విద్యా విధానంలో భారతీయత ప్రతిబింబించాలి

విద్య, నీరు, ఆరోగ్యం, విద్యుత్‌ మొదలైన ప్రాథమికావసరాలన్నీ సేవారంగాల పేరిట మొత్తం వ్యాపార వస్తువులుగా మారాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానమంతా ప్రపంచీకరణ ఫలితంగా మొత్తం ప్రజలందరికీకాక సామ్రాజ్యవాద కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు ఉపయోగపడుతోంది. విద్య ఆత్మజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని కలిగించాలి. దాంతోపాటు అది బతుకు తెరువుకు కూడా సాయపడితేనే సార్ధకం అవుతుంది. విద్యార్థులకు దైనందిన జీవితంలో ప్రత్యక్ష సంబంధంలేక పోవడం నేటి  విద్యా విధానంలోని ప్రముఖ లోపం. చదివిన విద్యతో ఏ విద్యార్థి ఉపాధి పొందలేదు. దొరికిన ఉద్యోగంలో తాను చదివిన చదువు ఉపయోగించడం లేదు.  తన పరిసరాలనూ, సంఘాన్ని గుర్తించి దానిని చక్కగా తీర్చిదిద్దినచో విద్య సార్ధకమవుతుంది. జాతి నిర్మాణ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేటట్లు విద్య దోహదపడాలి. చదువు బుద్ధి వికాసానికి, ఆత్మ సంస్కారానికి ముఖ్యమైంది. విద్య విజ్ఞానానికి వెలుగుబాట.

లక్ష్యాన్ని సాధించడమే చదవడంలో పరమార్థము. పరిపూర్ణమైన పౌరుడిగా వ్యక్తిగా ఎదగడానికి చదువు ప్రధాన మార్గం. చదువు వికాసాన్ని తెచ్చి పెట్టే పవిత్రమైన యజÑం వంటిది. నిరంతర పరిశ్రమతో జ్ఞానాన్ని సంపాదించి మానసిక పరిణతితో పరిపూర్ణమైన వ్యక్తిగా, పౌరుడిగా ఎదగడంచదువు దీర్ఘకాలిక లక్ష్యం. మానవుని విజ్ఞాన జ్యోతిగా తీర్చిదిద్దునది విద్య. ఈ విజ్ఞానం మానవుని నడవడికి, జీవితానికి బహుముఖంగా ఉపయోగపడేదిగా ఉంటుంది. విద్య లాభాలు సంపాదించే విధంగా రూపు చెందితే సమాజంలో అంతరాలు, వైరుధ్యాలు తీవ్రమవుతాయి. అసమానత పద్ధతుల్లో విద్యను పొందిన వారు సమానతను కాంక్షించరు. ధనమే మానవ సంబంధాలను నిర్ణయిస్తుంది. దేశ స్వావలంబన, స్వేచ్ఛ, న్యాయం, సమానత అనే విలువలు అర్థంగా జాతిని ప్రతిబింబించేలా విద్య ఉండాలి. విద్య పథకాలు, విధానాలు ప్రభువులు మారినా, మంత్రులు మారినా వారి మేథోసంపత్తికి,పరిమితికి తగిన రీతిగా ఆలోచించి వారికి నచ్చినతీరుగా విద్యావిధానాన్ని మార్పు చేస్తూ వస్తున్నారు. ఎపrడు విద్యావిధానం మారుతుందో మరల ఏ కొత్త పద్ధతి వస్తుందోననే ఆలోచన తప్ప లక్ష్యశుద్ధి లేకుండా పోతోంది. దేశ పారిశ్రామికాభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యావిధానం అత్యవసరం. మనది వ్యవసాయక దేశం. మనదేశంలోని పాఠశాలల్లో వ్యవసాయాన్ని గూర్చిన పాఠ్యాంశాలు లేవు.

విద్యావంతుల వల్ల మనదేశానికి పట్టిన జాడ్యం వల్ల విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడటానికి ఉత్సాహం చూపుతున్నారు. గ్రామాల్లో బీదవారికి విజ్ఞానం కన్నా ఉద్యోగంపై మక్కువ చూపుతున్నారు. మనది వ్యవసాయ దేశం కాబట్టి నూతన పరిశ్రమలు స్థాపిస్తున్నాం.వ్యవసాయాభివృద్ధికి, కుటీరపరిశ్రమల స్థాపనకు గల వనరులను దృష్టిలో ఉంచుకొని మన విద్యా విధానంలో మార్పులు చేయాలి. భావికాలంలో అవసరమైన వ్యక్తులకు శిక్షణావకాశాలు పెంపొందించే మార్గాలు ఉండాలి. సాంకేతిక విద్యాలయాల  సంఖ్యను కూడా తదనుగుణంగా పెంచాలి. విద్యావిధానంలో భారతీయత ప్రతి బింబించాలి. విద్యా విధానంలో భారతదేశ స్వరూపనముకు, అవసరాలకు తగిన విధంగా విద్యా ప్రణాళికా బోధనను మార్చవలసి ఉంది. జాతీయ అవసరాలకు అనుగుణమైన విధానముండాలి.

విద్యబోధనలో పరిశోధనలలోనే ప్రగతి. జాతీయా దాయంలో 10 శాతం నిధులు విద్యాబోధనల్లో పరిశోధనలకు కేటాయిస్తే అనేక ప్రయోగాలతో ఎంతో సాధించవచ్చు. సంప్రదాయ కోర్సుల స్థానంలో ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే కోర్సులుగా సమూల మార్పులు చేయాలి. విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడే మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యతనివ్వాలి. పరిపాలన నిర్వహణలో పాలు పంచుకునే ఉపాధ్యాయులకు ప్రత్యేక స్కిల్‌్‌స కలిగి ఉండాలి. మనదేశానికి జీవనాడులైన వివిధ రంగాల పరిశ్రమలకు, వృత్తులకు తగినట్లుగా శిక్షణా సంస్థల్ని ఉన్నత పాఠశాల స్థాయిలో నెలకొల్పి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. హైస్కూల్‌ స్థాయిలో వృత్తి విద్యను నిర్బంధ విషయంగా బోధించాలి. ఏదో ఒక సాంకేతిక విద్యను మామూలు విద్యతో జోడించి ప్రతి విద్యార్థి ఏదో ఒక విద్యలో నిష్ణాతుడయ్యే విధానం ఏర్పరచాలి. ఉన్నతస్థాయి విద్య సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి.

కాలానుగుణంగా విద్యారంగంలో కార్పొరేట్‌ విద్యతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానంలో మార్పులు తీసుకోవాలి. కాన్సెప్ట్‌ ఆధారిత, విశ్లేషణాత్మక విద్యాబోధన, ప్రతినెల స్కూల్‌ సెమినార్‌లు, పర్సనాలిటి డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక క్లాస్‌లు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఏకాగ్రతకు ఉపకరించేలా కౌన్సిలింగ్‌, మెడిటేషన్‌, యోగా క్లాసులు, పర్సనల్‌ ఫైల్స్‌తో ప్రతి స్లో లెర్నర్‌ ప్రగతిపై నిరంతర దృష్టి,విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలందు శిక్షణ, 3వ తరగతి నుండి ప్రాథమిక స్థాయి నుంచి కంప్యూటర్‌ శిక్షణ, ప్రతినెల విద్యార్థి ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలియచేయడం, అందుబాటులో రకరకాల పుస్తకాలతో చక్కని గ్రంథాలయం, నీతి బోధన, చిత్రలేఖనం, సంగీతం, వ్యాసరచన, వక్తృత్వంవంటి అంశాలకు ప్రాధాన్యత,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులు, 6వ తరగతి నుండి ఐఐటి వంటి పోటీపరీక్షలను దృష్టిలో పెట్టుకొని తర్ఫీదు నిర్వహించడం, అత్యంత ఆధునిక పరికరాలు, ఎల్‌సిడి, డిహెచ్‌పిలతో యానిమేషన్‌ దృశ్యాలతో అధునాతన విద్యాబోధన, స్టడీ, రీడింగ్‌ స్కిల్స్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ, మానసిక ఒత్తిడిలేని ఆధునిక పద్ధతులలో విద్యాబోధన, ఎడ్యుకేషనల్‌ టూర్స్‌ ద్వారా విద్యార్థుల విజ్ఞానాన్ని,వినోదాన్ని పెంపొందించుట, సైన్స్‌లో విషయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయుటకు ప్రయోగ శాలలో కూడిన బోధన, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, మానసిక స్థైర్యం కోసం నిష్ణాతులతో కౌన్సిలింగ్‌, మోటీవేషనల్‌ క్లాసులు నిర్వహించడం, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు సకాలంలో స్కాలర్‌షిప్‌ సౌకర్యం అందించడం, విద్యాభ్యాస మునకే కాక విద్యాభ్యాసేతర కార్యక్రమాలకు సమాన ప్రాము ఖ్యత ఇవ్వడం, విద్యార్థి శారరీక, మానసిక ప్రోత్సాహానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఉండాలి. ప్రతి విద్యార్థికి విధిగా ఒక వృత్తి విద్యనేర్పటం,సృజనాత్మక శక్తిని వృద్ధిని చేయటం, విద్యార్థికిష్టమైన విద్యనేర్చుకొనే స్వేచ్ఛ నివ్వటం, పోటీల్లో నెగ్గగల విధంగా తీర్చిదిద్దటం కూడా అమలు జరిపితే చాలా మంచి ఫలితాలు రాగలవు. ఆధునిక ప్రసార సాధానల ప్రభావం విద్యారంగం మీద విస్తారంగా వ్యాప్తి చేయాలి. విద్యార్థి జ్ఞాపకశక్తిపై పరీక్ష జరపకుండా అతని సునిశిత మేధాశక్తిపై పరీక్ష జరగాలి.

విద్యార్జనకు అనువైన వాతావరణముండాలి. చీటికి,మాటికి పాఠ్య ప్రణాళికను, పాఠ్యగ్రంథాలను,పరీక్షా పద్ధతులను, నియమ నిబంధనలను మార్చడం వల్ల విద్యార్థుల్లో అసహనం, అసంతృప్తి చోటు చేసుకుంటుంది. పిల్లల్లో స్వంత శక్తి సామర్ధ్యాలు వెలికితీయడానికి మూడుగంటల పరీక్షల్లో హెచ్చు మార్కులు తెచ్చుకుంటేనే జీవితం బాగా ఉంటుందని నూరిపోయడమే ప్రస్తుత విద్యావిధానం లక్ష్యం.  విద్యార్థుల ఐ.క్యూ తప్ప ఇతర మేధోశక్తి సామర్ధ్యాలను మదింపు చేసే శక్తి ఇప్పటిపరీక్షా పద్ధతికి లేదు. జాతీయభావంపెంపొందించుకొని విద్యార్థులు విద్యా సమస్య లను చర్చించవలనేకాని రాజకీయ వ్యూహాల్లో చిక్కుకోరాదు. ఒక శాస్త్రవేత్త ఒక్కొక్క భావిపౌరుడు వేయి పరమాణువులకు సమానం అని అన్నారు.పిల్లలను నాడు పుట్టి అపrడపrడే పెరుగుతున్న దశలో ఇంటనున్న పిల్లలు అలవాట్లు చుట్టుపక్కల వారి అలవాట్లు పాఠశాలలు, కళాశాలలు ఆ పుట్టిన బాబును భావి భారత పౌరునిగా తీర్చిదిద్దే కార్యాలయాలై వర్తించాలి. అపrడే దేశ  సౌభాగ్యం మరింతగా వెల్లివిరుస్తుంది. విద్యను ప్రభుత్వాలు సామాజిక అంశంగా గుర్తించి అన్నిరంగాల కంటే విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

విద్యారంగం జాతి ప్రగతికి ఆయువు పట్టు అని గుర్తించిన నాడే విద్యకు విలువ పెరుగుతుంది. విద్యారంగం బాగుపడుతుంది. విద్య కోసం వెచ్చించిన ప్రతి రూపాయి భవిష్యత్తులో జాతి ప్రగతికి పెట్టుబడిగా తలంచాలి. విద్య కేవలం పుస్తకాలకు పరిమితం కారాదు. వారు తమ సంఘాన్ని, ప్రజల జీవన పరిస్థితులను, కష్ట సుఖాలను అర్ధం చేసుకోవాలి. పొరుగువారికి తోడ్పడుటకు సేవా దృష్టిని అలవర్చుకోవాలి

నెపోలియన్‌ బొనపార్టి ఫ్రాన్సు

సామాన్య సైనికుడిగా ప్రారంభమైన నెపోలియన్‌ బొనపార్టి జీవితం ఫ్రాన్సు దేశానికి చక్రవర్తిగా, సకల ఐరోపా ఖండానికి తిరుగులేని నాయకుడుగా కలిగిన స్థానానికి ఎదగ గలిగింది. 1804 నుండి 1815 వరకు ఫ్రాన్సు దేశాన్ని పాలించిన నెపోలియన్‌ మొదట సైన్యంలో సాధారణ ఉద్యోగిగా చేరాడు. ఫ్రెంచి విప్లవం కొనసాగుతున్న ఆ రోజుల్లో చేవ గల సైనికాధికార్లకు అవకాశాలు మిన్నగా ఉండడంతో నెపోలియన్‌ చాకచక్యంగా అట్టి అవకాశాల్ని జారవిడువకుండా ఎదగగలిగాడు.
1796 ఏప్రిల్‌లో నెపోలియన్‌ ఇటలీపై దండయాత్రకు నిర్దేశించబడిన ఫ్రెంచి సైన్యానికి నాయకుడుగా నియమించబడ్డాడు. 27 ఏండ్లు కూడా నిండని నెపోలియన్‌కు ఇది ప్రతిష్టాకరమైన నియామకం. అతని జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. దాదాపు ఒక సంవత్సరం కొనసాగిన ఈ ఇటలీ దండయాత్ర తర్వాత నెపోలియన్‌ ఒక శక్తిగా రూపొందడం, అతి వేగంగా మహోన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది.
ఇటలీ దేశం ఆ రోజుల్లో అనేక స్వతంత్ర రాజ్యాల సమాహారం. ఒక్క సార్డీనియా తప్ప మిగిలిన రాజ్యాలన్నీ ఇతర ఐరోపా దేశాల అధీనంలో వ్ఞండేవి. అత్యధిక ప్రాంతం ఆస్ట్రియా పాలన క్రింద కొనసాగింది. అందు వల్ల నెపోలియన్‌ తన సేనలతో ఇటలీలో ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కొన వలసి వచ్చింది.
సైన్యాధ్యక్షుడుగా నెపోలియన్‌ అనేక సమస్యల నెదుర్కొనవలసి వచ్చింది. ఫ్రాన్సులో నెలకొన్ని అస్థవ్యస్థ పరిస్థితుల వల్ల సైనికులకు కలిగిం చిన సౌకర్యాలు చాలా తక్కువ. చాలీచాలని జీతాలు; చినిగిన యూనిఫారంలు, అర్ధ ఆకలితో కొనసాగే సైనికులతో నెపోలియన్‌ తన ఇటాలియన్‌ దండయాత్రను కొనసాగించవలసి వచ్చింది. కాని అన్ని అవరోధాలను అధిగమించి తన సైనికులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ వారిలోని జాతీయ భావాన్ని పురిగొల్పుతూ అశేష ఆస్ట్రియా సైన్యాలను ఎదిరించి అనేక విజయాలు సాధించగలిగాడు నెపోలియన్‌.
మొదట పీడ్మాంటు రాజ్యంపై విజయం సాధించాడు నెపోలియన్‌. దీని తార్వత బైల్యూ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుని క్రింద గల ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటలీలో క్రమంగా చొచ్చుకొస్తున్న ఫ్రెంచి సైన్యాలను అడ్డగించడానికి బూల్యూ అప్పటికప్పుడు కొత్త సైన్యాలను రప్పించి నెపోలియన్ను ఎదుర్కొన్నాడు. కాని 1796 మే నెల 6వ తేదినాటికి లంబార్డి రాజ్యాన్ని ప్రవేశించి మూడురోజుల తర్వాత 'అడ్డ అనే నది సవిూపానికి చేరుకొన్నాడు. నెపోలియన్‌ తన సేనలతో మెరుపుతీగలా జరిగిన ఈ చొరబాటుకు ఆస్ట్రియా సేనలు మే 10వ తేదీన నదిని దాటి తప్పించుకొన ప్రయత్నించాయి. చేరువ గల మిలన్‌ నగరానికి ఎట్టి రక్షణ లేకపోయింది.
'అడ్డ నదికి కుడివైపు తీరంలో వ్ఞంది 'లోడి అనే ఒక ప్రధాన పట్టణం. దానిచుట్టూ బలమైన కోట గోడలు వ్ఞండేవి. అప్పటికే ఆస్ట్రియా సేనలు వెళ్లినందున నెపోలియన్‌ సులభంగా లోడి పట్టణాన్ని ప్రవేశించాడు. దాదాపు 12 వేల మంది సైనికులు గల ఆస్ట్రియా సేనలు నదిపై గల వంతెనను దాటి అవతలివైపు మాటు వేశారు. మిలన్‌ పట్టణానికి గల దారి నెపోలియన్‌కు అధీనమైంది. కాని అడ్డ నదిపై గల లోడి బ్రిడ్జ్‌ కవతల సవిూకరించబడి వ్ఞన్న ఆస్ట్రియా సేనలను జయించిగాని మిలన్‌ నగరాన్ని చేరుకోలేడు.
లోడి వంతెన దాదాపు 200 అడుగుల పోడవ్ఞ కర్రలతో నిర్మించబడిన సన్నని వంతెన. దాదాపు 9 బెటాలియన్లతో ఆస్ట్రియా సైనికులు ఫ్రెంచి సేనలు బ్రిడ్జిని దాటనీయకుండా దిగ్భందన చేశారు. కాని నెపోలియన్‌ ఆస్ట్రియా సైన్యాలను శక్తివంతంగా ఎదుర్కొని పోరాడడానికి నిర్ణ యించుకొన్నాడు.
మే నెల 10వ తేది (1796) జరిగిన ఈ యుద్ధానికి ''లోడి బ్రిడ్జ్‌ యుద్ధం అని చరిత్రలో ప్రసిద్ధి పొందింది. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైన ఈ యుద్ధం సుమారు 5 గంటలు కొనసాగింది. గొప్ప వీరులుగా పేరుపొందిన సైవాయి సైనికులను మొదట శ్రేణుల్లో పంపాడు నెపోలియన్‌. కాని వారు వంతెనపై దాదాపు సగం దూరం రావడంతో ఆస్ట్రియా సేనలు వారిపై ఎగబడి తమ తుపాకుల వర్షంతో తిప్పిగొట్టారు. తర్వాత నెపోలియన్‌ మస్సీన, బార్తియర్‌ అనే ఇద్దరు యోధుల నాయకత్వం కింద మరికొంత సైన్యాన్ని పంపి రెండవ ప్రయత్నం కొనసాగించాడు. వీరు విజయవంతంగా ఆస్ట్రియా తుపాకులను ఛేదిస్తూ అవతలివైపుకు చేరగలిగారు. ఇంతలో మరికొన్ని కొత్త ఫ్రెంచి సైన్యాలు నెపోలియన్‌ను చేరాయి. దీనితో ఆస్ట్రియా సైన్యాలు వెనుదిరిగాయి.
ఈ లోడి బ్రిడ్జ్‌యుద్ధంలో ఆస్ట్రియా సేనలు విపరీత నష్టానికి గురైనాయి. దాదాపు 2 వేల మంది చనిపోయారు. అనేక తుపాకులు ఫ్రెంచివారి వశమయ్యాయి. మే నెల 14వ తేది నెపోలియన్‌ మిలన్‌ నగరాన్ని వీరోచితంగా ప్రవేశించాడు.
సైనికపరంగా లోడియుద్ధం అంత ప్రత్యేకత కలిగిందికాదు. కాని నెపోలియన్‌ జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. భవిష్యత్తులో అతని విజయపరంపరలకిది నాందిగా మారి, తనపై తనకు అమిత ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చింది. దీని గురించి తన భార్య జోసఫిన్‌కు రాసిన జాబులో నెపోలియన్‌ ఇలా తెలియజేశాడు. ''నా వద్ద గల ఖడ్గంతో నేనెంతకైనా ఎదగగలను అని.
లోడి బ్రిడ్జ్‌ దాటడానికి సైనికులనుత్తేజపరుస్తూ అతడు చేసిన ప్రసంగాలు బాగా పనికి వచ్చిన కారణంగా తర్వాతి యుద్ధాలలో అట్టి పద్ధతిని అనుస రించేవారు నెపోలియన్‌.
తాను కేవలం 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు మాత్రమే కలిగిన తన సైనికులందరి కన్నా పొట్టిగా వ్ఞన్నా, అతడు కనబరచిన ధైర్య సాహసాలకు అతని సైనికులు నెపోలియన్‌ను ''లిటిల్‌ కార్పొరల్‌ అని అన్నారట. అది తర్వాత కూడా తన ముద్దు పేరయింది.
భవిష్యత్తులో అనేక సైనిక విజయాలు సాధించాలనే అకుంఠిత దీక్ష; తన దేశంలో ఇతరులందరికంటే తానే గొప్పవాడనే ధీమా నెపోలియన్‌కు లోడి బ్రిడ్జ్‌ యుద్ధం మూలంగా కలిగింది.
''నెపోలియన్‌ అజేయుడు అన్న బలమైన భావాన్ని తాను నమ్మి, ఇతరులను నమ్మింపజేయడానికి కూడా ఈ యుద్ధం దోహద పడిందనవచ్చు

ప్లాస్టిక్‌ వినియోగంపై తప్పని నిషేధం

దేశంలో ప్లాస్టిక్‌ వాడకం రానురాను ఎక్కువవ్ఞ తోంది. ప్లాస్టిక్‌ వాడకం ద్వారా వాతావరణం కాలు ష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ సమాజానికి సవాల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిసంవత్సరం 50 వేలకోట్ల ప్లాస్టిక్‌ సంచులు వాడుతున్నారు. ప్లాస్టిక్‌ సంచులను వాడి ఎక్కడపడితే అక్కడ టన్నుల కొద్దీ పారేయడంతో ప్లాస్టిక్‌ వ్యర్థాల మూలంగా పర్యావరణ సమస్యలు  తలెత్తుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం కావడంతో అనేక సమ స్యలు వస్తున్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో ఒక రోజుకు సగ టున 350 మెట్రిక్‌ టన్నుల దాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపో తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను నివారించేందుకు కాలుష్య నియం త్రణ మండలి అటవీశాఖ ప్రవేశపెట్టిన సరికొత్త విధానాలు సఫలీ కృతం కాలేదు.  ప్లాస్టిక్‌ను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ అవి ఆచ రణలో అమలు కావడం లేదు. ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి విక్రయా లపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన పది లక్షల వంతును మైక్రాన్‌గా వ్యవహరిస్తున్నారు.
1986 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలని ప్రతిపా దించినా ఫలితాలు ఏమిరావడం లేదు. ఆరోగ్య కేంద్రాలు , ఫలహా రశాలలు, పార్కులు,మైదానాలు పర్యాటక స్థలాలు తదితర ప్రాంతా లలో ప్లాస్టిక్‌ సంచుల వాడకం నిషేధించారు. ప్రభుత్వ నిబంధన లను పాటించని ప్లాస్టిక్‌ సంచులు విక్రయించే వ్యాపారులకు జరిమా నాలు వసూలు చేస్తారు. అది ఎక్కడా అమలుకావడం లేదు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు అవ్ఞతాయి. వాటిలో మున్సి పాలిటీ కమిషనర్లు, ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారులు సమాఖ్య ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు నగరా లలో ఎన్నో చోట్ల చెత్తకుండీలు, మురికికాలువాలు బహిరంగ ప్రదే శాలలో లెక్కకు మించి ప్లాస్టిక్‌ కవర్లు పడి ఉంటున్నాయి. దీంతో దోమల బెడద అధికంగానే ఉంది. ప్లాస్టిక్‌ సంచులు వెయ్యి సంవ త్సరాలైనా భూమిలోకి ఇంకిపోవ్ఞ. ప్లాస్టిక్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. కొన్ని సంవత్సరాలకు పాలిథిన్‌ ఛిద్రమై ప్లాస్టిక్‌ ధూళిగా మారి మానవ శరీరాల్లోకి ప్రవేశించి రోగాలకు దారితీస్తుంది. తది తర ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతాయి. ఈ ప్లాస్టిక్‌ వల్ల జలా శయాలు కలుషితమైపోతున్నాయి. చెరువ్ఞలు, కుంటలు ఎండిపోయి మురికినీటితో కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. సముద్రాలు, నదులు, పూర్తిగా కలుషితంగా మారుతున్నాయి. పశువ్ఞల సంఖ్య నానాటికి ప్రమాదస్థాయిలో తగ్గిపోతున్నది. పక్షలు జీవరాశులు అంచెలంచెలుగా కనుమరుగైపోతున్నాయి. సముద్రాలలో తాబేళ్లు, చేపలు, కప్పలు, తరిగిపోతున్నాయి. ఆహారపదార్థాలను, కూరగా యలను, ఇతర వస్తువ్ఞలను ఎక్కువగా ప్లాస్టిక్‌ సంచులలో తెచ్చుకో వడంతో శారీరకంగా, మానసికంగా అనేక వ్యాధులు అంటుతు న్నా యి. చాలావరకు అనర్థాలకు దారితీస్తుంది. ఇంతజరిగినా ప్లాస్టి క్‌ను మాత్రం మరవలేకపోతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడా నికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా,సిక్కిం, కర్ణాటక రాష్ట్రాలు చేస్తు న్న కృషి కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి.  మన రాష్ట్రంలో మాత్రం ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు పెద్దగా పట్టిం చుకోవడం లేదు. పర్యావరణ సమస్యలు దినదినంగా మరింత ఉత్పన్నమవ్ఞతున్నాయి. ప్రభుత్వాలు మాత్రం తూతూ మంత్రంగానే పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టి వదిలేస్తున్నాయి. అడవ్ఞలను నరికివేయడం, కాలం చెల్లిన వాహనాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ వంటి విషవాయువ్ఞలు వెలువడటంతో పర్యావరణం పూర్తిగా నాశన మైపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్బన్‌ డైఆక్సైడ్‌ ప్రమాదస్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వర్షాలు లేక, కరువ్ఞ కాటకాలు, అతివృష్టి, అనావృష్టి ఎదురవ్ఞతుంది. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం, ప్లాస్టిక్‌ సంచులను పారేయడం ఇతర వ్యర్థా లను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల అంతుపట్టని అంటు వ్యాధులు వెంటాడుతున్నాయి.
హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో భూగర్భజలాలు కలుషితంగా మారాయి. దేశంలో కలుషిత నీరు తాగడం  వల్ల సంవత్సరానికి పది లక్షల మంది చనిపోతున్నారు. 2050 నాటికి కాలుష్యం తీవ్రం గా కలుషితం కానున్నది. పర్యావరణ పరిరక్షణకు రాజకీయ నేతల ఉపన్యాసాలు వేదికలకు మాత్రమే పరిమితమవ్ఞతున్నాయి తప్ప ఆచరణలో అమలు కావడం లేదు. ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధిం చినప్పటికీ ప్లాస్టిక్‌ వాడకం తగ్గడం లేదు. ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి భూమిలోకి చొచ్చుకుపోతు న్నాయి. వర్షాలు పడినప్పుడు భూమిలోకి నీరు ఇంకకుండా అడ్డు పడుతున్నాయి. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవ్ఞతున్నాయి. వర్షాలు అధికంగా కురియడంతో పలుచోట్ల నీటినిల్వలవల్ల దోమలు, ఇతర క్రిమి కీటకాలు ఎక్కువై  విషజ్వరాలకు కారణమవ్ఞతున్నాయి. ప్రతి ఒక్కరు మాకెందుకులే అనుకుంటే శుభ్రతతగ్గి వ్యాధులు ఎక్కు వయ్యే అవకాశాలున్నాయి.పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కోసం పాటుపడాలి. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా అందరు గుర్తించాలి. ప్లాస్టిక్‌ వస్తువ్ఞలైన బిందెలు, కవర్లు, గ్లాసులు, కప్పులు, గిన్నెలు, బాటిళ్లు లాంటి వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్‌ వస్తువ్ఞలను తయారు చేసే కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలి. ఒకవేళ ఈ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసు కోకున్నా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్‌ సంచుల ఉత్ప త్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ సంచులను వాడినా వాటిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్లు సేకరించిన ప్లాస్టిక్‌ సంచులను ఇతర వస్తు వ్ఞలను నివాస ప్రాంతాలకు దూరంగా తీసు కువెళ్లి వాటిని కాల్చి వేయాలి. ప్రజలు కూడా ఎక్కువగా పాలిథిన్‌ కవర్లను ఉపయో గించకుండా వాటిస్థానంలో పేపర్‌తో తయారైన సంచులను, బట్టలతో తయారైన సంచులను ఉపయోగిస్తే మంచిది. ఈ సంచు లు భూమిలోకి సులభంగా చొచ్చుకొనిపోతాయి. అంతే కాకుండా ఈ సంచులు నీటిని కూడా పీల్చుకుంటాయి.

ప్రాణాలను కాపాడే కృత్రిమ మూత్రపిండాలు

హీమోడయాలిసిస్‌ విధానంలో మూత్రపిండాలు నిర్వహించాల్సిన అతి ముఖ్యమైన విధులను కృత్రిమ మూత్రపిండాలు నిర్వహి స్తాయి. కృత్రిమ మూత్రపిండాలు ప్రధానంగా రెండు విధులను నిర్వర్తిస్తాయి. మొదటిది - శరీరంలో అధికంగాఉన్న ద్రవాలను మూత్ర రూపేణా తొలగించి, ద్రవాల సమతౌల్యాన్ని కాపాడటం.  రెండవది - వ్యర్థపదార్థాలను తొలగించి, రక్తంలోని విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడం. అల్ట్రాఫిల్టరేషన్‌ అనే ప్రక్రియ ద్వారా అధిక ద్రవాలను వెలుపలికి పంపితే, విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడానికి ఉపకరించే ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు. ఈ రెండు ప్రక్రియలను అనుసంధానిస్తూ, కృత్రిమ మూత్ర పిండాలు శరీరంలోని ద్రవాల, రసాయనాల సమతుల్యతను కాపాడుతాయి.

కృత్రిమ మూత్రపిండం లేదా డయలైజర్‌ రెండు అరలతో కూడిన సాధనం. మొదటి అరలోకి రక్తం ప్రవేశిస్తుంది. దీనిని రక్తపు అర అనీ లేదా బ్లడ్‌ కంపార్ట్‌మెంట్‌ అనీ అంటారు. అక్కడ ఉన్న పాక్షిక పారగమ్యత పొర (సెమి పర్మియబుల్‌ మెంబ్రేన్‌) ద్వారా ప్రవహిస్తుంది. దీనికి వెలుపల డయాలిసేట్‌ అర ఉంటుంది. ఈ అరలో స్వచ్ఛమైన డయాలిసేట్‌ ద్రావకం ఉంటుంది. ఈ ద్రావకం వ్యర్థ పదార్థాలను తొలగించి, రసాయనాలు సమతూకంలో ఉండేలా చూస్తుంది. డయలైజర్‌లో ఉన్న పొర డయాలిసేట్‌ ద్రావకంలోకి రక్తం చేరకుండా నివారిస్తూ, శరీరంలోని ద్రవాల సమతుల్యం (ఫ్లూయిడ్‌ బాలెన్స్‌) కోసం అల్ట్రాఫిల్టరేషన్‌ ప్రక్రియను, రసాయనాల సమతుల్యం (కెమికల్‌ బాలెన్స్‌) కోసం డిఫ్యూజన్‌ ప్రక్రియను నిర్వహిస్తూ, అతి సూక్ష్మ రంధ్రాల ద్వారా వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా కొన్ని పదార్థాలూ పొరకు అటూ ఇటూ తిరుగాడుతాయి. కానీ, ఎర్ర, తెల్ల రక్తకణాలు కానీ, ప్రొటీన్లు, బ్యాక్టీరియా వంటివి కానీ ప్రయాణించడానికి అవకాశం లేనంత చిన్నవిగా ఈ రంధ్రాలు ఉంటాయి. రక్తంలోని ద్రవాలను తొలగించే ప్రక్రియ అల్ట్రాఫిల్ట రషన్‌. పాక్షిక పారగమ్యత పొర ద్వారా రసాయనాలు, ద్రవాలు ఒకవైపునుంచి రెండవ వైపునకు ప్రవహించడాన్ని డిఫ్యూజన్‌ అంటారు. దీనిలో రెండు వేర్వేరు సాంద్రతలున్న ద్రావకాలు ఆ పొరకు అటూ ఇటూ ఉంటాయి. అతి సూక్ష్మపదార్థాలు లేదా అణువులు ఆ పొరను దాటి అటూ ఇటూ ప్రయాణిస్తూ రెండు ద్రావకాల సాంద్రతను సమానం చేస్తాయి. ఈ విధానాన్ని కొంత సేపు అలాగే కొనసాగిస్తే ద్రావకం-ఎ నుంచి అణువులు ద్రావకం- బిలోకి, అలాగే బినుంచి ఎలోకి ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు.
అమెరికాలో తరచుగా ఉపయోగిస్తున్న డయాలిసిస్‌ ప్రక్రియ ఈ  హీమో డయాలిసిస్‌. రోగికి ఇతర చికిత్సావిధానాల కంటే హీమోడయాలిసిస్‌ను వైద్యులు సూచిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఆయా రోగుల ఆరోగ్యం, మూత్ర పిండాలు దెబ్బతినడానికిగల కారణం, వయస్సు, జీవనశైలి, మూత్రపిండాల దాతలు లభ్యమవుతారా? వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చికిత్సా విధానాన్ని ఎంచుకోవడంలో రోగికి స్వేచ్ఛ ఉంటుంది. జీవిన విధానం, వృత్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రోగి తనకు నచ్చిన చికిత్సావిధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే అదే సమయంలో వైద్యులు రోగి ఆరోగ్యావసరాలనుబట్టి ఏ విధానం మంచిదో సూచిస్తారు. మూత్రపిండాలు దెబ్బతిని హీమోడయాలిసిస్‌ చేయించుకునే వారికి ఎదురయ్యే ప్రధానమైన సమస్య - ఎన్నిసార్లు ఈ హీమోడయాలిసిస్‌ చేయించుకోవాలి? అనేది. వారానికి రెండునుంచి మూడుసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. డయాలిసిస్‌ ఎన్నిసార్లు చేయించుకోవాలి? ప్రతిసారి ఈ ప్రక్రియను ఎంతసేపు చేయాలి? అనే అంశాలను చికిత్స చేస్తున్న వైద్యుడు రోగి పరిస్థితి ఆధారంగా నిర్ణయిస్తాడు.

జాండిస్‌ - కామెర్లు వ్యాధి

కామెర్లు వ్యాధి కాదు. కొన్ని రకాల వ్యాధుల్లో కనిపించే ఒక లక్షణం మాత్రమే. వ్యాధి ఏదైనా, రక్తంలో బిలిరుబిన్‌ అనే పదార్థం మోతాదు పెర గడంతో కళ్లు, చర్మం, పచ్చబడే అవకాశముం టుంది. కామెర్లు రావడానికిగల కారణాలను మెడికల్ కారణాలు, సర్జికల్‌ కారణాలుగా విభజి స్తారు. మెడికల్‌ కారణాల్లో విష పదార్థాలు (ఉదా హరణకు పాముకాటు వంటివి) ఎర్ర రక్త కణా లను నాశనంచేయడం ముఖ్యమైనది. ఏ కారణం గానైనా, కాలేయం చెడిపోతే కామెర్లు సోకు తాయి. పై వ్యాధులను కొంతవరకూ మందుల ద్వారా తగ్గించవచ్చు. అందుకే దీనిని మెడికల్‌ జాండిస్‌ అని అంటారు.
సర్జికల్‌ జాండిస్‌
బిలిరుబిన్‌ను కలిగి ఉండే పైత్యరసం కాలే యంలో తయారవుతుంది. ఇది ప్రవహించే బైల్‌ డక్ట్స్‌ (గొట్టాలు లేదా నాళాలు) డుయోడినమ్‌ లోకి, పాంక్రియాటిక్‌ డక్ట్‌తో కలిసి తెరుచుకుం టాయి. ఈ జీర్ణ రసాలు జీర్ణ ప్రక్రియల ద్వారా ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతాయి.
మధ్యలో మరొక డక్ట్‌ ద్వారా ఈ పైత్యరసం పిత్తాశయంలోకి చేరి అక్కడ నిలువ ఉంటుంది. అయితే ఈ గొట్టాల్లో దేనిలోనైనా అడ్డంకులు ఏర్పడితే రక్తంలో బైల్‌ పిగ్మెంట్‌ మోతాదు పెరిగి, జాండిస్‌ సంభవిస్తుంది. దీనినే అబ్‌స్ట్రక్టివ్‌ లేదా సర్జికల్‌ జాండిస్‌ అని వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ గొట్టాలలో అడ్డంకులు ల్యూమెన్‌లో కాని, గొట్టాల తాలూకు గోడలలో కాని లేదా ఏ ఇతర కారణాలవల్లనైనా బైటినుంచి కలిగే వత్తిడి వలన ఏర్పడి కాని సంభవిస్తాయి. ల్యూమెన్‌లో ఏర్పడే ముఖ్య కారణాల్లో పిత్తాశయంలో, డక్ట్స్‌లోరాళ్లు ఏర్పడుతాయి. వీటిని గాల్‌ స్టోన్స్‌ అని వ్యవ హరిస్తాము. అలాగే పిత్తాశయంలో ఇన్‌ఫెక్షన్‌ సోకినా, పిత్తాశయం కేన్సర్‌కు గురైనా పైత్య రసం ప్రవహించడానికి ఆటకం ఏర్పడి జాండిస్‌ సంభవిస్తుంది.
లక్షణాలు
కడుపు నొప్పి అకస్మాత్తుగా, తీవ్రంగా ఏర్ప డటం అరుదు. వీటిలోనొప్పి తీవ్రత తగ్గుము ఖంతో ఉండి, వాంతులు కావచ్చు. నొప్పి కడుపు పై భాగంలో కేంద్రీకృతమై, వెన్నెముకకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ జాండిస్‌ క్రమంగా మూత్ర పిండాలపై  ప్రభావం చూపి, మూత్ర పిండాలు వైఫల్యానికి కారణమవుతుంది.
చికిత్స
అడ్డంకి ఏర్పడటానికిగల కారణాలు, కాలే యంలో అడ్డంకి ఎక్కడ ఉందో తెలుసుకుని తరు వాత శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గాల్‌ స్టోన్స్‌ (గాల్‌బ్లాడర్‌లో రాళ్లు) కారణమైతే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది.
ఒకవేళ కేన్సర్‌ కారణమైతే, దానిని కూడా రాడికల్‌ ఆపరేషన్‌ ద్వారా సరి చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో ఇటీవల బాగా ప్రాచు ర్యంలోకి వచ్చిన లాపరోస్కోపిక్‌ శస్త్ర చికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చును.
డాక్టర్‌ వి. అశోక్‌కుమార్‌,
సర్జన్‌, హైదరాబాద్‌

ఆత్మవిశ్వాసమే ఇంటర్వ్యూలో విజయం

ఏ ఉద్యోగానికైనా ఇంటర్వ్యూ ముఖ్యం. ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాన్ని పొందడం అసాధ్యం. కాబట్టి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనే ఆశయం ఉన్నవారు ఇంటర్వ్యూను కూడా అంతేస్థాయిలో సిద్ధపడి, నెగ్గాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పరీక్షను రాతపరీక్షకు కొనసాగింపు పరీక్షగా చెప్పుకోవచ్చు. దీన్ని నిర్వహించటంలో ముఖ్యోద్దేశం-బ్యాంకు ఉద్యోగ నిర్వహణకు అభ్యర్థి ఏ మేరకు సరిపోగలడో తెలుసుకునే ప్రయత్నం చేయడం. ముఖా ముఖీ మాట్లాడి అభ్యర్థి వ్యక్తిత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే తెలివితేటలు, అల వాట్లు, ఆత్మస్థైర్యం, చురుకుదనం ప్రెజెన్స్‌ ఆఫ్‌ మైండ్‌ ఇవన్నీ తెలుసుకో వడం. ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్న-జవాబుల పరంప రేనా? అలా అను కోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చాడనేది ముఖ్యం. చాలా సందర్భాల్లో అభ్యర్థి చెప్పే విషయాల నుంచే సభ్యుల అనుబంధ ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి.
ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం ముఖ్యం  ఆందోళన, భయం ఉంటే ఇంటర్వ్యూ సరిగా చేయలేరు. అందుచేత అభ్యర్థికి ఆత్మస్థైర్యం చాలా అవసరం. కనీసం అలావ్ఞన్నట్లుగా కనపడే ప్రయ త్నం చేయాలి. దీనివల్ల భయం, ఆందోళనల వంటివి కనబడకుండా జాగ్రత్తపడవచ్చు. వ్యక్తి విజయంలో దీనిది కీలకపాత్ర. నడవడిక, అభిరు చులు, విషయాలు తెలియజేసే పద్ధతి, వేసుకునే, సంకోచాలు, భావోద్వేగాలు దాచుకోవడం, విషయా లను ముగించే పద్ధతి, ముఖకవళికలు తదితరాల ద్వారా ఇది తెలుస్తుంది. ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా అభ్యర్థిని సభ్యులు దీనికోసమే నిశితంగా గమని స్తుంటారు. హాలులోకి ప్రవేశించేముందు తలుపు తీసే పద్ధతి, సభ్యులకు నమస్కరించే విధానం, కుర్చీలో కూర్చునే పద్ధతి మొదలైనవన్నీ కూడా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అభ్యర్థి తన భావాలు,ఆలోచనలు వ్యక్తం చేసే పద్ధతి మీదనే తను ఇంటర్వ్యూ ఎంత బాగా చేశాడనేది ఆధిరపడి ఉంటుంది. తన భావాలు స్పష్టంగా తెలియ జేసినపుడే సభ్యులను ఆకట్టుకోగలుగాడు. అడిగిన ప్రశ్నలకు జవాబులను సరైన పదాలు ఉపయో గిస్తూ, కుప్లంగా, స్పష్టంగా వినసొంపుగా చెప్పాలి. ఏది అడుగుతారో దానికి మాత్రమే జవాబు చెప్పాలి. కంఠస్వరం బిగ్గరగానూ, తక్కువగానూ కాకుండా ఎదుటివారికి చక్కగా వినపడేలా ఉండాలి. ఇంటర్వ్యూ ఆద్యంతం ప్రసన్నంగా చిరునవ్ఞ్వతో ఉండగలగాలి. దీనవల్ల సభ్యులకు అభ్యర్థి ఏ సమస్యనైనా ఆందోళన లేకుండా పరిష్కరించగ లడనే నమ్మకమేర్పడుతుంది. ఇంటర్వ్యూ సమయ మంతా అభ్యర్థి చురుకుగా ఉండాలి. సభ్యులడిగే ప్రశ్నలు వీలైనంత త్వరగా అర్థం చేసుకొని జవాబు చెప్పాలి. ప్రశ్నలు జాగ్రత్తగా వినాలి. ప్రశ్నను మళ్లీ అడగమని సభ్యులను రెండుమూడు సార్లు అభ్యర్థిస్తే అంత చురుకుగా లేనట్టు అర్థమవ్ఞతుంది. ప్రశ్నలను విని ఉత్సాహంగా జవాబులు చెబితే అభ్యర్థి ఇంటర్వ్యూకి చాలా ప్రాముఖ్యమిస్తూ సిద్ధ మయినట్లు సభ్యులు హ్రిస్తారు.

బ్యాంకింగ్‌ రంగంపై ప్రశ్నలు
బ్యాంకు అంటే ఏమిటి? సిఆర్‌ఆర్‌ అంటే ఏమిటి? పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంక్‌లో ఉండి ప్రైవేటు బ్యాంకుల పోటీని ఎలా తట్టుకుంటారు? ఆర్‌బిఐ విధులు ఏమిటి? ఎస్‌బిఐ టాంగ్‌లైన్‌ ఏమిటి? మీ పేరుకు అర్థం ఏమిటి? ఈ ఉద్యోగానికి మీరు సరిపోగలరని ఎలా అనుకుంటున్నారు? రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి చెప్పండి, అస్సాంలో జరుగుతున్న ఆందోళనలకు కారణాలేమిటి? అవినీతి వ్యతిరేక ఆందోళనలు, లోక్‌పాల్‌ బిల్లు, అన్నాహజారే, 2012 ఒలింపిక్స్‌, కాగ్‌ నివేదిక, బొగ్గుస్కామ్‌ మొదలైన తాజా పరిణామాలపై ప్రశ్నలు అడుగుతారు.

మేకప్‌ ఎలాగుండాలి?
ఇంటర్వ్యూకు మీరు వెళ్తున్నప్పుడు మీ దుస్తులు మీకెంతో సౌకర్యంగా ఉండాలి. లైట్‌కలర్‌ దుస్తులను ధరించాలి. ఎక్స్‌పోజింగ్‌గా ఉండకుండా, హుందాగా కనిపించే దుస్తులనే ధరించాలి. అలాగే సభ్యుల జాలిపొందే విధంగా ప్రవర్తించవద్దు. ప్రశ్నలు మీకు అర్థం కాకపోయినా, సరిగా వినిపించకపోయినా మరలా అడగమని సభ్యులను అడగండి. ఇంటర్వ్యూలో ఏవైనా నిజాయితీకే ప్రాధాన్యత ఇవ్వండి. గొప్పలకుపోయి లేనిపోని డిగ్రీలు, అనుభవాలను అదనంగా జోడించి చెప్పకండి.

తెలంగాణలో ఎసిఎంఇ 80 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రం

  ACME గ్రూప్‌ 80 మెగావాట్ల విద్యుత్‌ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నదని ప్రక్కటించారు. ఎసిఎంఇ 107 మిలియన్‌ డాలర్లను తెలంగాణలో పెట్టుబడి పెడుతోంద న్నారు. మొత్తం 502.5 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి ప్రతిపాదనలు సిద్ధంచేసామని 2017 నాటికి ACME సోలార్‌ 1000 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. తొలివిడతగా తెలంగాణదక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ మండలితో ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే పదినెలల క్రితం ప్రారంభించారు. ఆర్థికపరమైన లావా దేవీలు, విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. కంపెనీ ఛైర్మన్‌ మనోజ్‌కుమార్‌  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని చెప్పారు. గతనెలలోనే వంద మిలియన్‌ డాలర్ల ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం సాధించామని, 50 మిలియన్‌ డాలర్లు వంద మెగావాట్ల ప్రాజెక్టులకు వినియోగిస్తామని చెప్పారు. రాజస్థాన్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకోసం తొలివిడతగా 34 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఐఎఫ్‌సి సంస్థ కూడా తమకు 73.10 కోట్ల రుణపరపతి అందిం చిందని మధ్యప్రదేశ్‌లో 25 మెగావాట్ల సౌలార్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

నాగార్జున వర్సిటీలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేవ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. యూనివర్సిటీలోని ఆడిటోరియం అసెంబ్లీ నిర్వహణకు బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధానిని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతవరకు నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ముఖ్య శాఖల కార్యాలయాలను తరలించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Followers