పీసీ..మ్యాక్‌..ఓ యూజర్‌!


మోడల్‌ ఏదైనా... కాన్ఫిగరేషన్‌ ఎంతైనా... వాడకంలో బ్యాలెన్స్‌ లేకపోతే ప్రయోజనం శూన్యం. అవసరానికి తగిన సాఫ్ట్‌వేర్‌లను ఓపిగ్గా వెతకాలి. ఇన్‌స్టాల్‌ చేయాలి. వాడి చూడాలి. అబ్బే... మాకంత సమయం ఎక్కడిదీ? అనే కోవకి వచ్చే వారి కోసమే ఇవి. వాడితే రెండిటినీ ఇట్టే బ్యాలెన్స్‌ చేయవచ్చు!ఏవైనా ఫైల్స్‌ని కాపీ చేయడానికి 'కాపీ' ఆప్షన్ని వాడడం తెలుసు. ఇలా కాపీ చేస్తున్న సందర్భాల్లో కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఉదాహరణకు కాపీ చేస్తున్నప్పుడు మధ్యలో 'పాజ్‌' చేయడం ఎలా? అలాగే, అక్కర్లేని ఫైల్స్‌ని కాపీ అవుతున్నప్పుడు 'స్కిప్‌' చేయవచ్చా?... అలాంటివి అనేకం. వీటికి సమాధానంగా 'ఆల్ట్రాకాపీయర్‌' టూల్‌ని వాడొచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టం ట్రేలో చేరి పని చేస్తుంది. ఫైల్స్‌ని కాపీ చేయడానికి ఆప్షన్‌తో కాపీ చేయవచ్చు. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.సిస్టం సామర్థ్యం మందగిస్తే 'టెంపరరీ ఫైల్స్‌' తొలగిస్తుంటాం. అందుకు రన్‌లోకి వెళ్లి ఏవేవో కమాండ్స్‌ వాడుతుంటారు. అవేం లేకుండా సిస్టంలో దాగి ఉన్న టెంపరరీ ఫైల్స్‌ని ఈ టూల్‌ తొలగిస్తుంది. జిప్‌ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయాలి. టూల్‌ని రన్‌ చేసేందుకు 'డాట్‌నెట్‌ ఫ్రెమ్‌వర్క్‌ 4.0' అప్లికేషన్‌ సిస్టంలో ఉండాలి. నెట్‌లో వాడే సర్వీసులు అనేకం. అన్నింటి లాగిన్‌ వివరాల్ని గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. అందుకు ఈ టూల్‌తో లాగిన్‌ తాళాల్ని సురక్షితంగా భద్రం చేయవచ్చు. కావాల్సినప్పుడు అనువుగా వాడుకోవచ్చు. ఇదో ఓపెన్‌సోర్స్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌. అన్ని పాస్‌వర్డ్‌లను ఒక్క మాస్టర్‌ పాస్‌వర్డ్‌తో భద్రం చేయవచ్చు. అంటే... క్రియేట్‌ చేసుకున్న అన్ని పాస్‌వర్డ్‌ల డేటాబేస్‌కి తాళం మాస్టర్‌ పాస్‌వర్డ్‌ అన్నమాట. ఫోల్డర్‌ ఐకాన్స్‌ అన్నీ ఒకే రంగులో ఉంటాయి. కానీ, ముఖ్యమైన ఫోల్డర్ల రంగులు మార్చుకుని వాటి ప్రాధాన్యాన్ని తెలిపేలా సెట్‌ చేసుకుంటే? అందుకు అనువైన టూల్‌ ఇదే. జిప్‌ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయాలి. ఇన్‌స్టాల్‌ చేశాక రంగు మార్చాలనుకునే ఫోల్డర్‌పై రైట్‌క్లిక్‌ చేయాలి. వచ్చిన పాప్‌అప్‌ మెనూలో 'రెయిన్‌బో' ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసి కావాల్సిన రంగుని ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఎక్స్‌పీ వాడుతున్నట్లయితే ఫోల్డర్‌ స్టెల్‌ని 'విస్టా' మోడల్‌లో సెట్‌ చేసుకోవచ్చు. మొత్తం ప్రక్రియ ముగిశాక ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఒకవేళ ఫోల్డర్‌ రంగుని తొలగించాలి అనుకుంటే ఉంది. టూల్‌ డౌన్‌లోడ్‌ కోసం లింక్‌లోకి వెళ్లండి.ఎక్కువ మెమొరీ తీసుకోకూడదు. కానీ, దాంట్లో అలారం సౌకర్యం ఉండాలి. పుట్టిన రోజు లాంటి ముఖ్యమైన వాటిని గుర్తు చేయాలి. డైరీ రాసుకోవాలి. అడ్రస్‌లను భద్రం చేసుకోవాలి. టైమర్‌ కౌంట్‌డౌన్‌ లాంటి మరిన్ని సౌకర్యాల్ని వాడుకోగలగాలి. అదీ ఉచితంగా... ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ టూల్‌ మీకే. ఇన్‌స్టాల్‌ చేయగానే డెస్క్‌టాప్‌పై ఐకాన్‌ గుర్తు వస్తుంది. ఆప్షన్‌తో పీసీలో అలారం సెట్‌ చేయవచ్చు. ద్వారా పీసీని నిర్ణీత సమయానికి షట్‌డౌన్‌ చేయవచ్చు. పేరు, మొబైల్‌ నెంబర్‌, ఈమెయిల్‌, పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌... వివరాలతో 'అడ్రస్‌బుక్‌' క్రియేట్‌ చేయవచ్చు. మ్యాక్‌లో మాదిరిగా పీసీలోనూ 'డాకింగ్‌' బార్‌ని సెట్‌ చేసుకోవచ్చు. తెరకి అన్ని వైపులా డాక్‌బార్‌ని సెట్‌ చేసుకోవచ్చు. డాక్‌బార్‌లో కొత్త అప్లికేషన్‌ని ఇన్‌సర్ట్‌ చేయాలంటే... డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో చేయవచ్చు. డాక్‌బార్‌ యానిమేషన్‌ ఎఫెక్ట్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లండి. బార్‌ని ఆటోమాటిక్‌గా హైడ్‌ చేయవచ్చు కూడా. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ మొబైల్‌ని పీసీకి కనెక్ట్‌ చేసి డేటాని ట్రాన్‌ఫర్‌ చేయడం సులువే. అదే మ్యాక్‌కి కనెక్ట్‌ చేస్తే! ఎలాంటి స్పందనా ఉండదు. అదే ఈ 'ఆండ్రాయిడ్‌ ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌' టూల్‌తో సులువుగా మ్యాక్‌కి మొబైల్‌ని కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. టూల్‌ని మ్యాక్‌లో ఇన్‌స్టాల్‌ చేసి ఫోన్‌కి కనెక్ట్‌ చేస్తే పాప్‌అప్‌ ద్వారా కనిపిస్తుంది. ఇక మైక్రోఎస్‌డీ కార్డ్‌ని యాక్సెస్‌ చేసి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలోనూ ఫైల్స్‌ని కాపీ చేసుకునే వీలుంది. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.మ్యాక్‌ సామర్థ్యం కాస్త నెమ్మదిస్తే! టూల్‌తో స్టార్ట్‌అప్‌లో ఏమేం రన్‌ అవుతున్నాయో తెలుసుకుని మేనేజ్‌ చేయవచ్చు. ఇదో మల్టీ ఫంక్షన్‌ యుటిలిటీ టూల్‌. సిస్టం ఫైల్స్‌ని స్కాన్‌ చేసి చూడొచ్చు. అక్కర్లేని చెత్తని తొలగించి వేగాన్ని పెంచుతుంది. మెమొరీ డిలీట్‌ చేస్తుంది. మ్యాక్‌లో ఫైల్స్‌ని ఎప్పుడూ ఒకేలా వెతికి బోర్‌ అనిపిస్తే ఈ టూల్‌ని ప్రయత్నించండి. సరికొత్త సౌకర్యాల్ని మ్యాక్‌ ఓఎస్‌ని జత చేయవచ్చు. ఉదాహరణకు ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేసేప్పుడు బ్రౌజర్‌లో మాదిరిగా ట్యాబ్‌ విండోలను సెలెక్ట్‌ చేసుకునే వీలుంది. రెండు విండోలను జోడుగా 'డ్యూయల్‌ ప్యానల్‌, డ్యూయల్‌ విండో'ల్లో ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు. విండోస్‌లో మాదిరిగా ఫైల్స్‌ని కట్‌, కాపీ చేసుకునే వీలుంది. ఏదైనా ఫోల్డర్‌ని సెలెక్ట్‌ చేసుకుని దాని 'పాత్‌'ని కాపీ చేయవచ్చు. అందుకు ఉంది. డెస్క్‌టాప్‌ మొత్తాన్ని మాయం చేయవచ్చు. లాంటి ఆప్షన్లు మరిన్ని ఉన్నాయి. టూల్‌ కోసం లింక్‌ చూడండి.ఎక్కువ సమయం మ్యాక్‌ ముందే గడుపుతున్నారా? అయితే, కళ్లకు అసౌకర్యం కలగకుండా టూల్‌ని వాడుకోవచ్చు. ప్రాపర్టీలను ఆటోమాటిక్‌గా మార్పులు చేస్తుంది. రోజులోని వేళల్ని అందుకు కొలమానంగా తీసుకుంటుంది. ఉదాహరణకు రాత్రి సమయంలో పూర్తిగా విద్యుత్‌ దీపాల్లో పని చేస్తుంటాం. అలాంటి సందర్భాల్లో మ్యాక్‌ డిస్‌ప్లేని కళ్లకు అనువుగా మార్పులు చేస్తుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.మ్యాక్‌లో ఎక్కువగా వాడే అప్లికేషన్లు సులువుగా పొందేందుకు ఇదో చక్కని వేదిక. కావాల్సిన ఫైల్స్‌ని కూడా దీన్నుంచే వెతకొచ్చు. మరింత వేగంగా వేతికేందుకు హాట్‌కీస్‌, కీవర్డ్స్‌ని కూడా పెట్టుకునే వీలుంది. ఒకటి కంటే ఎక్కువ మ్యాక్‌ల్లో వాడాల్సివస్తే 'డ్రాప్‌బాక్స్‌' క్లౌడ్‌స్టోరేజ్‌ సర్వీసు ద్వారా సెట్టింగ్స్‌ని సింక్‌ చేసుకోవచ్చు. టూల్‌ కోసం లింక్‌ని చూడండి.మ్యాక్‌ కాన్ఫిగరేషన్‌ ఏంటో తెలుసుకునేందుకు అనువైంది. మొత్తం (సీపీయూ, ర్యామ్‌, హార్డ్‌డిస్క్‌, నెట్‌వర్క్‌ యూసేజ్‌...) సమాచారాన్ని మెనూబార్‌లోనే చూపిస్తుంది. ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.జిప్‌ చేసిన ఫైల్స్‌ని మ్యాక్‌లో ఎక్స్‌ట్రాక్ట్‌ చేసేందుకు వాడొచ్చు. లాంటి ఇతర ఫార్మెట్‌లనూ సపోర్ట్‌ చేస్తుంది. మ్యాక్‌ ఆప్‌ స్టోర్‌ నుంచే టూల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Firfox Tips ....! ఫైర్‌ఫాక్స్‌ జిత్తులు

మరింత అనువుగా పనిని చేయడం ఎలా?... ఇదో ప్రశ్న. నిత్యం పీసీతో పని చేసే వారి మదిలో మెదులుతూనే ఉంటుంది. వాడుతున్న సాఫ్ట్‌వేర్‌లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. దగ్గరి దార్లు వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో ఫైర్‌ఫాక్స్‌ వాడే యూజర్లు అనేక చిట్కాల్ని ప్రయత్నించొచ్చు. నచ్చిన వాటిని బ్రౌజర్‌కి జత చేసుకుని వాడుకోవచ్చు. ఉదాహరణకు ఏవైనా వెబ్‌ సర్వీసుల్ని తెరపై కావాల్సిట్టుగా సెట్‌ చేసుకుని అన్నింటినీ ఒకేసారి చూస్తూ పని చేసుకోవచ్చు. అందుకో ప్రత్యేక యాడ్‌ఆన్‌ సిద్ధంగా ఉంది. యూట్యూబ్‌లో వీడియోలు చూసేప్పుడు ఆటోమాటిక్‌గానే హైక్వాలీటీ వీడియోలు ఓపెన్‌ అవుతాయి. ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సార్లు జీమెయిల్‌, ఫేస్‌బుక్‌ని ఒకేసారి చూడాలనుకుంటాం. రెండిటిలోని స్నేహితులతో ఒకేసారి ఛాట్‌ చేయడానికి వీలుపడుతుందేమో అని ప్రయత్నిస్తాం. కొంత మంది విజయం సాధించి ఉంటారు. కానీ, అది క్లిష్టమైన ప్రక్రియే. చాలా సులువుగా ఒకటి కంటే ఎక్కువ ట్యాబ్‌లను తెరపై ఒకేసారి చూస్తూ పని చేసేందుకు అనువైన యాడ్‌ఆన్‌ ఒకటుంది. అదే ఫైర్‌ఫాక్స్‌ యాడ్‌ఆన్స్‌ స్టోర్‌ నుంచి పొందొచ్చు. రౌజర్‌కి యాడ్‌ చేయగానే అడ్రస్‌బార్‌ పక్కనే అదనపు ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. పక్కనే ఉన్న పాయింటర్‌పై క్లిక్‌ చేసి ఓపెన్‌ చేసిన ట్యాబ్‌ విండోలోను కావాల్సినట్టుగా తెరపై సెట్‌ చేసుకోవచ్చు. అందుకు మెనూలో వివిధ రకాల 'ట్యాబ్‌ లేఅవుట్స్‌' ఉన్నాయి. ట్యాబ్‌లను తెరకు నిలువు, అడ్డంగా పెట్టుకునే వీలుంది. ఒకవేళ ఓపెన్‌ చేసిన అన్ని ట్యాబ్‌లను నిలువుగా సెట్‌ చేసుకునేందుకుసెలెక్ట్‌ చేసుకోవాలి. ఒకవేళ లేఅవుట్‌ అక్కర్లేదు అనుకుంటే మెనూలోకి వెళ్లి 'క్లోజ్‌ లేవుట్‌'పై క్లిక్‌ చేయాలి. 'ఆప్షన్స్‌'ని మార్చుకుని ట్యాబ్‌ లేఅవుట్‌లో మార్పులు చేసుకునే వీలుంది. ఖాళీ దొరికితే టీవీ ఛానల్స్‌ చూస్తామో లేదో తెలియదుగానీ... యూట్యూబ్‌ ఛానల్‌ని తప్పక ఓపెన్‌ చేస్తాం. మీకు తెలుసుగా? యూట్యూబ్‌లో ఏదైనా వీడియోని ఓపెన్‌ చేస్తే డీఫాల్ట్‌గా మీడియం క్వాలిటీతో ప్లే అవుతుంది. తర్వాత ఒకవేళ హెచ్‌డీ క్వాలిటీలో చూడాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి పిక్సల్స్‌ క్వాలిటీని మార్చుకోవాలి. ఇవేం లేకుండా ఒక బుల్లి యాడ్‌ఆన్‌తో యూట్యూబ్‌ వీడియో క్వాలిటీని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్ని బ్రౌజర్‌కి యాడ్‌ చేయగానే టూల్‌బార్‌లో లోగో కనిపిస్తుంది. ఇక మీదట యూట్యూబ్‌లో వీడియోని ఓపెన్‌ చేస్తే హెచ్‌డీ క్వాలిటీతో ఓపెన్‌ అవుతుంది. ఇక టూల్‌బార్‌లోని మెనూ ద్వారా మరింత అనువుగా వీడియోని చూడొచ్చు. ప్లే అవుతున్న వీడియోని తెరపై పెద్దగా చూడలంటే... మెనూలోని ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. 'ఫుల్‌స్క్రీన్‌'లో చూసేందుకు వీడియోపై డబుల్‌క్లిక్‌ చేయాలి. నెట్‌ కనెక్షన్‌ స్పీడ్‌ ఆధారంగా వీడియో క్వాలిటీని నుంచి కి సెట్‌ చేయవచ్చు. ఆలస్యం దేనికి లింక్‌లోకి వెళ్లండి. బ్రౌజింగ్‌ హిస్టరీగానీ, ఎలాంటి కీవర్డ్స్‌గానీ ఇతరుల కంట పడకూడదు అనుకుంటే ప్రైవేటు బ్రౌజింగ్‌ చేస్తుంటాం. అందుకు బ్రౌజర్‌లోనే 'ప్రైవేటు విండో' ఆప్షన్‌ ఉంది. దాన్ని ఎంపిక చేసుకుంటే ఏకంగా బ్రౌజర్‌ మరో కొత్త విండోలో ఓపెన్‌ అవుతుంది. అలాకాకుండా అన్ని ట్యాబ్‌ల మాదిరిగానే ప్రైవేటు బ్రౌజింగ్‌ కోసం 'ప్రైైెవేటు ట్యాబ్‌'ని ఓపెన్‌ చేసుకుంటే? అందుకు మార్గమే యాడ్‌ఆన్‌. బ్రౌజర్‌ని యాడ్‌ చేశాక రీస్టార్ట్‌ చేయక్కర్లేదు.బ్రౌజర్‌లోని ఫైల్‌ మెనూలోకి వెళ్తే అదనంగా 'న్యూ ప్రైవేట్‌ ట్యాబ్‌' మెనూ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే సరి. ఒకవేళ షార్ట్‌కట్‌తో ఓపెన్‌ చేద్దాం అనుకుంటే మీటల్ని కలిపి నొక్కండి. యాడ్‌ఆన్‌ కోసం లింక్‌లోకి వెళ్లండి. వెబ్‌ విహారంలో కావాల్సిన కొన్ని వెబ్‌ పేజీలను ప్రింట్‌లు తీస్తుంటాం. కానీ, పేజీల్లో అక్కర్లేని కంటెంట్‌ ఉంటుంది. అలాగే, ప్రింట్‌లు తీస్తే ప్రింటర్‌ క్యాట్రిడ్జ్‌ వృథానే కదా! మరి, దీనికి పరిష్కారం లేదనుకోవద్దు. అందుకో ప్రత్యేక యాడ్‌ఆన్‌ ఉంది. కావాలంటే ప్రయత్నించండి. బ్రౌజర్‌కి యాడ్‌ చేయగానే టూల్‌బార్‌లో ప్రత్యేక ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. ఇక మీరు ఏదైనా వెబ్‌ పేజీని ప్రింట్‌ తీయాలనిపిస్తే అదే పేజీలో ఉండి 'ప్రింట్‌ ఎడిట్‌' గుర్తుపై క్లిక్‌ చేసి పేజీ మొత్తం ప్రివ్యూ కనిపిస్తుంది. ఇక పాయింటర్‌తో అక్కర్లేని వాటిని డిలీట్‌ చేయవచ్చు. సెలెక్ట్‌ చేసేందుకు మౌస్‌తో డ్రాగ్‌ చేయాలి. డిలీట్‌ చేయడం ఎందుకు అనుకుంటే చేయవచ్చు. టెక్స్ట్‌కి ఉన్న ఫార్మెట్స్‌ని తీసేందుకు 'ఫార్మెట్‌' మెనూలోకి వెళ్లండి. పొరబాటున డిలీట్‌ చేస్తే చేసుకునే వీలుంది. యాడ్‌ఆన్‌ని ప్రయత్నించాలనుకుంటే లింక్‌లోకి వెళ్లండి. ఇంట్లో తాతయ్యకు బ్రౌజర్‌ మెనూలు కనిపించడం లేదా? డీఫాల్ట్‌గా ఉన్న ఫాంట్‌ చదివేందుకు అనువుగా లేదా? అయితే మార్చేయండి. అదెలా సాధ్యం? అందుకు తగిన యాడ్‌ఆన్‌ సిద్ధంగా ఉంది. అదే బ్రౌజర్‌కి యాడ్‌ చేసి రీస్టార్ట్‌ చేయాలి. ఇప్పుడు టూల్‌బార్‌లో ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఫాంట్‌ మెనూలోని ఉన్న ఫాంట్‌ స్త్టెల్‌ సెలెక్ట్‌ చేయగానే బ్రౌజర్‌లో మారిపోతుంది. అలాగే, సైజు మెనూ ద్వారా మెనూల్లోని టెక్స్ట్‌ పరిమాణాన్ని పెంచుకునే వీలుంది. టెక్స్ట్‌ రంగు, బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా మార్చుకునే వీలుంది. అక్కర్లేదు అనుకుంటే తిరిగి 'నార్మట్‌' సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. కొన్ని సైట్‌ల్లో రైట్‌క్లిక్‌ని కట్టడి చేస్తుంటారు. టెక్స్ట్‌ని సెలెక్ట్‌ చేయడానికి వీలు పడదు. రైట్‌క్లిక్‌ చేసి కాపీ, పేస్ట్‌ ఆప్షన్లను యాక్సెస్‌ చేయడం సాధ్యపడదు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? రైట్‌క్లిక్‌ని వాడలేమా? ఏం కాదు... ఎక్స్‌టెన్షన్‌తో చిటికెలో సాధ్యం. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. బ్రౌజర్‌ స్టార్ట్‌ పేజీలోనే స్పీడ్‌ డయల్‌ ట్యాబ్‌లతో పాటు బుక్‌మార్క్‌లను సింక్రనైజ్‌ చేసుకుని మేనేజ్‌ చేసుకునేందుకు ఎక్స్‌టెన్షన్ని వాడొచ్చు. మీ ఫొటోలను పేజీ బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. బ్రౌజర్‌ ఎడిట్‌ మెనూలోని 'కాపీ' ఆప్షన్‌తో కాపీ చేస్తే టెక్స్ట్‌కి ఉన్న అన్ని ఫార్మెట్‌లూ కాపీ అవుతాయి. అలా కాకుండా వెబ్‌ పేజీల్లోని టెక్స్ట్‌ మేటర్‌ని ఎలాంటి ఫార్మెట్‌లు అప్లె కాకుండా కాపీ చేయవచ్చు. అందుకు ఎక్స్‌టెన్షన్‌ని ఫైర్‌ఫాక్స్‌కి యాడ్‌ చేయండి. తర్వాత ఎడిట్‌ మెనూలోకి వెళ్లి చూస్తే ఆప్షన్‌ కనిపిస్తుంది. షార్ట్‌కట్‌ ద్వారా చేయాలంటే మీటల్ని వాడొచ్చు. ఓపెన్‌ చేసి ఉన్న ట్యాబ్‌ల్లోకి వెళ్లకుండానే ప్రివ్యూ చూడొచ్చా? యాడ్‌ఆన్‌తో చూడొచ్చు. దీన్ని బ్రౌజర్‌కి జత చేసిన తర్వాత పాయింటర్‌ని ట్యాబ్‌పై ఉంచగానే అక్కడే 'పాప్‌అప్‌' మెనూ మాదిరిగా ప్రివ్యూ విండో కనిపిస్తుంది. విండోపై రైట్‌క్లిక్‌ చేస్తే జూమ్‌ అవుతుంది కూడా. ప్రివ్యూ విండో నుంచే ట్యాబ్‌ని 'రీఫ్రెష్‌' చేయవచ్చు. బ్రౌజర్‌లోని మెమొరీని ఒకే క్లిక్కుతో తొలగించొచ్చు. అందుకు బటన్‌ని వాడొచ్చు. బ్రౌజర్‌ని జత చేయగానే ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సరి.


Gmail Tips ... ! జీమెయిల్‌ జిలుగులు!




విద్యార్థులు... ఉద్యోగులు... వ్యాపారులు... ఎవరికైనా... జీమెయిల్‌ అనివార్యమే! ఏదో వాడడం కాదు! ఇలా వాడితే అదనంగా ప్రయోజనాలు ఎన్నో!ట్టింట్లో ఏది చేయాలన్నా... గూగుల్‌ గుమ్మం దాటాల్సిందే. అందుకు జీమెయిల్‌ ఎకౌంట్‌ గేట్‌పాస్‌. మెయిళ్లు పంపుతాం. గూగుల్‌ ప్లస్‌కి అనుసంధానం అవుతాం. యూట్యూబ్‌లోకి వెళతాం. ఇంకా చెప్పాలంటే.. గూగుల్‌ డ్రైవ్‌ని వాడుకుంటాం. ఇదంతా తెలిసిందే. జీమెయిల్‌ ఐడీతో ఇంకా చాలానే చేయవచ్చు. డ్రైవ్‌లో బ్యాక్‌అప్‌ చేసుకున్న మ్యూజిక్‌ ట్రాక్స్‌ని అక్కడే వినొచ్చు. మీ ప్రింటర్‌కి అనుసంధానమై ఎక్కడి నుంచైనా ప్రింట్‌లు ఇవ్వొచ్చు. యూట్యూబ్‌ ఛానల్‌ని నిర్వహించొచ్చు. ఇంకా చాలానే చేవయచ్చు. అవేంటో వివరంగా తెలుసుకుందాం!గూగుల్‌ డ్రైవ్‌ అంటే క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసని... దాంట్లో అందిస్తున్న ఉచిత స్పేస్‌లో డాక్యుమెంట్‌లు, ప్రజంటేషన్స్‌, స్ప్రెడ్‌షీట్‌లు, ఫొటోలు... భద్రం చేసుకోవచ్చనీ.. వాటిని గూగుల్‌ డాక్స్‌తో ఎప్పుడైనా ఎడిట్‌ చేసుకోవచ్చనీ తెలుసా? అలాగే దాంట్లోకి మీకు ఇష్టమైన పాటల్ని అప్‌లోడ్‌ చేసుకుని వినొచ్చని తెలుసా? అందుకో థర్డ్‌పార్టీ సర్వీసు ఉంది. అయితే, గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో సైట్‌ని ఓపెన్‌ చేయండి. జీమెయిల్‌తో లాగిన్‌ అయ్యి చేయాలి. దీంతో గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసిన అన్ని పాటలు జాబితాగా కనిపిస్తాయి. ఎప్పుడైనా... ఎక్కడైనా మీ మ్యూజిక్‌ లైబ్రరీని వినొచ్చు. ఎంపీ3, ఎంపీ4 ఫైల్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది. నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఏ సిస్టంలోనైనా ట్రాక్స్‌ని వినొచ్చు. ఒకవేళ మొబైల్‌లో వినాలనుకుంటే? అందుకు తగిన ఆప్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే ఆప్‌ని వాడొచ్చు. గూగుల్‌ డ్రైవ్‌తో పాటు డ్రాప్‌బాక్స్‌, బాక్స్‌, షుగర్‌సింక్‌, స్కైడ్రైవ్‌, అమెజాన్‌ ఎస్‌3... క్లౌడ్‌స్టోరేజ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే ఆయా క్లౌడ్‌స్టోరేజ్‌ల్లో భద్రం చేసుకున్న మ్యూజిక్‌ ట్రాక్స్‌ని వినొచ్చన్నమాట. యాపిల్‌ యూజర్లు ఆప్‌ని వాడొచ్చు. మీకు తెలుసా? ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంట్లోని ప్రింటర్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడాలి. జీమెయిల్‌తో లాగిన్‌ అయ్యి ఇంట్లోని ప్రింటర్‌కి ప్రింట్‌ ఇవ్వొచ్చు. ముందుగా ఇంట్లోని ప్రింటర్‌, పీసీ ఆన్‌లో ఉండాలి. ఇప్పుడు బ్రౌజర్‌ని ఓపెన్‌ చేసి 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లాలి. వచ్చిన ట్యాబ్‌ విండోలోని మెనూలోని ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. 'మేనేజ్‌'పైన క్లిక్‌ చేసి 'యాడ్‌ ప్రింటర్‌'తో వాడుతున్న ప్రింటర్‌ని జత చేయాలి. ఇక ఎక్కడినుంచైనా ప్రింట్‌ ఇవ్వాలనుకుంటే క్రోమ్‌ బ్రౌజర్‌లోని 'ప్రింట్‌'పై క్లిక్‌ చేసి ద్వారా రిమోట్‌ ప్రింటర్‌ని సెలెక్ట్‌ చేసుకుని ప్రింట్‌ ఇవ్వాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... బ్రౌజర్‌లోని కంటెంట్‌ని మాత్రమే ఇలా ప్రింట్‌ తీసుకోగలరు. సిస్టం సాఫ్ట్‌వేర్‌ల నుంచి ప్రింట్‌ ఇవ్వలేరు. ఒకవేళ వర్డ్‌ డాక్యుమెంట్స్‌ని ప్రింట్‌ తీసుకోవాల్సివస్తే 'గూగుల్‌ డాక్స్‌'లోకి అప్‌లోడ్‌ చేసుకుని 'ఆఫీస్‌' ఫైల్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు.ఇదే సౌకర్యాన్ని మొబైల్‌ నుంచి కూడా వాడుకోవచ్చు. అందుకు తగిన ఆప్‌ కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.ఐఫోన్‌ యూజర్లకు ప్రత్యేకం. మొబైల్‌లో ఎన్నో కాంటాక్ట్‌లను సేవ్‌ చేస్తుంటాం. అనుకోకుండా మొబైల్‌ పోయినా... కొత్త మొబైల్‌కి అప్‌డేట్‌ అవ్వాల్సివచ్చినా... కాంటాక్ట్‌లను మేనేజ్‌ చేసుకోవడం కొంచెం క్లిష్టమైన ప్రక్రియే. కానీ, జీమెయిల్‌లోని 'కాంటాక్ట్‌'లతో చిటికెలో మొబైల్‌లోకి సింక్‌ చేయవచ్చు. అందుకు జీమెయిల్‌ హోం పేజీలోని ఎడమవైపు కనిపించే పక్కన బాణం గుర్తుపై క్లిక్‌ చేసి 'కాంటాక్ట్‌'ను ఎంపిక చేసుకోవాలి. ఇక మొబైల్‌లోని అన్ని కాంటాక్ట్‌లను మాన్యువల్‌గా అడ్రస్‌బుక్‌లో యాడ్‌ చేయవచ్చు. ఒకవేళ ఫైల్‌ ఉన్నట్లయితే కాంటాక్ట్‌ ట్యాబ్‌లోని 'మోర్‌'పైన క్లిక్‌ చేసి ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. మొత్తం కాంటాక్ట్‌లను అడ్రస్‌బుక్‌లో పొందుపరిచాక 'మోర్‌'లోని పై క్లిక్‌ చేసి ఫార్మెట్‌ల్లో సేవ్‌ సేవ్‌ చేయవచ్చు. ఇక ఎప్పుడైనా మొబైల్‌లోకి కాంటాక్ట్‌లను సింక్‌ చేసుకోవాలంటే గూగుల్‌ ఎకౌంట్‌తో మొబైల్‌లోకి లాగిన్‌ అవ్వగానే మొత్తం కాంటాక్ట్‌లు సింక్‌ అవుతాయి. ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, ఐఓఎస్‌, విండోస్‌ ఫోన్‌... వాడేది ఏ ఫ్లాట్‌ఫాం అయినా కాంటాక్ట్‌లను సింక్‌ చేయవచ్చు.మీకున్న క్రియేటివ్‌ స్కీల్స్‌తో యూట్యూబ్‌లో ఓ ఛానల్‌ ఓపెన్‌ చేయవచ్చు. అందుకో వెబ్‌ కెమెరా, మైక్రోఫోన్‌ ఉంటే చాలు. జీమెయిల్‌ ఐడీనే గేట్‌పాస్‌గా చేసుకుని ఛానల్‌ని ప్రారంభించొచ్చు. యూట్యూబ్‌ హోం పేజీలోని 'మై ఛానల్స్‌'లోకి వెళ్లి ఛానల్‌ పేరు ఎంటర్‌ చేయాలి. 'అప్‌లోడ్‌'పై క్లిక్‌ చేసి రికార్డ్‌ చేసిన వీడియోలు అప్‌లోడ్‌ చేసి షేర్‌ చేయవచ్చు. ఒకవేళ వెబ్‌ కెమెరాతో రికార్డ్‌ చేయాలనుకుంటే లోని 'రికార్డ్‌'పై క్లిక్‌ చేయాలి. రికార్డింగ్‌ పూర్తయ్యాక ప్రివ్యూ చూసి పబ్లిష్‌ చేయాలి. 'వీడియో మేనేజర్‌' విభాగంలోకి వెళ్లి వీడియోల సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. ఇతరుల కంట పడకూడదు అనుకుంటే 'ప్రైవేట్‌'గా సెట్‌ చేయాలి. 'వీడియో ఎడిటర్‌' ద్వారా యూట్యూబ్‌లోనే వీడియోలను ఎడిట్‌ చేసుకునే వీలుంది. ఇక సిస్టంలోని వీడియో ఫైల్స్‌ని పబ్లిష్‌ చేయాలంటే డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో అప్‌లోడ్‌ చేయవచ్చు.వాడుతున్న జీమెయిల్‌లో ఎంత స్పేస్‌ని అందిస్తున్నారో ఎప్పుడైనా విశ్లేషించారా? జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ప్లస్‌ సర్వీసులు ఎంతెంత మెమొరీ తీసుకున్నాయో చెక్‌ చేశారా? అదేమంత క్లిష్టమైన ప్రక్రియేం కాదు. మొత్తం 15 జీబీ ఉచితంగా అందిస్తున్నారు. వాడకం ఎలా ఉందో చూడాలంటే జీమెయిల్‌ పేజీ కిందిభాగంలో ఎడమవైపు పరిశీలిస్తే కనిపిస్తుంది. ఉదాహరణకు అని కనిపిస్తూ కిందే ఆప్షన్‌ ఉంటుంది. మరింత వివరంగా ఏయే సర్వీసు ఎంతెంత మెమొరీ ఖర్చు అయ్యిందో తెలుసుకోవాలంటే 'మేనేజ్‌'పై క్లిక్‌ చేయండి. ఛార్ట్‌ ద్వారా మెమొరీ వాడకాన్ని చూడొచ్చు. మరింత స్పేస్‌ కావాలనుకుంటే ప్రీమియం ఎకౌంట్‌ని కొనుగోలు చేయవచ్చు.ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే ఆప్‌తో ఫొటోలు, వీడియోలను బ్యాక్‌అప్‌ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి ఆప్షన్ని ఎనేబుల్‌ చేయాలి. యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందండి. జీమెయిల్‌లోని సెర్చ్‌ ద్వారా కావాల్సిన మెయిల్స్‌ని వెతకడం తెలిసిందే. మరింత నిశితంగా మెయిల్స్‌ ద్వారా వచ్చిన ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ని వెతకొచ్చని తెలుసా? అందుకు సెర్చ్‌ కీవర్డ్స్‌ ఉన్నాయి. ఉదాహరణకు మెయిల్‌ ఎటాచ్‌మెంట్స్‌లో 10ఎంబీ కంటే ఎక్కువ మెమొరీ తీసుకున్న మెయిల్స్‌ని వెతకాలంటే? సెర్చ్‌బాక్స్‌లో అని టైప్‌ చేసి ఎంటర్‌ చేస్తే చాలు. ఇదే 10 ఎంబీ సైజు ఉన్న ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ 6 నెలల ముందువి కావాలంటే? కీవర్డ్‌ వాడొచ్చు. ఉదాహరణకు ఇలా... సాఫ్ట్‌వేర్‌ల్లో మాదిరిగానే జీమెయిల్‌లోనూ షార్ట్‌కట్‌ మీటలు వాడుతున్నారా? అదెలా? అనేది మీ సమాధానం అయితే... మెయిల్‌లో వాడుకునేందుకు బోల్డన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. ఉదాహరణకు మెయిల్‌కి రిప్త్లె ఇవ్వాలంటే కీబోర్డ్‌లోని నొక్కితే సరి. మెయిల్‌లో ఏదైనా లింక్‌ని ఇన్‌సర్ట్‌ చేయాలంటే? సింపుల్‌గా నొక్కితే సరి. ఇలా జీమెయిల్‌లో వాడుకోదగిన షార్ట్‌కట్‌ మీటల్ని తెలుసుకునేందుకు నొక్కండి. మొత్తం జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా జీమెయిల్‌లోని పనుల్ని చిటికెలో చక్కబెట్టేయవచ్చు.ఇన్‌బాక్స్‌లోనే సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ని మరింత స్మార్ట్‌ చూసేందుకు క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి ఆప్‌ని వాడొచ్చు. క్రోమ్‌కి జత చేయగానే ఆప్‌లాంచర్‌లో కనిపిస్తుంది. రన్‌ చేసి ప్రత్యేక మెనూ, టూల్‌బార్‌తో సోషల్‌లైఫ్‌ని మరింత సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. ఆప్‌ కోసం లింక్‌లోకి వెళ్లండి.మానంలో వెళ్తున్నప్పుడో... రైలు ప్రయాణంలోనో కొన్నిసార్లు ఎలాంటి నెట్‌వర్క్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ని యాక్సెస్‌ చేసి పని చేయవచ్చు. అందుకో చిట్కా ఉంది. మీరు క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌' నుంచి ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. సిస్టంలో అనుకునేరు. క్రోమ్‌ బ్రౌజర్‌లోనే! అందుకు లింక్‌లోకి వెళ్లండి. 'యాడ్‌'పైన క్లిక్‌ చేసి ఆప్‌ని క్రోమ్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి. యాప్‌లాంచర్‌లో వచ్చిన లోగోపై క్లిక్‌ చేసి ఆప్షన్ని చెక్‌ చేసి క్లిక్‌ చేయాలి. ఇక నెట్‌ కనెక్షన్‌ లేకున్నా మెయిల్స్‌ని యాక్సెస్‌ చేయవచ్చు.

జ్ఞాపకశక్తి భళా.. రికార్డులు కొట్టేలా!

9765433232566788909090099887766544332. ఈ అంకెను ఓసారి జాగ్రత్తగా గమనించండి. ఐదు నిమిషాలాగి చూడకుండా అదే వరుసలో చెప్పేయండి. అసాధ్యం కదూ! పదంకెల సెల్‌ఫోన్‌ నెంబరే గుర్తుండటం కష్టం. అలాంటిది ఇన్ని అంకెలా? అనుకుంటాం. యార్లగడ్డ సిస్టర్స్‌కి ఇలాంటివి తేలిక. 40, 50 అంకెల సంఖ్య అయినా ఒక్కసారి చూస్తే చాలు గర్తుపెట్టుకొని అలవోకగా చెప్పేస్తారు.అక్కాచెల్లెళ్లిద్దరూ మొదట్నుంచీ చురుకే. చెస్‌ ఆడేవారు. పెయింటింగ్స్‌ వేసేవారు. ఫొటోగ్రఫీ, థాయ్‌చీ మార్షల్‌ ఆర్ట్స్‌లో ముందే. ఎన్ని ఫోన్‌ నెంబర్త్లెనా తేలికగా గుర్తు పెట్టుకునేవారు. ఈ ప్రతిభకి మరింత సానబెట్టాలనుకున్నారు కన్నవాళ్లు. అప్పటి నేషనల్‌ మెమొరీ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జయసింహని కలిశారు. జ్ఞాపకశక్తికీ పోటీలుంటాయనే విషయం తెలిసింది. ఆయన దగ్గర కేవలం వారం రోజులు శిక్షణ పొంది జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యారు. తొలి అడుగే పెద్ద విజయం. శ్రీవైష్ణవికి ఆరు, రమ్యశ్రీకి పద్నాలుగో స్థానం దక్కింది. రెట్టించిన ఉత్సాహంతో మరింత సీరియస్‌గా సాధన చేయడం మొదలుపెట్టారు. జాతీయస్థాయి పోటీల్లో టాప్‌ టెన్‌లో నిలిచిన వాళ్లకి అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తారు. ఆ రకంగా ప్రపంచస్థాయి పోటీలకు అర్హత సాధించారు. 2010లో వైష్ణవి జూనియర్స్‌ విభాగంలో తన అంతర్జాతీయ ప్రస్థానం మొదలుపెడితే, రమ్యశ్రీ సీనియర్‌గా బరిలోకి దిగింది. అప్పట్నుంచి వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రతిభ చూపుతూనే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.మెమొరీ ఛాంపియన్‌షిప్‌ పోటీలంటేనే క్లిష్టమైనవి. ప్రపంచస్థాయి పోటీలంటే మరింత కఠినంగా ఉంటాయ్‌. మొత్తం పదిరకాల పోటీలు దాటాలి. ప్రస్తుత 'వరల్డ్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌'ని వరల్డ్‌ మెమొరీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తుంది. ఇందులో 45 దేశాలకు సభ్యత్వం ఉంది. 33 దేశాలు పోటీపడ్డాయి. మరో అభ్యర్థితోపాటు టాప్‌ 3 నిలిచి రమ్యశ్రీ, శ్రీవైష్ణవిలు ఇండియాని తొమ్మిదో స్థానంలో నిలిపారు. ఆ పోటీలివే.బైనరీ నెంబర్స్‌: ముప్ఫై అంకెల నెంబర్‌ ఇచ్చి పదిహేను నిమిషాల తర్వాత మళ్లీ అవే వరుస క్రమంలో రాసి చూపించమంటారు. స్పీడ్‌ వర్డ్స్‌: తక్కువ సమయంలో ఎక్కువ అంకెల్ని గుర్తించగలగాలి.నేమ్స్‌ అండ్‌ ఫేసెస్‌: వివిధ దేశాలకు చెందిన వ్యక్తుల ఫొటోలు, పేర్లు ఇస్తారు. పదిహేను నిమిషాల్లో ఎవరెక్కువందిని గుర్తిస్తే వాళ్లే విజేత. ఈ విభాగంలో రెండు ప్రపంచరికార్డులు సృష్టించింది శ్రీవైష్ణవి.చారిత్రక తేదీలు: అప్పటికప్పుడే కొన్ని సంఘటనలు, జరిగిన తేదీలు చెబుతారు. ఇచ్చిన సమయంలో వాటిని అప్పజెప్పాలి.అబ్‌స్ట్రాక్ట్‌ ఇమేజెస్‌: సరైన రూపంలేని కొన్ని బొమ్మలు చూపిస్తారు. వాటిని షఫిల్‌ చేసి ఇంతకుముందున్న వరుసక్రమం చెప్పమంటారు. ర్యాండమ్‌ నెంబర్లు: నలభై అంకెలున్న ముప్పై పేజీలిస్తారు. తర్వాత అవి ఏ క్రమంలో ఉన్నాయో గుర్తించగలగాలి.స్పోకెన్‌ నెంబర్లు: సెకనుకో నెంబర్‌ చొప్పున నాలుగువందల నెంబర్లు వినిపిస్తారు. 5 నిమిషాలయ్యాక ఆ క్రమాన్ని చెప్పాలి.స్పీడ్‌ కార్డ్స్‌: పేకాట ముక్కలు ఒకసారి చూపిస్తారు. ఆపై వాటిని కలిపేసి ఇంతకుముందు ఏ క్రమంలో ఉండేవో గుర్తించమంటారు.10ని. కార్డ్స్‌: పై పోటీలాంటిదే. రెట్టింపు సమయం పోటీ.జాతీయస్థాయిలోనూ ఇదే తరహా పోటీలుంటాయి. అత్యుత్తమ ప్రతిభ చూపిన ముగ్గుర్ని దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు గుర్తిస్తారు. ఓవరాల్‌ ర్యాంకు నిర్ణయిస్తారు. సాధన చేస్తే ఎవరైనా ఎవరైనా మెమొరీ ఛాంపియన్‌ కావొచ్చని అక్కాచెల్లెళ్ల సలహా. అందుకు వారు చెప్పే కిటుకులు.పెగ్‌ వర్డ్స్‌: ఒక్కో అంకెకు ఒక్కో రూపాన్ని వూహించుకోవాలి. అవి వస్తువులు, స్నేహితులు, నచ్చిన పదార్థాలు ఏవైనా కావొచ్చు. పోటీలో ఆ అంకె కనపడగానే ఆ రూపం మదిలో మెదిలేలా ప్రాక్టీస్‌ చేయాలి.క్రియేటివ్‌ మెథడ్‌: చిన్నప్పుడు చదివిన కథలు, జరిగిన సంఘటనల చుట్టూ ఓ కథ అల్లుకోవాలి. వాటిలోని పాత్రలు, వస్తువులను తేదీలు, సంవత్సరాలకు గుర్తులుగా పెట్టుకోవాలి.జర్నీ మెథడ్‌: మన చుట్టూ ఉన్న కొన్ని పరిసరాలు, వస్తువులు ఆటోమేటిగ్గా గుర్తుండిపోతాయి. ల్యాండ్‌ మార్కులను కొన్ని చిత్రాల రూపంలో గుర్తు పెట్టుకోవాలి. ఈ పద్ధతులకు తోడు యోగ, నడక, ధ్యానం, వ్యాయామం.. ఇలా ఏదో ఒక కసరత్తును దినచర్యలో భాగం చేసుకుంటే జ్ఞాపకశక్తిని ఒడిసిపట్టొచ్చు అంటున్నారు. అవార్డులందాయి..2010 వరల్డ్‌ జూనియర్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీవైష్ణవికి బంగారు పతకం2012లో నేమ్స్‌ అండ్‌ ఫేసెస్‌ విభాగంలో శ్రీవైష్ణవి రెండు ప్రపంచరికార్డులు2012 వరల్డ్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టులో ఇద్దరూ సభ్యులు.జాతీయ మెమొరీ ఛాంపియన్‌షిప్‌ 2013లో శ్రీరమ్యకి ఆరోస్థానంప్రపంచ మెమొరీ ఛాంపియన్‌షిప్‌ 2011, 2012లో ఐదు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్టులో సభ్యులు.

Followers