కానల చిలక కానల చిలక ఏ కాన చిలక ఇది



చిత్రం : విలన్ ౨౦౧౦
గాయకులు : అనురాధా శ్రీరాం, నరేష్ అయ్యర్
సంగీతం : ఏ ఆర్ రహ్మాన్
రచన : వేటూరి

పల్లవి
కానల చిలక కానల చిలక ఏ కాన చిలక ఇది
చినుకౌతుందో? పిడుగౌతుందో? మాయమైపోతుందో!
కులుకుమని మెరుపొస్తే - వస్తే
ఉలికిపడి నేనుంటే - ఉంటే

ఎందుకో చెప్పగరాని తప్పుడు వాంఛ కలిగినదే
అది పెట్టిన ఎర్రనిబొట్టది, నా గుండెకు గుచ్చుకుపోయెనే...
కొస చూపుకు ఎముకలు పొడిపొడి ఆయెనే

ఏవరో ఎవరో ఈ చిలకెవరో ఎక్కడి చిలక ఇది
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో

కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సై సై
తుమ్మెదలంటని కమ్మని మోమును కన్న వనాలే హాయ్ హాయ్

చరణం 1

పరువాలపాపిటిలో తిరిగాను ఒంటరిగా
అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్నా
ఎటూపోని మనసు గురిసడలి విరహముతో పొగలినది

కొండంతబరువు, గుండె చెరువు, ఓ నత్తగుల్ల బతుకు ఇది
ఎర్రని మడమ ముక్కు సొగసు పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి

చరణం 2
నాగేటి సాలులలో సాగేటి నీరనుకో
నీగీటుదాటని నా మనసంత నీదనుకో

పొరుగింటి సొగసు చూసి మనసు కాస్త గట్టు దాటి పోయినది
ఓలమ్మొ ఇది తప్పో, లేక ఒప్పో - లోన కత్తిపోరు సాగుతున్నది
నన్ను నిలబెట్టి  విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది



Nammaka Thappani Nijamaina Telugu Lyrics


Nammaka Thappani Nijamaina

Movie : Bommarillu
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Sita Rama Shastri
Singers : Sagar, Sumangali

ఓఓఒ........
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెపుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఒ...
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వెనో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓఓ ...
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే వున్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా ఓఒఓ..
కన్నులు తెరిచే వున్నా నువు నిన్నటి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలోనే వున్నా

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెపుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఒఓ...
ఓ ఓ ఓ ఓ ఓ .........................
ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన
గుడి గంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన
ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి ఎలా
తడి కనులతో నిను వెతికేది ఎలా.. ఓ..

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెపుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఒ...

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నలైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఉహల్లో కలిగే వేదనలో ఎన్నలైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా....ఆ ...ఆ ..ఆ

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెపుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఒ...
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వెనో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓఓ ...

Tags:  Nammaka Thappani Nijamaina Telugu Lyricssong free download Nammaka Thappani Nijamaina Telugu Lyrics Telugu Nammaka Thappani Nijamaina Telugu Lyrics  lyrics telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu script  telugu songs lyrics in english  telugu songs lyrics free download  jeans telugu songs lyrics  roja telugu songs lyrics  ishq telugu songs lyrics  manam telugu songs lyrics

Okkasari Cheppaleva Nuvvu Nachavani


Okkasari Cheppaleva Nuvvu Nachavani

Movie : Nuvvu Naaku Nachav
Music : Koti
Lyricist : Sirivennela SitaRamaSastri
Singers : Chitra K S, Kumar Sanu


ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావనీ
ఓ..ఓ..ఓ..
జంట చేరి పంచుకోవా ఆశనీ శ్వాసనీ
మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా
ఒదిగుండ మనక ఒదిలేయమంటూ బతిమాలుతున్న వేళా

వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరీ
ఓ..ఓ..ఓ..
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకొని
చేయి చాచి పిలవొద్దు అని చంటి పాపాలకు చేపుతమా

లేని పోని కలలెందుకనీ మేలుకుంటె అవి రావు అని
జన్మలోనే నిదరోకోని కంటిపాపలకు చెపుతామా

కలలన్నవి కలవని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని

మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా


ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావనీ
ఓ..ఓ..ఓ..
జంట చేరి పంచుకోవా ఆశనీ శ్వాసనీ

అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగివస్తుంటే కరిగిపోని దూరం వుందా

అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కేరటమెగిరి పడుతూవుంటే ఆకాశం తెగిపడుతుందా

మనసుంటే మార్గం వుంది కదా
అనుకుంటే అందనిదుంటుదా

అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

ఒక్కసారీ చెప్పలేవా నువ్వు నచ్చావనీ
ఓ..ఓ..ఓ..
జంట చేరి పంచుకోవా ఆశనీ శ్వాసనీ
మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా
ఒదిగుండ మనక ఒదిలేయమంటూ బతిమాలుతున్న వేళా

Tags:Tags:  Okkasari Cheppaleva Nuvvu Nachavani  song free download Okkasari Cheppaleva Nuvvu Nachavani  Telugu Okkasari Cheppaleva Nuvvu Nachavani  lyrics telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu script  telugu songs lyrics in english  telugu songs lyrics free download  jeans telugu songs lyrics  roja telugu songs lyrics  ishq telugu songs lyrics  manam telugu songs lyrics


Chukkallokekkinadu Chakkanodu



Movie : Gemini
Music : R.P.Patnaik
Singer : Vandemataram Srinivas

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


తల్లడిల్లి పోతుందీ తల్లి అన్నదీ
బొట్టురాల్చుకుంటుంది కట్టుకున్నదీ
పాడె ఎత్తడానికే స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు
వున్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ
కన్నీళ్ళకు కట్టే కూడా ఆరనన్నదీ
చావు బతుకులన్నవి ఆడుకుంటవీ
చావులేని స్నేహమే తోడు వుంటదీ


చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు




Tags:  chukkallo kekkinadu chakkanodu song free download chukkallokekkinadu chakkanodu Telugu chukkallokekkinadu chakkanodu lyrics telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu script  telugu songs lyrics in english  telugu songs lyrics free download  jeans telugu songs lyrics  roja telugu songs lyrics  ishq telugu songs lyrics  manam telugu songs lyrics

బుద్ధునిపై అసభ్యకర యాడ్: న్యూజిలాండ్ దేశీయుడికి రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష


buddhunipai asabhyakara yaad: nyujilaand deshiyudiki rendunnara
మద్యం మత్తులో బుద్దుడి ఫోటోపై మత దూషణకు పాల్పడినందుకు బార్ మేనేజరైన న్యూజిలాండ్ వ్యక్తితో పాటు, మరో ఇద్దరు మయన్మార్ వ్యక్తులకు రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ మయన్మార్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. న్యూజిలాండ్ దేశస్తుడైన ఫిలిప్ బ్లాక్‌వుడ్ విగాస్ట్రో బార్‌‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తన బార్‌కు ప్రాచుర్యం కల్పించడానికి బౌద్ధ మత దేవుడు బుద్ధునిపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఈ బౌద్ధ మత దూషణలో విగాస్ట్రో బార్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు అతనికి సహాయపడిన వారికి కూడా శిక్ష విధించారు. డీజే హెడ్‌పోన్‌లు ధరించిన బుద్ధుని చిత్రాన్ని ఫిలిప్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో పెద్దఎత్తున బౌద్ధ మత మద్దుతుదారులు బార్ ముందు తమ నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన మయన్మార్ పోలీసులు వారి ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 2011 వరకు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో బౌద్ధమతం ఎక్కువ. ఇటీవల కాలంలో మయన్మార్‌లో తరచుగా మత కలహాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మత హింసలో బౌద్ధులు ముస్లింలను టార్గెట్‌గా చేసుకునేవారు. మయన్మార్
మార్కెట్ రోడ్డులోని విగాస్ట్రో బార్‌లో రెస్టారెంట్, నైట్ క్లబ్ కలిసే ఉంటాయి. బుద్ధుని చిత్రంపై ఫిలిప్ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంటనే బార్‌ను మూసివేశారు. ఇందుకు మయన్మార్ ప్రజలకు క్షమాపణ తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో బార్ యజమాని పేర్కొన్నారు.




రైల్వే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్


రైళ్లల్లో ప్రయాణం చేయు మహిళా ప్రయాణీకులను ఎవరైనా వేధిస్తున్నప్పుడు సహాయం కొరకు , రైళ్ళలో దొంగతనము జరిగినప్పుడు మరియు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు లేదా ఎలాంటి అనుమానాస్పద వస్తువులను రైళ్ళలో గాని, ప్లాట్ ఫాం మీద గాని , మరి ఏ ఇతర రైల్వే పరిధిలో గాని గుర్తించినప్పుడు రైల్వే పోలీసుల సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1512 కు ఫోన్ చేసి , సహాయం పొంద వచ్చునని శ్రీ టి. కృష్ణ ప్రసాద్ , ఐ.పి.ఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, గారు తెలిపినారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్.పి శ్రీ ఎస్.జె జనార్ధన్ , ఐ.పి.ఎస్ గారు, సికింద్రాబాద్ అర్బన్ రైల్వే డి.ఎస్.పి శ్రీ పి.వి. మురళీధర్ గారు, సికింద్రాబాద్ రూరల్ డి.ఎస్.పి శ్రీ జగదీశప్ప గారు, ఖాజీపేట్ డి.ఎస్.పి శ్రీ శ్రీనివాస్ గారు, ఏ.ఓ. ఎం.బి.మాలిక గారు, ఇన్స్పెక్టర్స్ ఆంజనేయులు, ఆర్.బి. రంగయ్య, లింగాన్న, శ్రీనివాస్, మధుసూదన్, రవికుమార్ ,మరియు ఆర్.ఐ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Followers