జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్

Tags:  జనరల్ సైన్స్  స్టడీ మెటీరియల్, జనరల్ సైన్స్ పుస్తకాలలోని టాపిక్స్‌

1. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (నిమ్‌ హాన్స్‌) ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్‌
బి) ముంబయి
సి) కోల్‌కత
డి) బెంగళూరు
2. పర్యావరణ నిర్వహణలో మొత్తం 122 దేశాల జాబితాలో భారత్‌ స్థానం -
ఎ) 67 బి) 94
సి) 118 డి) 127
3. ప్రపంచంలోని మొదటి 'గోల్డెన్‌ గ్రౌండ్‌ నట్‌' ('ఎ' విటమిన్‌ అధికంగా ఉండే వేరుశనగ) ను జన్యు మార్పిడి పద్ధతి ద్వారా అభివృద్ధి చేసిన సంస్థ -
ఎ) ఇక్రిశాట్‌
బి) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌
సి) మోనోశాంటో
డి) సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌ (క్రీడా)
4. ప్రపంచ అల్జీమర్‌ దినం -
ఎ) సెప్టెంబరు 21
బి)డిసెంబరు 21
సి) డిసెంబరు 12
డి) సెప్టెంబరు 16
5. పుట్టినప్పుడు శిశువు గుండె నిముషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
ఎ) 40-70 సార్లు
బి) 35-40 సార్లు
సి) 16-18 సార్లు
డి) 20 సార్లు
6. రైబోఫ్లేవిన్‌ లోపంవల్ల నోటి అంచుల్లో చర్మం పగిలిపోవడాన్ని ఏమంటారు?
ఎ) న్యూరిటిస్‌
బి) కీలోసిస్‌
సి) అనొరెక్సియా
డి) పెల్లాగ్రా
7. కిందివాటిలో ఏది కీటకం?
ఎ) జెల్లీ చేప
బి) కటిల్‌ చేప
సి) డెవిల్‌చేప
డి) సిల్వర్‌ చేప
8. కిందివాటిలో సరైనవేవి?
1) రెండు ఎముకలను కలిపేది లిగమెంట్‌
2) మనిషిలోని కశేరుకాల (ఙవత్‌ీవbతీaవ) సంఖ్య 33
ఎ) 1 మాత్రమే          బి) 2 మాత్రమే
సి) రెండూ             డి) ఏదీకాదు
9. సర్పాల విషానికి విరుగుడు మందు (యాంటీ వీనం)ను తయారు చేసే హాఫ్‌కిన్‌ సంస్థఎక్కడుంది?
ఎ) నాగ్‌పూర్‌             బి) డెహ్రాడూన్‌
సి) ముంబయి            డి) పుణె
10. విటమిన్‌ 'ఇ' రసాయన నామం
ఎ) ఫిల్లోక్వినోన్‌
బి) టోకోఫెరాల్‌
సి) సైనకోబాలమిన్‌
డి) కాల్సిఫెరాల్‌
11. కిందివాటిలో కాండం కానిది -
ఎ) బంగాళాదుంప
బి) అల్లం
సి) చామగడ్డ
డి) చిలగడదుంప
12. పేపరు, పాలరాయి, తోలు నాణ్యతను దెబ్బతీసి లోహాలు, మిశ్రమ లోహాల వియోగాన్ని ప్రేరేపించే గాలి కాలుష్య కారణం -
ఎ) కార్బన్‌ డై ఆక్సైడ్‌
బి) నైట్రిక్‌ ఆక్సైడ్‌
సి) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌
డి) మీథేన్‌
13. అధిక శరీర ఉష్ణోగ్రత ఉండే జంతువులు -
ఎ) పక్షులు బి) క్షీరదాలు
సి) సరీనృపాలు డి) చేపలు
14. ఆర్జితలక్షణాల అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది -
ఎ) ఛార్లెస్‌ డార్విన్‌                బి) లామార్క్‌
సి) డివ్రీస్‌                            డి) సిడ్నీఫాక్స్‌
15. మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే మెనింజస్‌ పొరల్లో బాహ్యంగా ఉండేది-
ఎ) పయామేటర్‌                బి) అరక్నాయిడ్‌
సి) డ్యురామేటర్‌                డి) ఏదీకాదు
16. సొరచేప కాలేయం నూనెలో అధికంగా ఉండే విటమిన్‌ ఏది?
ఎ) 'ఎ' విటమిన్‌ బి) 'డి' విటమిన్‌
సి) 'సి' విటమిన్‌ డి) 'కె' విటమిన్‌
17. మొక్కల్లో నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కం -
ఎ) ఒఫియోఫిలీ                బి) అనిమోఫిలీ
సి) మెలకోఫిలీ              డి) ఎంటమోఫిలీ
18. ఆపిల్‌పండు ఏ రకమైన ఫలానికి చెందుతుంది?
ఎ) పెపో                బి) హెస్సరీడియం
సి) బెర్రీ                 డి) పోమ్‌
19. కిందివాటిలో హరితమందిర వాయువులు(స్త్రతీవవఅ ష్ట్రశీబరవ స్త్రaరవర) ఏవి?
ఎ) జఉ2            బి) చీ2ఉ
సి) జన4           డి) పైవన్నీ
20.ఫలదీకరణం తర్వాత పుష్పంలోని ఏ భాగం ఫలంగా మారుతుంది?
ఎ) అండం                  బి) పుప్పొడి
సి) అండాశయం            డి) కీలాగ్రం

నీటిని పొదుపుచేయండి జనరల్ సైన్స్


ప్రపంచంలో భారతదేశం అత్యధిక వర్షపాతం నమోదు చేసుకొని, రెండవ స్థానం పొందింది. అయినా నీటికొరతవుంది. నేడు నీటి పరిరక్షణ అనేది అత్యంత అవసరమైన విషయం. నీటి పరిరక్షణ వ్యక్తిగత స్థాయిలో నిజంగా ప్రారంభమవుతుంది. అందుచేత ఈ పరిరక్షణకు చాలా సరళమైన, చౌకగా అనుసరించే పద్ధతులను మన నిత్య కార్యక్రమాలలో అనుసరించొచ్చు. అయితే, ఇవి మన జీవన సరళిలో మార్పును తీసుకురాకుండా అనుసరించవచ్చును. క్రింది కొన్ని చిట్కాలను మీరు అనుసరించొచ్చు. ఇంటి కుళాయిని గట్టిగా బంధించండి., తక్షణం, లీకు అవుతున్న కుళాయిని స్థిరం చేయండి.నిత్యం, పైపులు మరియు టారులెట్లు అడుగుభాగం ఏమయినా లీకయినట్లయితే వెంటనే వాటిని మరమ్మత్తు చేయించండి. నీటిలో కొన్ని జతల ఇటుకలనుంచి నట్లయితే, దాని దానియొక్క సామర్థ్యాన్ని తగ్గించును. ఇది అమెరికాలో, వార్షికంగా ఇంటిల్లిపాది నీటివాడుక విషయంలో 3420 లీటర్ల నీటి వాడకాన్ని పొదుపు చేసినట్లే అని అంచనాలు తెలుపుతున్నాయి. మీ టారులెట్‌ ట్యాంకులలో ఏదయిన ''లీకు''వుందేమో తనిఖీ చేయండి. అందుకుగాను సిస్టర్న్‌లో ఆహారానికి రంగునిచ్చే పదార్థాన్ని స్వల్పంగా వేయండి. ఆ పాత్రలో రంగు క్రమేణా అదృశ్యమవుతున్నట్లయితే లీకు ఉన్నట్టే. కాబట్టి మరమ్మత్తు చేయండి. నీవు దంతాధావనం చేసినపుడు, చేతులను కడుగుకొనేటపుడు లేక తోముకొనేటపుడుగాని, కుళాయిని వదిలేయకండి. అపుడు గ్లాసు లేక పాత్రలో నీరు పోసి, దానితో నోటిని పుక్కిలించుటకు, గడ్డం శుభ్రం చేసేటపుడు లేదా దంతధావనం చేసినప్పుడుగాని పెట్టుకోండి.'షవర్‌'ను ఎప్పుడు ఉపయోగించవద్దు. స్నానానికి ఓ బకెట్‌ నీరు సరిపోతుంది. కూరగాయలు, పండ్లు, మాంసాలను ఓసారి పాత్రలో వేసి కడిగినాక, ఆ నీటిని మీ మొక్కలకు పోయండి. ఉడకబెట్టిన కూరగాయలు, అన్నం, పప్పుల నుండి వచ్చిన నీటిని తిరిగి ఉపయోగించుకోండి. దానిలో సమృద్దిగా పోషకాహార విటమిన్లు మరియు ఖనిజలవణాలుండుటచేత దానితో లాభాన్ని పొందవచ్చును.మీ వాహనాన్ని కడిగేటపుడు పైపుకు బకెట్‌, స్పాంజ్‌ల నుపయోగించండి. ఇలా వాడినట్లయితే 400 లీటర్ల నీరు ఖర్చుకాగా, బకెట్‌తో 300లీటర్లు నీరు పొదుపు అవుతుంది


Followers