనక్స్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే.. 1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్ మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై,








10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు


10 paaket saij kampyutarlu




ఇప్పుడు ప్రతి ఇంట్లో కంప్యూటర్ వినియోగం సర్వసాధారణంగా మారింది. కంప్యూటర్లకు వాడకం పెరిగే కొద్ది మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంప్యూటింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసేుకుంటున్నాయి. వినియోగదారులకు సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను చేరువచేసే క్రమంలో మినీ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. Read More: సరిగ్గా పాకెట్ సైజులో ఉండే ఈ పోర్టబుల్ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం విశేషం. యూఎస్బీ స్టిక్ తరహాలో ఉండే ఈ మినీ కంప్యూటర్‌లను హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌ను కలిగి ఉన్న డిస్‌ప్లే లేదా మానిటర్‌కు అనుసంధానించుకుని కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రింది ఫోటో స్లైడ్‌షోలో మీరు చూడబోయే 10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు మీ అవసరాలను మరింత సౌకర్యవంతంగా తీరుస్తాయి. Hannspree Hannspree స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 110.9 mm x 38 mm x 9.8 mm ఇంటెల్ కంప్యూట్ స్టిక్ Intel® Compute Stick టీవీని కంప్యూటర్‌లా మార్చుకోగలిగే సరికొత్త 'ఇంటెల్ కంప్యూట్ స్టిక్'ను ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. విండోస్ అలానే లైనక్స్ ఆపరేటింగ్ వర్షన్‌లలో ఈ కంప్యూట్ స్టిక్ లభ్యమవుతోంది. ఇంటెల్ ఆఫర్ చేస్తున్న విండోస్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్ సెర్చ్, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 32జీబి స్టోరేజ్, 2జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్‌లెస్ కీబోర్డ్ అలానే మౌస్‌లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. లైనక్స్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఉబుంటు 14.04ఆపరేటింగ్ సిస్టం, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 8జీబి స్టోరేజ్, 1జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్ లెస్ కీబోర్డ్ అలానే మౌస్ లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. MINIX NEO Z64 MINIX NEO Z64 ఈ డివైజ్‌ను అవసరాన్ని బట్టి టీవీ బాక్స్ లేదా కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు. స్పెసిఫికేషన్లు: ఇంటెల్ జెడ్3735ఎఫ్ (64-బిట్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి మెమెరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (32 బిట్) విత్ బింగ్ సెర్చ్ Zotac ZBOX PI320 Zotac ZBOX PI320 స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత: 7.1 x 7.1 x 2.3 Vensmile iPC002 Vensmile iPC002 స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి మెమరీ, 32జీబి స్టోరేజ్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్, చుట్టుకొలత 151 x 90 x 10మిల్లీ మీటర్లు Cloudsto X86 Nano Mini PC Cloudsto X86 Nano Mini PC స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి మెమరీ, 32జీబి స్టోరేజ్, విండోస్ 8.1, ఉబుంటు 14.04 చుట్టుకొలత 148 x 79 x 9మిల్లీ మీటర్లు Asus VivoMini UN62 Asus VivoMini UN62 స్పెసిఫికేషన్లు: 4వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ (కోర్ ఐ3, ఐ5), మెమరీ 16జీబి వరకు, స్టోరేజ్ స్పేస్ 32జీబి నుంచి 256జీబి వరకు, విండోస్ 8.1 ప్రో ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 131 x 131 x 42మిల్లీ మీటర్లు MSI Cubi MSI Cubi స్పెసిఫికేషన్లు: సిలిరాన్, పెంటియమ్, కోర్ ఐ3, 2జీబి నుంచి 16జీబి వరకు మెమరీ, స్టోరేజ్ సామర్థ్యం 2.5" HDD ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 8.1/7 చుట్టుకొలత 115 x 111x 35మిల్లీ మీటర్లు. Meerkat Meerkat స్పెసిఫికేషన్లు: 5వ తరం ఇంటెల్ కోర్ ఐ3-5010యు ప్రాసెసర్, 16జీబి వరకు ఇంటర్నెల్ మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 114.3 x 111.76 x 48.26మిల్లీ మీటర్లు. Intel NUC Intel NUC స్పెసిఫికేషన్లు: ఇంటెల్ కోర్ ఐ5-5250యు ప్రాసెసర్, 16జీబి మెమరీ, చుట్టుకొలత 4.5 x 4.4 x 1.3మిల్లీ మీటర్లు.





డిజిటల్ ఇండియా


అడుగడుగునా మనిషి కదలికను పసిగట్టే సాంకేతిక వ్యవస్థను ఏర్పరచినప్పుడు, అది దుర్వినియోగమైతే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. భారత్ ఇప్పుడిప్పుడే డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందున, దీని పర్యవసానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలె.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా సమాజ సంక్షేమం కోసం వినియోగించాలె. ఆర్థిక,పారిశ్రామికాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి పైనా దృష్టి సారించాలె. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆవిష్కరించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశాన్ని సరికొత్త సాంకేతిక యుగంలోకి నడిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమానికి హాజరైన అనేక మంది పారిశ్రామికవేత్తలు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. ఈ పథకం అమలు కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి సాంకేతిక పరిశ్రమలు సుముఖత వ్యక్తం చేశాయి. దేశ వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పించి డిజిటల్ కార్యకలాపాలను గ్రామాలలో సైతం అందుబాటు లోకి తేవడం, సేవారంగాన్ని డిజిటల్ రూపంలో సాగించడం, డిజిటల్ పరిజ్ఞానం పెంచడం ప్రధాన లక్ష్యాలు. వీటికి తోడు 2020 కల్లా ఎలక్ట్రానిక్ దిగుమతులు లేకుండా దేశంలో ఉత్పత్తి సాగించడం మరో లక్ష్యం. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వల్ల పది కోట్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంటున్నారు. గత యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ- గవర్నన్స్ పథకంతో పోలిస్తే మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా మరింత విస్తృతమైన కార్యక్రమం. డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం ఇప్పటికే నగర ప్రాంతంలో సాధారణమైపోయింది. రైలు, బస్సు టికెట్ బుక్ చేయాలన్నా, సినిమా టికెట్ తీసుకోవాల న్నా ఇప్పుడు సులభమైపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు బిల్లులను నెట్ ద్వారా చెల్లిస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్ వల్ల కాలు గడప దాటకుండానే, కోరుకున్న వస్తువులు వచ్చి ఒడిలో వాలుతున్నాయి. వైద్యం, బ్యాకింగ్ రంగాలలో భారీ మార్పులు వచ్చా యి. విద్యారంగం గురించి చెప్పనవసరం లేదు. మొదటగా డిజిటల్ పరిజ్ఞానాన్ని అలవరచుకున్నది విద్యార్థులే. ఇప్పుడు రైతులు కూడా టాబ్లెట్‌ను వాడే రోజులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి మనిషికి కావలసింది రోటీ, కప్డా ఔర్ మకాన్ అని చెప్పేవారు. ఇప్పుడు రోటీ, కప్డా ఔర్ మొబై ల్ అనే హాస్యోక్తి ప్రచారమైంది. అయినప్పటి కీ దేశంలో పూర్తిగా డిజిటల్ విప్లవం వచ్చేసిందని చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాలే ఇంకా పూర్తిగా డిజిటైజ్ కాలేదు. ప్రధాని చెప్పిన ఎం (మొబైల్) గవర్నన్స్ అనే ది ఇంకా భారతీయ గ్రామీణ సామాజానికి చాలా దూరంలో ఉన్నది. డిజిటల్ కనెక్టివిటీ లో మన దేశం ఇంకా వందవ స్థానంలో కూడా లేదు. రెండున్నర లక్షల గ్రామాలకు బ్రాడ్‌బాండ్ వసతి కల్పించడం అంత సుల భం కాదు. ఉద్యమ స్ఫూర్తితో ఈ మౌలిక వసతులు కల్పిస్తే మాత్రం ఈ సాంకేతిక పరిజ్ఞానం సమాజంలో భారీ పరివర్తనను తీసుకురాగలుగుతుంది. డిజిటీకరణ పథకాలు అమలైతే వివిధ సేవలు, ఇతర కార్యకలాపాలు సౌకర్యవంతమవుతాయి. అయితే ప్రతి కార్యక్రమానికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నట్టే దీనికి కూడా ఉంటాయి. చిత్తశుద్ధి ఉంటే వాటిని అధిగమించడం కూడా అసాధ్యం కాదు. అయితే డిజిటీకరణ జరిగితే కష్టాలన్నీ తీరుతాయంటూ అరచేతిలో స్వర్గం చూపెట్టడం సరికాదు. ప్రధాని మోదీ ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త దీన్ని ఆకాశానికెత్తాడు. దేశ వ్యాప్తంగా డిజిటల్ అనుసంధానం వల్ల ప్రజలకు మిగతా ప్రపంచంతో సం బంధం ఏర్పడి అత్యంత శక్తి లభిస్తుందని అన్నారు. కొత్తగా కనుగొన్న ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా సమాజ సంక్షేమం కోసం ఉపయోగించుకోవచ్చు. పారిశ్రామిక విప్లవం ప్రజా జీవనంలో గుణాత్మక మార్పును తీసుకొచ్చింది. అయితే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయా? ప్రజా జీవనం నరకప్రాయమైందా అనేది దాని ఉపయోగాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రెండవ పారిశ్రామిక విప్లవంగా చెప్పుకుంటున్న డిజిటీకరణను కూడా తక్కువ చేయలేము. కానీ దీనిని ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలె. అనేక సామాజిక సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించలేము. ఉదాహరణకు డిజిటీకరణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, లంచగొండితనం అంతరిస్తుంద ని, పనిదనం మెరుగుపడుతుందని ఇట్లా రకరకాల ఆశలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలన్నీ సామాజిక సంస్కృతికి, పరిపాలనా విధానానికి సంబంధించినవి. ప్రభుత్వంలో, ప్రజల్లో పరివర్తన లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాధించలేము. ఇదే విధంగా అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశాలలో పౌరుడి గోప్యతకు భరోసా లేకుండా పోతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా మనిషి కదలికను పసిగట్టే సాంకేతిక వ్యవస్థను ఏర్పరచినప్పుడు, అది దుర్వినియోగమైతే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. భారత్ ఇప్పుడిప్పుడే డిజిటల్ ప్రపంచంలో కి అడుగు పెడుతున్నందున, దీని పర్యవసానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలె. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా సమాజ సంక్షేమం కోసం వినియోగించాలె. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి పైనా దృష్టి సారించాలె.



అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించలేం


నిస్సహాయత వ్యక్తం చేసిన సుప్రీం న్యూఢిల్లీ : భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించేందుకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చుని అశ్లీల చిత్రాలు చూడాలనుకునే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాధమిక హక్కును ఎవరూ నిలువరించలేరని నిస్సహాయత వ్యక్తంచేసింది. ''అటువంటి తాత్కాలిక ఆదేశాలను ఈ కోర్టు జారీ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి మైనారిటీ తీరిన వ్యక్తిని నేను, నా గదిలో కూర్చుని నేను చూస్తుంటే మీరెలా నన్ను నిలువరించగలుగుతారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రశ్నించవచ్చని'' ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు మౌఖికంగా తెలిపారు. న్యాయవాది కమలేష్‌ వాష్వాని వేసిన పిటిషన్‌పై విచారించిన ప్రధాన న్యాయమూర్తి పై విధంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదని అందువల్ల కోర్టు కల్పించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని సంబందిత వార్తలు


127,42,39,769.. ఇది ప్రస్తుత భారత జనాభా


ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్‌ పాపులేషన్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌(ఎన్‌పీఎస్‌ఎఫ్‌) భారత జనాభా నివేదికను విడుదల చేసింది. ఎన్‌పీఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం జులై 11 సాయంత్రం 5 గంటలకు భారత జనాభా 127,42,39,769కు చేరింది. ఇది ప్రపంచ జనాభాలో 17.25 శాతం.* ఏడాదికి 1.6శాతం చొప్పున మనదేశంలో జనాభా పెరుగుతోంది.* ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్‌ జనాభా 163కోట్లను దాటి అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలవనుంది.* ప్రస్తుతం చైనా 137 కోట్లకుపైగా జనాభాతో మొదటిస్థానంలో ఉంది.* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121కోట్లు. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, జపాన్‌లాంటి దేశాల జనాభా అంతా కలిపితే భారత జనాభాకు సరిసమానం

Followers