కాశ్మీర్‌లో మన కర్తవ్యం - కె. బాలగోపాల్‌ వ్యాసకర్త

అవి దేశ విభజన రోజులు. ఉపఖండమంతటా -ముఖ్యంగా ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాల లో నరమేధం జరుగుతున్నది. హిందూ, సిక్కు మూకలు ముస్లింలను, ముస్లిం మూకలు హిందువులనూ సిక్కులనూ నరుకుతున్నారు, సజీవంగా కాల్చి చంపుతున్నారు. ఇళ్ళు తగుల బెడుతున్నారు. స్త్రీలను రేప్‌ చేస్తున్నారు. ఇంతటి హింసను ఉపఖండం అప్పటివరకు చూసి ఎరుగదు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన కాశ్మీర్‌ వెళ్లా డు. అక్కడి ప్రశాంతత చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న జమ్మూలోను, కొత్తగా ఏర్పడ్డ సరిహద్దుకు ఆవలనున్న పాకిస్థాన్‌లోనూ రక్తం ఏరులయి పారుతున్నా, కాశ్మీర్‌లో చిన్న మైనారిటీగా ఉన్న హిందువులు, సిక్కులు భద్రం గా ఉన్నారు. స్వల్పమైన మత ఘర్షణలు సహితం లేవు.

ఆ పెద్దాయన కాశ్మీరీలను అందుకు అభినందిస్తూ జమ్మూలో హింసను అరికట్టలేకపోయిన మహారాజా హరిసింగ్‌ గద్దె దిగి షేక్‌ అబ్దుల్లాకు అధికారం అప్పగించాలని పత్రికా ముఖంగా డిమాండ్‌ చేశాడు. ఆయన 'హిందువుల ప్రయోజనాలను వ్యతిరేకించే కమ్యూనిస్టు' కాదు, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి కంటే ప్రగాఢమైన రామభక్తి గలవాడు. ఆయనను మహాత్మా గాంధీ అంటారు. ఆ నాటి నుంచి ఈనాటి దాకా దేశంలో మత ఘర్షణలు ఎప్పుడూ జరగని అతి కొద్ది ప్రాంతాలలో కాశ్మీర్‌ ఒకటి. గడచిన నెలరోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత మధ్య కూడ అమర్‌నాథ్‌ యాత్ర ఎప్పటిలాగే సాగింది, సాగుతున్నది.

యాత్రికులకు ఎప్పటిలాగే స్థానిక ప్రజల సహాయ సహకారా లు అందుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనం త సంఖ్య -దాదాపు 5 లక్షల మంది - అమర్‌నాథ్‌కు వెళ్లా రు. వాళ్లపైన దాడికాదు సరికదా ఎటువంటి అసౌకర్యమూ కలగలేదు. సినిమా షూటింగ్‌కు పోయిన తెలుగు సినిమా వారి మీద మాత్రమే పహల్గాంలో రాళ్లు పడ్డట్టున్నాయి. అయినా 'నాలుగు లక్షల మంది కాశ్మీరీ పండిట్‌లు కాశ్మీర్‌లోయ వదిలిపెట్టి పోలేదా?' అని హనుమాన్‌ చౌదరి అడుగుతున్నారు. నాలుగు లక్షల మంది పోలేదుగానీ రెండు లక్ష ల పైగా పోయిన మాట వాస్తవం. దీనికి కారణం హిందువు ల మీద దాడులు జరగడం అనుకుంటే పొరబాటే.

1989లో మొదలైన మిలిటెన్సీ తన రాజకీయ ప్రత్యర్ధులను ఏరి ఏరి హతమార్చింది. అందులో కొందరు పండిట్‌లు ఉన్నారు. అత్యధికం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ముస్లింలున్నారు. కాశ్మీరీ ముస్లింలు గుంపులుగా పండిట్‌ల పైన దాడి చేసిన ఒక్క ఘటనా జరగలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా కాశ్మీర్‌లో సైన్యం చేతిలోనూ మిలిటెం ట్ల చేతిలోనూ ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాల చేతిలోనూ చనిపోయిన వారి సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 50 వేల నుంచి 80 వేల దాకా ఉంది. అందులో పండిట్‌ల సంఖ్య 300 మించి లేదు. మిగిలిన వారంతా- ఎవరి చేతిలో చచ్చినా- కాశ్మీరీ ముస్లింలే.

మిలిటెన్సీ కాశ్మీరీ సంస్థల చేతి నుంచి పాకిస్థాన్‌ కేంద్రంగా గల ఇస్లాం వాద సాయుధ సంస్థ ల చేతిలోకి పోయిన తరువాత మిలిటెంట్లు మూకుమ్మడిగా నిరాయుధులను చంపిన ఉదంతాలు జరిగాయి, జరుగుతున్నాయి గానీ అంతకు ముందు అది కూడ లేదు. అయినప్పటికీ పండిట్‌లు పెద్ద సంఖ్యలో పారిపోవడానికి తమ భవితవ్యాన్ని గురించి ఏర్పడిన అభద్రతా భావం కారణం. లక్షల మంది వీధులలోకి వచ్చి ఇండియా-వ్యతిరేక నినాదాలిస్తున్నారు. కొందరు పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థ కుప్ప కూలిపోయింది.

పండిట్‌లు కాశ్మీర్‌లోయ విడిచిపెట్టి పోవాలన్న పోస్టర్లు కొన్ని చోట్ల పడ్డాయి. దీనికి పండిట్‌లు భయపడటం సహజం. ఆ స్థితిలో ప్రభుత్వం వారికి భరోసా ఇచ్చి వుంటే పండిట్‌ల వలస జరిగి ఉండేది కాదే మో గానీ అప్పటి గవర్నర్‌ జగ్‌మోహ న్‌ ఆలోచనారీతి ప్రస్తుత సంక్షోభానికి కారకుడైన గవర్నర్‌ సిన్హా ఆలోచనారీతి లాంటిదే. పండిట్‌లను ప్రభుత్వం కాపాడజాలదనీ వారి భద్ర త కోసం వారు లోయను విడిచిపెట్టి వెళ్లిపోవడం ఉత్తమమనీ రాష్ట్ర గవర్నర్‌ స్వయంగా ప్రకటించడం పండిట్‌ల భయాన్ని మరింత పెంచి భారీ వలసకు దారితీసింది. 








Tags: కాశ్మీర్‌లో మన కర్తవ్యం - కె. బాలగోపాల్‌ వ్యాసకర్త, కె. బాలగోపాల్‌ వ్యాసాలు, వ్యాసాలు.



Teacher Eligibility Test Notification 2011,Exam Pattern and Syllabus, TET Eligibility Test 2011 Exam Pattern and Syllabus, AP TET Eligibility Test 2011 Exam Pattern and Syllabus,




ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదలవుతుంది. బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఇప్పుడు, భాషా పండితులకు కూడా 'టెట్' రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జూలై 31(ఆదివారం)న నిర్వహించదలచిన 'టెట్' పరీక్ష ఫలితాలను ఆగస్టు 15న ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్ష రాస్తారని అధికారుల అంచనా.

పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు పొందిన ఓసీ అభ్యర్ధులను పాసైనట్లు పరిగణిస్తారు. బీసీ అభ్యర్ధులైతే 50 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులైతే 40 శాతం మార్కులు సంపాదిస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో 'టెట్' మార్కులకు 20 శాతం వెయిటేజి ఇస్తారు. వచ్చే డీఎస్సీ నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఏటా రెండు సార్లు 'టెట్' నిర్వహిస్తారు. ఒక సారి పాసైన అభ్యర్ధులకు జారీ చేసే సర్టిఫికెట్, ఏడు సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది.
'టెట్' మార్కులకు డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో 20 శాతం మేర వెయిటేజి ఉన్నందున, మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎన్ని సార్లయినా టెట్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. పరీక్ష తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒరియా, తమిళం, గుజరాతీ.. ఈ తొమ్మిది భాషలలో నిర్వహిస్తారు. పరీక్ష 2 పేపర్లుగా ఉంటుంది. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించే టీచర్ల కోసం పేపర్-1, 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం పేపర్-2 నిర్వహిస్తారు. 8వ తరగతి వరకు బోధించే టీచర్లు రెండు పేపర్లూ రాయాలి.




Tags:Teacher Eligibility Test Notification 2011,Exam Pattern and Syllabus, TET Eligibility Test  2011 Exam Pattern and Syllabus, AP TET Eligibility Test  2011 Exam Pattern and Syllabus,

Followers