ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా గుర్తించిన టాప్‌ 20 నగరాల్లో భారత్‌ కు చెందిన 13 నగరాలను గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ పట్టికలో చైనా నుంచి కేవలం 3 నగరాల్లో మాత్రమే ఉన్నాయి. భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం ఫలితంగా సుమారు 66 కోట్ల భారతీయుల సగటు ఆయుర్దాయం 3.2 సంవత్సరాలు తరిగిపోతోందని అధ్యయనాల్లో తేలింది. అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది. టాప్‌ 10 కాలుష్య నదుల్లో గంగా, యమునా ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నదులుగా పేరొందిన టాప్‌ 10 నదుల్లో గంగా, యమున నదులను కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చైనా నుంచి మాత్రం కేవలం ఒక నది మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఫిబ్రవరిలో విడుదల చేసిన మరో జాబితాలో గుజరాత్‌ లోని వాపీ, ఒడిషాలోని సుకిందా నదీపారివాహిక ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించింది. ఇక దేశంలో 290 నదుల్లో కాలుష్య ప్రభావితమైనవిగా గుర్తించారు. దీని ప్రభావం నేరుగా 8వేల 400 కి.మీ పరిధిలోని జనావాసాలపై పడుతోంది. పారిశ్రామికంగా భారత్‌ చైనాలు పోటీ భారత్ చైనాలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకుగానూ పలు రంగాల్లో పోటీ పడుతున్నాయని ప్రపంచ విపణిలో గత రెండుదశాబ్దాలుగా ఉన్న మాటే ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధిలో భారత్‌ చైనాలు పోటీ పడుతున్నాయి. కర్బన ఉద్గారాల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటే భారత్‌ మూడో స్థానంలో ఉంది. అటు చైనా ప్రపంచ ఉత్పత్తి రంగానికే తల మాణికంగా నిలిచింది. ఈ పరిణామంలో భారత్‌ చైనాల్లో పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్య నివారణకు చైనా కఠిన చట్టాలు ఇరు దేశాల్లో గత దశాబ్దం వరకూ కాలుష్య సూచీల్లో సమాన స్థాయిలో గణాంకాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చైనా మాత్రం భారత్‌ కన్నా పరిస్థితిని మెరుగుపరుచుకుంది. గడిచిన పదేళ్లలో చైనా నదీ జలాల కాలుష్యాన్ని తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టింది. ఇక వాయు కాలుష్య నివారణకు చైనా కఠినమైన చట్టాలు అమలు చేసింది. గత పదిహేనేళ్లతో పోల్చి చూస్తే బీజింగ్‌ నగరంలో 40 శాతం వాయు కాలుష్యం తగ్గింది. సరిగ్గా పదిహేనేళ్ల కాలంలో మన దేశరాజధాని ఢిల్లీలో 20 శాతం వాయు కాలుష్యం పెరిగింది. మన దేశంలో కేవలం కోయంబత్తూరు మాత్రమే కాస్త కాలుష్య సూచీల్లో కాస్త మెరుగ్గా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలను మాత్రం నియంత్రించడం లేదు. ఫలితంగా సుమారు 66 కోట్ల మంది భారతీయుల ఆయుర్దాయం సగటున 3.2 సంవత్సరాలు తగ్గిపోయిందనే చేదు నిజం బయట పడింది.

తుది దశకు ఉద్యోగుల విభజన.

ఉద్యోగుల తాత్కాలిక విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. శుక్రవారం జరిగిన కమల్‌నాథన్‌ కమిటీ భేటీలో పలు అంశాలపై క్లారిటీ వచ్చింది. 4 శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లోనూ... ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తయింది. ఈ నెలాఖరులోపు 90 శాతం వరకు ఉద్యోగుల పంపిణీ పూర్తవుతుంది. ఇవాళ మరోసారి కమలనాథన్ కమిటీ భేటీ కానుంది. పలు శాఖలపై ఏకాభిప్రాయం.. ఉద్యోగుల తాత్కాలిక విభజనపై కమల్‌నాథన్ కమిటీ కసరత్తులు చేసింది. తెలంగాణ సచివాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు... కమిటీతో శాఖల వారీగా ఉద్యోగుల విభజనపై చర్చించారు. మొత్తం పదిశాఖల విభజనపై ఏకాభిప్రాయం కుదరింది. హోం, అగ్రికల్చర్, ప్లానింగ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్‌ , వికలాంకుల సంక్షేమం, కుటుంబ సంక్షేమశాఖ, భూగర్భజల, గ్రామీణ నీటిపారుదల శాఖల్లో ఉద్యోగుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరో 16 శాఖలపై రానున్న క్లారిటీ.. ఈ రోజు జరిగే భేటీలో మరో 16 శాఖల ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇవ్వనుంది. సంక్షేమశాఖ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్‌, విద్యుత్, దేవాదాయ, ఉద్యానవనశాఖ, ఢిల్లీలోని ఏపీభవన్‌ వంటి కీలక శాఖల గురించి సీఎస్‌లు చర్చించనున్నారు. ఇది పూర్తైతే 60 శాఖల ఉద్యోగుల విభజన పూర్తైనట్లే. ఐతే ఉద్యోగుల సంఖ్య తేలని పోలీసు, టాస్క్‌ఫోర్స్, మెడికల్ అండ్ హెల్త్, ప్రొటోకాల్‌ శాఖల్లో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. దీంతో ఆయా శాఖల విభజన మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఐతే ఉద్యోగుల సంఖ్యను తేల్చేందుకు ఈ నెల 12న కమల్‌నాధన్‌ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుంది. జూన్ చివరికల్లా పూర్తికానున్న తాత్కాలిక విభజన.. ఈ నాలుగు శాఖలు మినహా అందరు ఉద్యోగుల విభజనను జూన్ చివరికల్లా పూర్తి చేయనుంది. ఈ నాలుగు శాఖల్లో జిల్లాల వరకు ఏ సమస్యా రాకున్నా హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మాత్రం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయా శాఖలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్రస్థాయి శాఖలుగా పరిగణించాల్సి ఉంది. కాని విభజన చట్టంలోని 18జీ, 18ఎఫ్‌లలో మాత్రం ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలని పేర్కొన్నారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరితే తప్ప విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా లేదు. సూపర్‌ న్యూమరి పోస్టులపై క్లారిటీ కరువు.. అంతేగాక సూపర్‌ న్యూమరీ పోస్టులపై కూడా ఇరురాష్ట్రాలు క్లారిటీ ఇవ్వటం లేదు. మొదట్లో ఇద్దరు సీఎంలు ఒక అవగాహనకు వచ్చినా.. కమిటి భేటీలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమైన ఖాళీల్లో... ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. కాని అందుకు ఏపీ ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై కమల్‌నాథన్ కమిటీ తదుపరి సమావేశాల్లో చర్చించనుంది. జులైలో అభ్యంతరాల స్వీకరణ.. ఇక ఉద్యోగుల విభజనపై జులైలో అభ్యంతరాలను స్వీకరిస్తామని కమిటీ స్పష్టం చేసింది. మొత్తానికి ఎన్నో చర్చలు, మరెన్నో గందరగోళాల మధ్య.... ఉద్యోగుల విభనన తుదిదశకు చేరుకుది. ఐతే తాత్కాలిక విభజనకే ఏడాది సమయం పడితే...శాశ్వత విభజనకు, కోర్టు వివాదాల పరిష్కారానికి మరెంత కాలం పడుతుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా మ్యాప్ లోకి తెలంగాణ ఎంటర్...

indiya myaap loki telangaana entar...  


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. కానీ అధికారిక చిత్రపటం లేదు. తాజాగా ఇండియా మ్యాప్‌లోకి తెలంగాణ ఎంటరైంది. తెలంగాణ అధికారిక మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంగా చూపించింది. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల వివరాలు సైతం మ్యాప్‌లో ఉన్నాయి. 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ.. తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా అధికారికంగా విడుదల చేసింది. దేశంలోని 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణను పేర్కొంది. రాష్ట్ర సరిహద్దులను నిర్ధారిస్తూ... అన్ని వివరాలను వివరించింది. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక ఉన్నాయి. మ్యాప్‌లో కాకతీయ కళాతోరణానికి సర్వే ఆఫ్‌ ఇండియా పెద్ద పీట వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వివరాలు.. ఇక జిల్లా కేంద్రాలు, హైవేలు, నదులు, ప్రాజెక్టులు, నదీ మార్గాలు, చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలు సహా అన్ని పర్యాటక ప్రదేశాలను మ్యాప్‌లో స్పష్టంగా కనబడతాయి. తెలంగాణ సంస్కృతిని.. తెలుగు, నిజాం, మొగలాయి, పర్షియన్‌ సంప్రదాయాల కలబోతగా అభివర్ణించింది. అన్ని ప్రధాన పండుగలతో పాటు బతుకమ్మ, బోనాల పండుగలను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని పేర్కొంది. ఇక జిల్లాల వారిగా 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలను కూడా పొందుపరిచింది. 10 భాషలతో కూడిన మ్యాప్... మ్యాప్‌లో హైదరాబాద్‌-సికింద్రాబాద్ జంటనగరాలను సర్వే ఆఫ్ ఇండియా హైలైట్ చేసింది. హైదరాబాద్‌ సిటీ మ్యాప్‌తో పాటు మెట్రో రైల్ రూట్‌మ్యాప్‌ను కూడా పొందుపరిచింది. హైదరాబాద్‌ నుంచి ఉన్న రైలు, రోడ్డు, విమాన మార్గాలను మ్యాప్‌లో సూచించింది. తెలంగాణ జిల్లాల నుంచి పలు ప్రముఖ ప్రాంతాలకు ఉండే దూరాన్ని సైతం పొందుపరిచింది. హైదరాబాద్‌ సగటు ఉష్ణోగ్రత వివరాలు కూడా మ్యాప్‌లో ఉన్నాయి. మొత్తం 10 భాషలతో కూడిన మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది.




నేడు తెలంగాణ రాష్ట్ర ఎడ్ సెట్ 2015

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎడ్ సెట్ శనివారం నిర్వహించనున్నారు.ఈ పరీక్షకు 64,231 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 134 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనున్నారు.

ఫొటోలు దాచుకోవడానికి గూగుల్‌ నుంచి మరో ప్రత్యేక 'సేవ'


ఫొటోలు, వీడియోలు దాచుకోవడానికి గూగుల్‌ ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసింది. 'గూగుల్‌ ఫొటోస్‌' పేరుతో వినియోగదారులకు మరో కొత్త సేవను ఉచితంగా అందించబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న గూగుల్‌ డెవలపర్స్‌ సదస్సులో ఈ కొత్త సేవను ప్రకటించింది. ఈ సర్వీస్‌ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఫొటోలు, వీడియోలు భద్రపరుచుకోవచ్చు. గూగుల్‌ ప్లస్‌తో ఎలాంటి సంబంధంలేని ఈ యాప్‌ ద్వారా అపరిమిత మెమొరీని ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం గూగుల్‌ కల్పిస్తోంది. ఇప్పటికే గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ప్లస్‌లలో ఫొటోలు, వీడియోలు భద్రపరిచే సౌకర్యం ఉన్నప్పటికీ పరిమిత మెమొరీలో సాధ్యమవుతుంది. వాటితో పోలిస్తే గూగుల్‌ ఫొటోస్‌లో మరెన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో హై రిజల్యూషన్‌ ఫొటోలు పెట్టుకోవచ్చు. ఫొటో ఎడిటర్‌, కొలాజ్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ సాధనాల్లో యాప్‌ రూపంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. వెబ్‌ ద్వారానూ ఈ ఫొటో సర్వీస్‌ సేవలను వినియోగించుకోవచ్చు. 


Followers