బాలల హక్కులు - బాధ్యతలు



బాలల హక్కులు - బాధ్యతలు
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం. కానీ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం.
నేటి ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన నేరం.
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదన్నారు గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూ ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా - దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్ధితుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ - పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారు.
అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, ఒడంబడికలు, అనేక ప్రయత్నాలు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఒడంబడిక విశిష్టమైనది, విలక్షణమైనది, సమగ్రమైనది. ఇది పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లోను, అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది. పరిమితవనరులున్న ప్రభుత్వాలు కూడా పిల్లల హక్కులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఈఒడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.
తీర్మానంలో పేర్కొన్న బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కునిస్తుంది. తీర్మానం.
మార్గదర్శక సూత్రాలు: అన్ని హక్కలకు సాధరణంగా ఉండే నియమాలు
ఆర్టికల్ - 1
  • ప్రస్తుత సదస్సు ప్రకారం 18 సంవత్సరాల వయసులోపు మానవులు బాలలుగా పరిగణించబడతారు
ఆర్టికల్ - 2
  • సదస్సులో తీర్మానించిన బాలల హక్కులను భాగస్వామ్య దేశాలు - పిల్లల తల్లిదండ్రుల, వారి సంరక్షకుల, కులం, జాతి, వర్గం, భాష, మతం, రాజకీయాభిప్రాయం, జాతీయత, తెగ, అంతస్తు, సామర్ధ్యం, పుట్టుక మరే ఇతర హొదాలను బట్టి వివక్ష చూపకుండా బాలలందరికీ సమానంగా అందించాలి.• పిల్లల తల్లిదండ్రుల, వారి చట్టబద్ధ సంరక్షకుల లేదా కుటుంబ సభ్యుల హొదా, కార్యకలాపాలు, వారి అబిప్రాయాలు లేదా నమ్మకాలను బట్టి పాటించే వివక్ష, శిక్షల నుండి బిడ్డను కాపాడేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకుంటాయి.
ఆర్టికల్ - 3
  • ప్రభుత్వంగానీ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ సంస్ధలుగానీ, కోర్టులుగానీ, పాలక సంస్ధలుగానీ లేదా బాలలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్ధలుగానీ అన్నింటికీ బిడ్డ ప్రయోజనాలే ముఖ్య కర్తవ్యంగా ఉండాలి.
  • భాగస్వామ్య దేశాలు బిడ్డ శ్రేయస్సుకు అవసరమైన శ్రద్ధ, సంరక్షణా బాధ్యత తీసుకోవాలి. దానితో పాటు బిడ్డ యొక్క తల్లిదండ్రుల, చట్టబద్ధ సంరక్షకుల, చట్టపరంగా బిడ్డకు బాధ్యులైన ఇతర వ్యక్తుల యొక్క హక్కులు విధులను దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవాలి. అంతిమంగా అందుకోసం తగిన శాసనపరమైన, పాలనపరమైన చర్యలను తీసుకోవాలి.
  • బిడ్డల శ్రద్ధ, సంరక్షణకు ఉద్దేశించిన సంస్ధలు, సేవలు సదుపాయాలను నిపుణులు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి ( ముఖ్యంగా ఆరోగ్యం పారిశుద్ధ్యం విషయంలో) పనిచేసే విధంగా భాగస్వామ్య దేశాలు జాగ్రత్త తీసుకోవాలి.
ఆర్టికల్ - 4
  • సదస్సులో గుర్తించిన హక్కులను అమలు జరపటం కోసం భాగస్వామ్య దేశాలు తగిన శాసనపరమైన, పాలకపరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల విషయంలో భాగస్వామ్య దేశాలు తమ శక్తి మేరకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి.
ఆర్టికల్ - 6
  • జీవించే హక్కు బాలల జన్మహక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తిస్తున్నాయి.
  • పిల్లల మనుగడకు వారి అభివృద్ధికి భాగస్వామ్య దేశాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
ఆర్టికల్ - 12
  • అందుకోసం, జాతీయ చట్ట నిబంధనల పరిధిలో బిడ్డ ప్రత్యక్షంగాగానీ, వేరొక ప్రతినిధి ద్వారాగాన, ఒక సంస్ధ ద్వారాగానీ కోర్టులో పాలకవ్యవస్ధలో తన గోడు వినిపించుకొనే అవకాశం బిడ్డకు ఇవ్వబడుతుంది.
అభివృధ్ధి మరియు జీవించే హక్కు: జీవించేందకు ముఖ్యమైన హక్కు మరియు సంపూర్ణమైన గౌరవమైన జీవితం
ఆర్టికల్ - 7
  • బిడ్డ పుట్టగానే పేరు నమోదు చేయించుకునే హక్కు ఉంది. పుట్టగానే పేరు కలిగి ఉండే హక్కు ఉంది. జాతీయతను పొందే హక్కు ఉంది. వీలైనంత వరకు జ్ఞానం పొందే హక్కు ఉంది. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు ఉంది.
ఆర్టికల్ - 20
  • కుటుంబ జీవనం కోల్పోయిన బిడ్డలకు, లేదా కుటుంబ వాతావరణంలో తమ ఇష్టాయిష్టాలకు అవకాశం లేని పిల్లలకు ప్రభుత్వం రక్షణ, సహాయం కల్పించాలి.
  • అలాంటి పిల్లలకు భాగస్వామ్య దేశాలు తమ జాతీయ చట్టాల ననుసరించి ప్రత్యామ్నయ సంరక్షణ కల్పించాలి.
  • రక్షణ అనేది బిడ్డ భద్రత కోసం - పోషణ స్ధానం, ఇస్లామిక్ చట్టంలో కఫాలా, ఇతర సమాజాల్లో దత్తత, ఇంటర్ ఏలియా మొదలైన అంశాలకూ సంబంధించి ఉంటుంది.
ఆర్టికల్ - 23
  • మానసికంగా, శారీరకంగా వికలాంగులైన పిల్లలు సంపూర్ణమైన గౌరవమైన జీవితాన్ని గడపాలి. వారి గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. అలాంటి శిశువుల జనజీవనంలో చురుకుగా పాల్గొనేలా వీలు కల్పించాలి. అది భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
ఆర్టికల్ - 24
అత్యున్నతమైన ఆరోగ్య ప్రమాణాలను పొందేందుకు - రోగానికి చికిత్స పొందేందుకు, ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు, బిడ్డకు ఉన్న హక్కును భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. అలాంటి ఆరోగ్య సేవల్ని పొందే హక్కు నుండి బిడ్డా దూరం కాకుండా భాగస్వామ్య దేశాలు శ్రద్ధ తీసుకుంటాయి.
హక్కును దేశాలు అమలు చేసేందుకు భాగస్వామ్య దేశాలు పాటుపడతాయి. ప్రత్యేకించి -
  • శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు,
  • ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు,
  • ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు,
  • తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు,
  • సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు
  • వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
  • పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.
ఆర్టికల్ - 25
  • శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం సంబంధిత అధికారులు నిర్దేశించిన ఒక శిశువుకు చికిత్స చేసే క్రమంలో భాగస్వామ్య దేశాలు బిడ్డకు ఉన్న హక్కును ఇతర పరిస్ధితులను గుర్తించాలి.

Followers